HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Jagans Gunmen Attack Ycp Worker

Jagan Gunmen: వైసీపీ కార్యకర్తపై చేయిచేసుకున్న జగన్ గన్‌మెన్లు.. వీడియో వైర‌ల్‌!

అనంతపురం జిల్లాలో జరిగిన ఒక వివాహ కార్యక్రమానికి హాజరైన జగన్.. తిరిగి వెళ్లే సమయంలో ఆయన కాన్వాయ్ వద్ద భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు గుమిగూడారు.

  • Author : Gopi Date : 14-08-2025 - 6:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
YS Jagan
YS Jagan

Jagan Gunmen: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి అనంతపురం పర్యటనలో ఒక వివాదంలో చిక్కుకున్నారు. ఒక వివాహ వేడుక అనంతరం ఆయన భద్రతా సిబ్బంది (Jagan Gunmen) ఒక వైసీపీ కార్యకర్తపై చేయిచేసుకోవడం సోషల్ మీడియాలో కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

అసలేం జరిగింది?

అనంతపురం జిల్లాలో జరిగిన ఒక వివాహ కార్యక్రమానికి హాజరైన జగన్.. తిరిగి వెళ్లే సమయంలో ఆయన కాన్వాయ్ వద్ద భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు గుమిగూడారు. అభిమానులు, కార్యకర్తల తాకిడి ఎక్కువగా ఉండటంతో ఆ ప్రాంతంలో తోపులాట జరిగింది. జగన్ తన కారుపై నిలబడి కార్యకర్తలకు అభివాదం చేస్తున్న సమయంలో ఈ తోపులాట మరింత పెరిగింది.

Also Read: Rishabh Pant: రిష‌బ్ పంత్‌పై మాథ్యూ హేడెన్ కుమార్తె గ్రేస్ హేడెన్ ప్ర‌శంస‌లు!

వైసీపీ కార్యకర్తపై చేయిచేసుకున్న జగన్ గన్‌మెన్లు

అనంతపురంలో జరిగిన ఒక వివాహ వేడుక అనంతరం వైసీపీ కార్యకర్తలపై మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి గన్‌మెన్లు దాడికి పాల్పడ్డారు. తిరుగు ప్రయాణంలో వాహనంపైకి ఎక్కి కార్యకర్తలకు అభివాదం చేస్తున్న సమయంలో భారీ సంఖ్యలో ఉన్న కార్యకర్తల మధ్య… pic.twitter.com/fw77FAEprn

— ChotaNews App (@ChotaNewsApp) August 14, 2025

ఈ తోపులాటను నియంత్రించే క్రమంలో జగన్ గన్‌మెన్లు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ సమయంలో భద్రతా సిబ్బందిలో ఒకరు గుంపులో ఉన్న ఒక వైసీపీ కార్యకర్తపై దాడి చేశారు. ఆ కార్యకర్తను గన్‌మెన్ పదేపదే కొట్టడం, నెట్టివేయడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఈ ఘటనతో అక్కడ కొంత గందరగోళం నెలకొంది.

సోషల్ మీడియాలో వైరల్

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించింది. గన్‌మెన్ దాడిని చాలామంది తీవ్రంగా ఖండించారు. పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తపైనే ఇలా వ్యవహరించడం సరికాదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై వైసీపీ వర్గాలు కానీ, జగన్ కార్యాలయం కానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. ఈ వీడియో ఇప్పుడు పార్టీ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కార్యకర్తలు కోరుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • ap news
  • Jagan Gunmen
  • viral video
  • ycp leader
  • ys jagan

Related News

More Good News for DWCRA Women: Loans Up to ₹10 Lakhs

Dwcra Womens: డ్వాక్రా మహిళలకు మరో శుభవార్త.. రూ.10 లక్షల వరకు రుణం

రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీపికబురు చెప్పారు. డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల వ్యక్తిగత రుణం అందిస్తామని అన్నారు. ఎలాంటి పూచీకత్తు లేకుండా ఈ రుణాన్ని ఇస్తారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. డ్వాక్రా మహిళలు ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు ఈ రుణాన్ని మంజూరు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

    Latest News

    • CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

    • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

    • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

    • TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

    • Health : హైబీపీ – సైలెంట్ కిల్లర్‌ను నిర్లక్ష్యం చేయకండి – డా. చింతా ప్ర‌భాక‌ర్ రెడ్డి

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd