Man Dies While Watching Avatar 2: ఏపీలో విషాదం.. అవతార్ 2 సినిమా చూస్తూ వ్యక్తి మృతి
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాలో ఇటీవల విడుదలైన 'అవతార్ 2' (Avatar 2) చిత్రం చూస్తున్న వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన పెద్దాపురం నగరంలో కలకలం రేపుతోంది.
- Author : Gopichand
Date : 17-12-2022 - 2:46 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాలో ఇటీవల విడుదలైన ‘అవతార్ 2’ (Avatar 2) చిత్రం చూస్తున్న వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన పెద్దాపురం నగరంలో కలకలం రేపుతోంది. మృతుడు లక్ష్మీరెడ్డి శ్రీనుగా గుర్తించారు. ఇటీవల విడుదలైన అవతార్ 2 (Avatar 2) సినిమా చూసేందుకు శ్రీను తన సోదరుడు రాజుతో కలిసి పెద్దాపురం వెళ్లినట్లు సమాచారం. సినిమా చూస్తుండగా శ్రీను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడని అతని సోదరుడు చెప్పాడు. వెంటనే పెద్దాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
లక్ష్మీరెడ్డి శ్రీనుకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. తైవాన్‌లో 42 ఏళ్ల వ్యక్తి 2010లో విడుదలైన ‘అవతార్’ చిత్రం మొదటి భాగాన్ని చూస్తున్నప్పుడు గుండెపోటుతో మరణించాడు. అవతార్: ది వే ఆఫ్ వాటర్ మూవీ డిసెంబరు 2009లో విడుదలైన అవతార్‌కి సీక్వెల్. 13 సంవత్సరాలు నిర్మాణంలో ఉంది. 2500 కోట్లు ఖర్చు పెట్టి ఈ సినిమా నిర్మించారు. ఈ చిత్రానికి దర్శకుడు జేమ్స్ కామెరూన్.
Also Reading: Supreme Court: సుప్రీం సంచలన నిర్ణయం.. బిల్కిస్ బానో పిటిషన్ కొట్టివేత