HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Amazon Beautyverse 2026 Event Concludes In Mumbai

Amazon Beautyverse 2026: ముంబైలో ముగిసిన ‘అమెజాన్ బ్యూటీవర్స్ 2026’ ఈవెంట్

  • Author : Vamsi Chowdary Korata Date : 22-06-2026 - 11:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
‘Amazon Beautyverse 2026’ event concludes in Mumbai
‘Amazon Beautyverse 2026’ event concludes in Mumbai

Amazon Beautyverse 2026 : అమెజాన్ ఇండియా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మూడవ ఎడిషన్ ‘అమెజాన్ బ్యూటీవర్స్ 2026’ దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అత్యంత వైభవంగా ముగిసింది. రాబోయే అమెజాన్ ప్రైమ్ డే సేల్‌కు ముందు జరిగిన ఈ ఈవెంట్, ఇప్పటివరకు దేశంలోనే నమోదైన అతిపెద్ద బ్యూటీ ఈవెంట్‌గా సరికొత్త రికార్డు సృష్టించింది. ముంబైలోని ప్రసిద్ధ వర్లీ సీ లింక్‌పై అద్భుతమైన ప్రొజెక్షన్‌తో ప్రారంభమైన ఈ వేడుకకు దాదాపు 2,500 మందికి పైగా అతిథులు హాజరయ్యారు. వీరిలో 1,500 మందికి పైగా డిజిటల్ క్రియేటర్లు, ప్రైమ్ మెంబర్లు, లీడింగ్ బ్యూటీ బ్రాండ్ల ప్రతినిధులతో పాటు బాలీవుడ్ స్టార్స్ అనన్యా పాండే, జాక్లిన్ ఫెర్నాండెజ్, శిల్పా షెట్టీ, సొనాక్షీ సిన్హా, మీరా కపూర్, కరిష్మా కపూర్ వంటి ప్రముఖ సెలబ్రిటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గ్లోబల్ బ్యూటీ ఇన్నోవేషన్స్, ప్రీమియం బ్యూటీ ప్రొడక్ట్స్ మరియు ఇంగ్రేడియంట్-లెడ్ స్కిన్‌కేర్ విభాగాలపై నిపుణుల చర్చలు, లైవ్ ట్రెండ్ షోకేస్‌లు ఈ ప్రదర్శనలో వీక్షకులను ఎంతగానో మైమరపించాయి.

ఈ ఏడాది బ్యూటీవర్స్ ఈవెంట్‌లో అమెజాన్ ఇండియా ఒక సరికొత్త విప్లవాత్మక అడుగు వేసింది. కేవలం ముంబై వేదికకే పరిమితం కాకుండా, మొదటిసారిగా Amazon.in యాప్ మరియు వెబ్‌సైట్‌లో ప్రత్యేకంగా ‘బ్యూటీవర్స్ స్టోర్‌ఫ్రంట్’ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా భారతదేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది కస్టమర్లు ఇంట్లోనే కూర్చుని సరికొత్త సౌందర్య ట్రెండ్‌లను వీక్షించే, ప్రముఖ క్రియేటర్ల బ్యూటీ టిప్స్ తెలుసుకునే మరియు ప్రైమ్ డే ప్రత్యేక ఆఫర్లతో షాపింగ్ చేసే అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. కంటెంట్, కమ్యూనిటీ, టెక్నాలజీ మరియు ఈ-కామర్స్ (వాణిజ్యం) రంగాలను ఒకేతాటిపైకి తీసుకురావడం ద్వారా, భారతదేశంలో ఆన్‌లైన్ బ్యూటీ ప్రొడక్ట్స్ కొనుగోళ్లకు తానే అతిపెద్ద కేరాఫ్ అడ్రస్ అని అమెజాన్ బ్యూటీ మరోసారి నిరూపించుకుంది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amazon
  • Amazon Beautyverse 2026
  • Amazon India Prime Day
  • Ananya Panday
  • Jacqueline Fernandez
  • Karisma Kapoor
  • Mumbai Worli Sea Link Projection
  • shilpa shetty
  • telugu news

Related News

    Latest News

    • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

    • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

    • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

    • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

    • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd