HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >Actress Shweta Menon Resigns As Amma President

Shweta Menon: ‘అమ్మ’ అధ్యక్ష పదవికి నటి శ్వేతా మీనన్ రాజీనామా

  • Author : Vamsi Chowdary Korata Date : 22-06-2026 - 12:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Actress Shweta Menon resigns as 'AMMA' President.
Actress Shweta Menon resigns as 'AMMA' President.

మలయాళ నటీనటుల సంఘం ‘అమ్మ’ (Association of Malayalam Movie Artists – AMMA) లో ఊహించని రాజకీయ సునామీ చెలరేగింది. అంతర్గత కుమ్ములాటలు, మతపరమైన వేధింపుల ఆరోపణలు, ఆర్థిక వివాదాలు ముదరడంతో.. ‘అమ్మ’ ప్రెసిడెంట్, స్టార్ హీరోయిన్ శ్వేతా మేనన్‌తో పాటు మెజారిటీ కార్యవర్గ సభ్యులంతా మూకుమ్మడిగా తమ పదవులకు రాజీనామా చేశారు. శ్వేతా మేనన్ ఏకంగా అసోసియేషన్ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా వదిలేస్తున్నట్లు ప్రకటించడంతో మాలీవుడ్ నివ్వెరపోయింది.

‘అమ్మ’ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా గతేడాది ఆగస్టులో జరిగిన ఎన్నికల్లో ఇద్దరు మహిళలు అత్యున్నత పీఠాలను దక్కించుకున్నారు. శ్వేతా మేనన్ అధ్యక్షురాలిగా, ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ కుక్కు పరమేశ్వరన్ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్నారు. కానీ చట్టబద్ధంగా ఏడాది కూడా పూర్తికాకముందే ఈ కమిటీ ఘోరమైన వివాదాలతో కూలిపోయింది.

ఈ ఇండస్ట్రీ గ్రూప్ వార్‌కు ప్రధాన కారణం మాజీ జాయింట్ సెక్రటరీ అన్సిబా హసన్ చేసిన ఆరోపణలే. అసోసియేషన్ అధికారిక కార్యక్రమాలకు కొన్ని మత సంస్థలను స్పాన్సర్లుగా తీసుకురావడాన్ని ఆమె తీవ్రంగా అభ్యంతరపెట్టారు. దాన్ని ప్రశ్నించినందుకు కమిటీలోని కొందరు సభ్యులు తనను మత కోణంలో టార్గెట్ చేస్తూ, మానసికంగా వేధిస్తూ ఒంటరిని చేశారని అన్సిబా బహిరంగంగా విమర్శించారు. దీనికి తోడు వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీప్రియ కూడా కమిటీ పారదర్శకతను ప్రశ్నించడంతో వివాదం పతాక స్థాయికి చేరింది.

రాజీనామా అనంతరం శ్వేతా మేనన్ ప్రెస్‌మీట్ పెట్టి బాంబ్ పేల్చారు. “మా కమిటీని అప్రతిష్ఠపాల్జేసి గద్దె దించడానికి తెరవెనుక కొందరు తమ సొంత ఎజెండాతో పెద్ద కుట్రలు చేశారు. ఇప్పటికే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు పాత నేతలకు మళ్లీ ఈ కమిటీ బాధ్యతలు అప్పగించేందుకే ఈ డ్రామాలు ఆడుతున్నారు. నా సమయంలో పైసా కూడా అవినీతి జరగలేదు, అంతా పారదర్శకంగా ఉంది. అసలు స్కామ్‌లు, పరిపాలన అవకతవకలు గతంలో ఉన్న బాబూరాజ్ పాలనలోనే జరిగాయి” అంటూ బహిరంగంగా పేర్లు బయటపెట్టారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AMMA Association
  • Ansiba Hassan
  • Kukku Parameswaran
  • Malayalam Movie
  • Shweta Menon
  • telugu news

Related News

‘Amma’s’ resignation sparks a stir... what exactly is happening?

‘అమ్మ’ రాజీనామా కలకలం.. అసలేం జరుగుతోంది

మలయాళ సినీ తారల సంఘం ‘అమ్మ’లో సంక్షోభం మరింత ముదిరింది. జస్టిస్ హేమా కమిటీ నివేదిక వెలువడిన తర్వాత చెలరేగిన వివాదాల నేపథ్యంలో అప్పటి అధ్యక్షుడు మోహన్‌లాల్, ఆయన కార్యవర్గం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ‘అమ్మ’కు తొలి మహిళా అధ్యక్షురాలిగా రికార్డు సృష్టిస్తూ నటి శ్వేతా మీనన్ బాధ్యతలు చేపట్టారు. అయితే, తాజాగా జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆమె క

    Latest News

    • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

    • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

    • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

    • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

    • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd