HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Mega Parent Teacher Meet In Ap On December 7 Meeting With 1 Crore 20 Lakh People

Mega Parent Teacher Meet: డిసెంబ‌ర్ 7న ఏపీలో మెగా పేరెంట్ టీచర్ మీట్.. కోటి 20 ల‌క్ష‌ల మందితో మీటింగ్‌!

పిల్లలు చేత ఇన్విటేషన్ తయారు చేయించి తల్లిదండ్రులను సమావేశానికి పిలుస్తున్నామ‌ని, టీచర్ పేరెంట్స్ మీటింగ్ నిర్వహిస్తున్న దేశంలోనే మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అధికారులు అంటున్నారు.

  • Author : Gopi Date : 04-12-2024 - 5:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mega Parent Teacher Meet
Mega Parent Teacher Meet

Mega Parent Teacher Meet: డిసెంబ‌ర్ 7న ఏపీలో మెగా పేరెంట్ టీచర్ మీట్ (Mega Parent Teacher Meet) నిర్వహించ‌నున్న‌ట్లు విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శ‌శిధ‌ర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠ‌శాల‌ల‌కు ధీటుగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామ‌న్నారు. మధ్యాహ్న భోజనం, వాటర్, పుస్తకాలు ఎలా అనే అంశాల‌పై సౌకర్యాలు కల్పిస్తున్నామ‌న్నారు. డిసెంబర్ 7న 44303 స్కూల్స్‌లో టీచర్స్ పేరెంట్స్ మీట్ పెడుతున్నట్లు అధికారులు వివ‌రించారు. ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు సమావేశం జ‌ర‌గ‌నుంది. ఈ మీటింగ్‌లో కోటి 20 లక్షల మంది పాల్గొన‌నున్న‌ట్లు స‌మాచారం.

పిల్లలు చేత ఇన్విటేషన్ తయారు చేయించి తల్లిదండ్రులను సమావేశానికి పిలుస్తున్నామ‌ని, టీచర్ పేరెంట్స్ మీటింగ్ నిర్వహిస్తున్న దేశంలోనే మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అధికారులు అంటున్నారు. హోలిస్టిక్ ప్రోగ్రాస్ కార్డు ఇస్తున్నామ‌ని, విద్యార్థుల గురించి అన్ని విషయాలు ఈ ప్రోగ్రాస్ కార్డులో ఉంటాయన్నారు. సైబర్ ఆవేర్న్స్, ముగ్గుల పోటీలు వంటివి తల్లి దండ్రులకు పెడుతున్నట్లు అధికారులు తెలిపారు. స్కూల్స్‌లో హెల్త్‌ కార్డులు ఇవ్వ‌ట‌మే కాకుండా.. 900 స్కూల్స్ లో స్క్రీనింగ్ చేయ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు.

Also Read: Kakinada Port : జగన్ మాఫియా పై..ప్రజా ఉద్యమం పెల్లుబకాల్సిన అవసరం

అంతేకాకుండా స్కూల్స్‌కి స్టార్ రేటింగ్స్ ఇవ్వ‌నున్నారు. మౌలిక వసతులు, విద్యా ఫలితాల ఆధారంగా స్టార్ రేటింగ్ ఇవ్వ‌నున్నారు. 0 నుండి 5 వరకు రేటింగ్ ఇస్తారు. డోనర్స్ ని కూడా పిలుస్తున్నామ‌న్నారు. మీటింగ్ లో తల్లిదండ్రుల నుండి సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. మధ్యాహ్న భోజనం పిల్లలతో పాటు తల్లిదండ్రులకు కూడా ఏర్పాటు చేయ‌నున్నారు. ఇది పొలిటికల్ ప్రోగ్రాం కాదని.. అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు వస్తారని ప్ర‌భుత్వ అధికారులు వెల్ల‌డించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నుండి వార్డు సభ్యుడి వరకు సమావేశానికి హాజరు కావాలని అధికారులు కోరుతున్నారు. ముఖ్యమంత్రి బాపట్లలో పాల్గొంటారని, విద్యాశాఖ మంత్రి కూడా అక్కడే పాల్గొంటారని తెలుస్తోంది. పిల్లల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు సమయం కేటాయించాలన్నారు. స్టార్ రేటింగ్ మీటింగ్ లో ఇస్తామ‌ని, ఐటీ ప్లాట్ ఫామ్ క్రియట్ చేస్తున్నామ‌న్నారు. ప్రైవేట్ స్కూల్స్ కంటే ప్రభుత్వ స్కూల్స్‌లో మౌలిక వసతులు బాగున్నాయని, రాధాకృష్ణ రిపోర్ట్ రాగానే పని చేస్తామ‌ని విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శ‌శిధ‌ర్ తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • ap govt
  • Baptla
  • CM Chandrababu
  • Education Minister Nara Lokesh
  • Mega Parent Teacher Meet
  • telugu news

Related News

CM Chandrababu's Remarks at the 7th Phase Collectors' Conference

CM Chandrababu : మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం

పీజీఆర్ఎస్ సహా ప్రజల నుంచి వచ్చే అర్జీలను మానవీయ కోణంలో పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉద్యోగులు, అధికారులు సాఫ్ట్ స్కిల్స్ అలవరచుకోవాలని స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పని తీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”ఉద్యోగులు వినూత్నంగా ఆలోచనలు చేసేలా ప్రోత్

  • Actress Shweta Menon resigns as 'AMMA' President.

    Shweta Menon: ‘అమ్మ’ అధ్యక్ష పదవికి నటి శ్వేతా మీనన్ రాజీనామా

  • ‘Amazon Beautyverse 2026’ event concludes in Mumbai

    Amazon Beautyverse 2026: ముంబైలో ముగిసిన ‘అమెజాన్ బ్యూటీవర్స్ 2026’ ఈవెంట్

  • CM Chandrababu: Good news for AP students – 4% interest subsidy on education loans.

    CM Chandrababu: ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. విద్యా రుణాలపై వడ్డీలో 4% రాయితీ

  • 'Towing' food app launched in Vijayawada.

    Toing Food Delivery app: విజయవాడలో ‘టోయింగ్’ ఫుడ్ యాప్ ప్రారంభం

Latest News

  • AP : ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు!

  • Plants: కుబేరుడికి ఎంతో ఇష్టమైన ఈ 3 చెట్లను ఇంట్లో ఈ దిక్కున నాటితే చాలు.. కాసుల వర్షం కురుస్తుంది.

  • Stock Market: స్టాక్ మార్కెట్ జోరు..లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • Accident : విధి నిర్వహణలో విషాదం.. లారీ ఢీకొని రవాణా శాఖ అధికారి వెంకన్న మృతి

  • Keir Starmer: బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా..అసలు కారణాలు ఇవే!

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd