HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Machilipatnam Ration Rice Scam Investigation Keys Evidence

Ration Rice Scam : రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులకు కీలక ఆధారాలు..

Ration Rice Scam : ఏప్రిల్, మే నెలల్లో అధికారులు ఎన్నికల విధుల్లో ఉండగా, నిందితులు బియ్యాన్ని తరలించినట్లు అనుమానిస్తున్నారు. మినీ వ్యానులను ఉపయోగించినట్లు గుర్తించారు. గోడౌన్ మేనేజర్ మానస్ తేజతో సహా ఇతర నిందితులు 378.866 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పక్కదారి పట్టించారని పోలీసులు వెల్లడించారు.

  • Author : Kavya Krishna Date : 09-01-2025 - 7:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Perni Nani, Perni Jayasudha
Perni Nani, Perni Jayasudha

Ration Rice Scam : మచిలీపట్నంలో జరిగిన రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ఏప్రిల్, మే నెలల్లో అధికారులు ఎన్నికల విధుల్లో ఉండగా, నిందితులు బియ్యాన్ని తరలించినట్లు అనుమానిస్తున్నారు. మినీ వ్యానులను ఉపయోగించినట్లు గుర్తించారు. గోడౌన్ మేనేజర్ మానస్ తేజతో సహా ఇతర నిందితులు 378.866 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పక్కదారి పట్టించారని పోలీసులు వెల్లడించారు.

రేషన్ బియ్యం మాయం కేసులో వైసీపీ నేత , మాజీ మంత్రి పేర్ని నాని గురించిన అనుమానాలు కూడా గట్టిపడ్డాయి. గోడౌన్ మేనేజర్ మానస్ తేజ అకౌంట్ నుండి పేర్ని నాని అకౌంటుకి రూ.1.75 లక్షలు బదిలీ చేసిన విషయం పై విచారణ కొనసాగుతోంది. మేనేజర్ తక్కువ జీతం అయినప్పటికీ రూ.25 లక్షల లావాదేవీలు జరిపినట్లు ఆరా తీస్తున్నారు. ఈ మొత్తం సొమ్ము ఆయనకు ఎలా వచ్చిందనే అంశంపై ప్రశ్నలు వేస్తున్నారు.

Tirupati Stampede Incident : తొక్కిసలాట ఘటన వివరాలను అడిగి తెలుసుకున్న పవన్

నిందితులను కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకున్న పోలీసులు, బ్యాంకు లావాదేవీలపై విచారణ చేపట్టారు. మేనేజర్ మానస్ తేజ, డ్రైవర్ మంగారావు, మిల్లర్ ఆంజనేయులను విచారించినప్పుడు, వారు సరిగా సహకరించలేదు. తద్వారా, పోలీసులు వారిని మరికొన్ని రోజులు కస్టడీకి పంపించాలని కోర్టుకు పిటీషన్ దాఖలు చేయాలని యోచిస్తున్నారు.

నిందితులు ముగ్గురు కూడా మాజీ మంత్రి పేర్ని నాని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. రేషన్ బియ్యం తరలించడంలో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని, తమ పరిధిలోనే మాములుగా జరిగినట్టు చెబుతున్నారు. అయితే, పోలీసులు ఈ స్టేట్ మెంట్‌ని నమ్మడం లేదు. భారీ మొత్తంలో బియ్యం తరలించడం సాధ్యం కాదని, ఇందులో పెద్ద వ్యక్తుల హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మరోవైపు, కేసులో ప్రధాన నిందితురాలు, మాజీ మంత్రి పేర్ని సతీమణి జయసుధ కూడా మేనేజర్ మానస్ తేజే ఈ పని చేశాడని చెప్పినట్లు తెలుస్తోంది.

ఆమెను మరొకసారి విచారించే అవకాశం ఉందని వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పర్యవసానంగా, మచిలీపట్నం రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని చుట్టూ ఉచ్చు బిగించే చర్యలు జరుగుతున్నాయి.

CM Chandrababu : వైకుంఠ దర్శనాన్ని పది రోజులకు ఎందుకు పెంచారో తెలియదు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh politics
  • key evidence
  • machilipatnam
  • Manas Teja
  • perni nani
  • police investigation
  • Political Scandal
  • Ration Distribution
  • Ration Rice Scam
  • Scam Investigation
  • Vysakhulu

Related News

3 Years of Yuva Galam Padayatra Nara Lokesh

నారా లోకేష్ యువగళం పాదయాత్రకు మూడేళ్లు.. ఘనంగా సంబరాలు

3 Years of Yuva Galam Padayatra Nara Lokesh  నారా లోకేశ్ నిర్వహించిన యువగళం పాదయాత్ర ప్రారంభించి నేటికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలు ఘనంగా సంబరాలు నిర్వహించారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఉదయం పార్టీ కార్యాలయానికి చేరుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్‌కు నేతలు

  • Chandrababu Naidu About Greatness Of Paritala Ravi On His Death Anniversary

    పరిటాల రవీంద్ర వర్థంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళి

Latest News

  • తెలంగాణ రైతులకు శుభవార్త..

  • యూపీఐ ద్వారా డబ్బు కట్ అయి, పేమెంట్ ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది?

  • పెళ్లి తర్వాత లవ్ మ్యారేజ్ పై కీర్తి సురేష్ షాకింగ్ కామెంట్స్ !

  • యూజీసీపై సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు!

  • ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టీ20 ప్రపంచ కప్.. స్టార్ స్పోర్ట్స్ అదిరిపోయే ప్రోమో…!!!

Trending News

    • ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు..

    • పంజాబ్ సరిహద్దుల్లో భారీ కుట్ర భగ్నం.. 43 కిలోల హెరాయిన్, గన్, బులెట్లు, గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్న విలేజ్ డిఫెన్స్ కమిటీ

    • అజిత్ పవార్‌ విమానం కూలిపోయే ముందు కాక్‌పిట్ నుంచి గుండెలు పిండేసే ఆఖరి మాటలివే!

    • అజిత్ పవార్ విమాన ప్రమాదానికి ముందు పైలట్ తన అమ్మమ్మకు పంపిన చివరి మెసేజ్ ఇదే !

    • స్మార్ట్‌ఫోన్ యూజర్లు జాగ్రత్త.. బయటకు వెళ్లేటప్పుడు వై-ఫై ఆన్ చేసి ఉంచుతున్నారా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd