YS Jagan: వైసీపీలో భారీగా మార్పులు, చేర్పులు…జిల్లాల్లో కొత్త అధ్యక్షుల నియామకం..!!
- Author : hashtagu
Date : 24-11-2022 - 8:51 IST
Published By : Hashtagu Telugu Desk
రానున్న అసెంబ్లీ ఎన్నికలను చాలా కీలకంగా తీసుకున్నారు వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి. ఈ ఎన్నికల్లో ఒకసారి గెలిస్తే…మరో 25ఏళ్లు వరకు ఎలాంటి సమస్యలు ఉండవని ఇప్పటికే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు జగన్. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గాల వారిగా సమావేశాలు నిర్వహించారు. సమస్యలు తెలుసుకోవడంతోపాటు..వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నియోజకవర్గానికి ఏ పథకం ద్వారా ఎంత లబ్ది చేకూరిందన్న విషయాలను వెల్లడిస్తున్నారు. అయితే రీజినల్ కో ఆర్డినేటర్ల నియామకాల్లో మార్పులు చేసిన జగన్….ఇప్పుడు పార్టీ జిల్లా అధ్యక్షుల్లోనూ కొన్ని మార్పులు చేశారు.
కొన్ని జిల్లాల్లో ఖాళీలను భర్తీ చేస్తూ…మరొకొన్ని జిల్లాల అధ్యక్షులను మార్చారు.
1. పార్వతీపురం – పుష్ప శ్రీవాణి స్ధానంలో వశిష్ట రాజు
2. విశాఖ పట్నం జిల్లా -ముత్తంశెట్టి శ్రీనివాస్ స్ధానంలో పంచకర్ల రమేశ్
3. గుంటూరు జిల్లా-సుచరిత స్థానంలో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్
4. ప్రశాశం – బుర్ర మధుసూదన్ యాదవ్ స్థానంలో జంకె వెంటకరెడ్డి
5. కర్నూలు -మేయర్ బీవై రామయ్యకు బాధ్యతలు
6. అనంతపురం-పూల నర్సింహయ్య
7. చిత్తూరు -భరత్
కాగా అనుబంధ విభాగాల కోఆర్టినేటర్ గా చెవిరెడ్డి భాస్కరరెడ్డికి బాధ్యతలు అప్పగించడంతో…తిరుపతి జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించారు. తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి స్థానంలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి బాధ్యతలను అప్పగించారు జగన్.