IAS Officers: ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ.. 8 జిల్లాల కొత్త కలెక్టర్లు వీరే.. !
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ఐఏఎస్ అధికారుల (IAS Officers)ను బదిలీ చేసింది.
- Author : Gopichand
Date : 07-04-2023 - 8:43 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ఐఏఎస్ అధికారుల (IAS Officers)ను బదిలీ చేసింది. 8 జిల్లాల కలెక్టర్లు సహా 57 మందికి స్థానచలనం కలిగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్‌రెడ్డి గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు (జీవో 635) జారీ చేశారు. ఒకేసారి ఇంత మంది అధికారులను బదిలీ చేయడం చర్చనీయాంశమైంది.
ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 57 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీరికి పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐటీ శాఖ కార్యదర్శిగా కోన శశిధర్, ఎస్సీ కమిషన్ కార్యదర్శిగా హర్షవర్ధన్, కార్మికశాఖ కమిషనర్‌గా శేషగిరిబాబు, కార్మికశాఖ కార్యదర్శిగా హరిజవహర్‌లాల్, జెన్‌కో ఎండీగా చక్రధర్‌బాబు, పురపాలక డైరెక్టర్‌గా కోటేశ్వరరావు, పంచాయతీరాజ్ కమిషనర్‌గా సూర్యకుమారి బాధ్యతలు చేపట్టనున్నారు. చిత్తూరు, నెల్లూరు అనంతపురం, విజయనగరం, బాపట్ల, కర్నూలు, కృష్ణ, సత్యసాయి జిల్లాలకు కొత్త కలెక్టర్ నియామించారు.
Also Read: LSG vs SRH: తొలి విజయం కోసం హైదరాబాద్.. రెండో విజయం కోసం లక్నో.. గెలుపెవరిదో..?
ఏపీలో 8 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నెల్లూరు కలెక్టర్‌గా ఎం.హరినారాయణ్, విజయనగరం కలెక్టర్‌గా నాగలక్ష్మి, చిత్తూరు కలెక్టర్‌గా షన్మోహన్, కర్నూలు కలెక్టర్‌గా సృజన, బాపట్ల కలెక్టర్‌గా రంజిత్ బాషా, కృష్ణా జిల్లా కలెక్టర్‌గా రాజబాబు, సత్యసాయి జిల్లా కలెక్టర్‌గా పి.అరుణ్‌బాబు, అనంతపురం కలెక్టర్‌గా ఎం. గౌతమిని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.