HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Lokesh Said No Prospect Of Leaving Anyone Who Had Humiliated His Mother

Nara Lokesh: నా త‌ల్లిని కించపరిచిన.. ఏ ఒక్క‌రినీ వదిలిపెట్టే ప్ర‌శ‌క్తే లేదు..!

  • Author : HashtagU Desk Date : 24-02-2022 - 4:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nara Lokesh
Nara Lokesh

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ఈరోజు విశాఖ కోర్టుకు హాజ‌రైయ్యారు. ఈక్ర‌మంలో సాక్షి స‌హా మూడు మీడియా సంస్థ‌ల‌పై లోకేష్ ప‌రువు న‌ష్టం దావా వేశారు. ఈ కేసులో లోకేష్ ఈ రోజు విచార‌ణ‌కు హాజ‌రైయ్యారు. త‌న‌పై త‌ప్పుడు క‌థ‌నాలు ప్ర‌చురించిన వీక్ మీడియా క్షమాపణలు కోరిందని, అయితే సాక్షి, దక్కన్ క్రానికల్ మీడియా సంస్థ‌లు మాత్రం వివరణ కూడా ఇవ్వలేదని లోకేష్ తెలిపారు.

మాజీ మంత్రి వివేక హత్య తర్వాత చంద్రబాబుపై సాక్షి మీడియా దుష్ప్రచారం చేశార‌ని..త‌మ‌పై అసత్య కథనాలు ప్రచురించారని ఆరోపించారు. మొదటి నుంచీ సాక్షి మీడియా త‌న‌పై దుష్ప్రచారం చేస్తోందని.. వ్యక్తిగత జీవితంపై కూడా సాక్షి మీడియా బురద జల్లిందన్నారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం సాక్షి మీడియా చేసిందని, తప్పుడు వార్తలు రాస్తే చట్టప్రకారం ముందుకు వెళ్తాన‌ని లోకేష్ స్ప‌ష్టం చేశారు.

టీడీపీ కోసం ప్రత్యేక ఐపీసీ సెక్షన్‍ను వైసీపీ పెట్టిందని ఇప్పుడు త‌న‌పై మర్డర్ కేసు సహా 13 కేసులు పెట్టారన్నారు. ప్రజల తరపున పోరాడుతున్నందుకే తమపైన‌, పార్టీ నేతలపైనా దొంగ కేసులు పెడుతున్నారని ఇవన్నీ రాష్ట్ర‌ ప్రజలు గమ‌నిస్తున్నార‌ని లోకేష్ అన్నారు. త‌న తల్లిపై అసెంబ్లీ సాక్షిగా దారుణంగా మాట్లాడారని.. విజయలక్ష్మి, భారతి, వారి పిల్లల గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో ఆలోచించుకోవాల‌ని హెచ్చ‌రించారు.

అయితే అది త‌మ సంస్కృతి అది కాదని, ఓ తల్లి ఎలా బాధపడుతుందో కొడుకుగా చూశాన‌ని ఆయ‌న అన్నారు. ఇక త‌న తల్లిని కించపర్చిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని లోకేష్ హెచ్చ‌రించారు. త‌మ కుటుంబం పై ప్రచారం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానని లోకేష్ హెచ్చరించారు. పరువు నష్టం దావా విషయంలో క్రాస్ ఎగ్జామినేషన్ కోసం లోకేష్ వచ్చారు. దీనిపై కౌంటర్ వేయడానికి ఇతర మీడియా సంస్థలు సమయం కావాలని అడిగాయి. ఇప్పటికే పలుమార్లు అలా అడగడంతో న్యాయమూర్తి ఎక్కువ సమయం ఇవ్వలేమని 28వ తేదీ కల్లా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • nara lokesh
  • tdp
  • vizag
  • ysrcp

Related News

Nara Lokesh Bos

Lokesh : టీడీపీ ఫ్యూచర్ బాస్.. నారా లోకేషే !!

ప్రస్తుత రాజకీయ పరిణామాలు గమనిస్తే, లోకేష్ కేవలం చంద్రబాబు నీడలో కాకుండా స్వయం ప్రతిభతో ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. గూగుల్ డేటా సెంటర్, మిట్టల్ స్టీల్ ప్లాంట్ వంటి ప్రాజెక్టుల వెనుక లోకేష్ కృషి ఉందని స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటించడం

  • Killed His Girlfriend

    Vizag : ప్రియురాలిని చంపి, ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టిన ప్రేమికుడు

  • Tdp 44

    TDP 44th Formation Day Celebrations : అట్టహాసంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు

  • Pawan Speech Assembly

    AP Assembly : లోకేష్ వ్యాఖ్యలను తప్పు పట్టిన పవన్ కళ్యాణ్

  • Araku MP Allocates Funds for Kovur's Development

    Gumma Thanuja Rani: కోవూరు అభివృద్ధికి అరకు ఎంపీ నిధులు కేటాయింపు

Latest News

  • పన్ను చెల్లింపుదారులకు పెద్ద ఊరట!

  • ఐపీఎల్‌లో అరుదైన ఘ‌న‌త సాధించిన ర‌హానే!

  • భార‌త మార్కెట్లోకి కొత్త ఎల‌క్ట్రిక్ కారు.. ధ‌ర ఎంతంటే?

  • మీ ఫోన్ స్లో అవుతుందా? అయితే ఈ యాప్స్ తీసేయండి!

  • శాశ్వత ప్రజా రాజధానిగా అమరావతి!

Trending News

    • వాట్సాప్‌లో మ‌రో స‌రికొత్త ఫీచ‌ర్!

    • హైద‌రాబాద్‌తో కోల్‌క‌తా మ్యాచ్‌.. కేకేఆర్‌కు హోం గ్రౌండ్ క‌లిసొస్తుందా?

    • Amaravathi Capital: అమరావతి రాజధాని బిల్లుకు రాజ్యసభ ఆమోదం

    • శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు గాయం.. సీఎస్కేతో మ్యాచ్‌కు దూరం?!

    • Condom Shortage: భారీగా పెరగనున్న కండోమ్ ధరలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd