HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Low Pressure Effect Yellow Alert For These Districts

Andhra Pradesh : అల్పపీడనం ఎఫెక్ట్..ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్..!

  • Author : Vamsi Chowdary Korata Date : 22-11-2025 - 4:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Andhra Pradesh Yellow Alert
Andhra Pradesh Yellow Alert

ఏపీని మరోసారి వరుణుడు పలకరించనున్నాడు. అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం రెండు రోజుల్లో బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు నవంబర్ 28 నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకూ ఏపీలో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.

ఏపీవాసులకు ముఖ్య గమనిక. రాష్ట్రంలో మరోసారి వర్షాలు కురవనున్నాయి. ఉపరితల ఆవర్తన ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ.. నవంబర్ 24వ తేదీన.. అంటే మరో రెండు రోజులలోఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ వాయుగుండం మరింతగా బలపడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాలు, రాయలసీమ జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

మరోవైపు వచ్చే రెండు రోజులు రాయలసీమ, దక్షిణ కోస్తాలోని కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాతో పాటుగా, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, వైఎస్సార్ కడప జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసేందుకు ఆస్కారం ఉందని వెల్లడించారు.

మరోవైపు దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఆ తర్వాతి 48 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి.. నైరుతి బంగాళాఖాతంలో మరింత బలపడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో నవంబర్ 28 నుంచి డిసెంబర్ 01 వరకు ఏపీలోని కొన్నిప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

వర్షాల నేపథ్యంలో రైతులకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పలు సూచనలు చేసింది. వరి కోతలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో రైతులు వెంటనే కుప్పలు వేసుకోవాలని సూచించింది. పండిన ధాన్యాన్ని తడవకుండా సురక్షితంగా భద్రపరచుకోవాలని తెలిపింది. ధాన్యం రంగుమారకుండా ఉండేందుకు పూర్తిగా పట్టాలతో కప్పి ఉంచాలని.. తడిసిన గింజలు మొలకెత్తకుండా, నాణ్యత కోల్పోకుండా జాగ్రత్త పడాలని రైతులకు సూచనలు చేసింది.

వరికోతల నేపథ్యంలో రైతులు ముందుగానే వ్యవసాయ పనుల్లో తగిన చర్యలు తీసుకోవాలని.. పండిన ధాన్యాన్ని జాగ్రత్త పరుచుకోవాలని సూచించింది. ఇక అత్యవసర సహాయం కోసం కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112,1070, 18004250101 సంప్రదించాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra Pradesh Weather Update
  • APSDMA
  • APSDMA alerts
  • coastal Andhra Pradesh
  • Heavy Rains Alert
  • Rayalaseema
  • weather updates

Related News

Heavy rains in Telangana

Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం సీజన్ ప్రారంభమై దాదాపు 38 రోజులు గడుస్తున్నా, ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనగా, మిగిలిన 17 జిల్లాల్లో కేవలం సాధారణ వర్షపాతమే నమోదైనట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ వెల్లడించింది. ఈ వానాకాలం సీజన్ సాగు పరిస్థితులపై వ్యవసాయశాఖ బుధవారం ప్రభుత్వాన

  • Alert for the people of AP: Heavy rain warning for these districts.

    Rain Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక..

  • Rains inundating Mumbai

    Heavy Rains: ముంబైని ముంచెత్తుతున్న వర్షాలు

  • Heavy rains in Maharashtra

    Heavy Rains: మహారాష్ట్రలో భారీ వర్షాలు

  • Heavy rains in Telangana

    Heavy Rains: ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Latest News

  • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

  • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

  • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

  • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd