CM Jagan: ఐ ప్యాక్‌పై నమ్మకం కోల్పోయిన జగన్
వైసీపీలో ఇంత గందరగోళం నెలకొనడానికి కారణం ఏంటనే దానిపై పార్టీలో విస్తృత చర్చ సాగుతోంది. గతంలో నియోజకవర్గాల వారీగా సమీక్షించి అభ్యర్థులపై క్లారిటీ ఇచ్చినా.. తలకిందులు చేసేందుకు జగన్ రెడ్డి తనదైన వ్యూహాలను అమలు చేయడం ప్రారంభించినట్లు విశ్వసనీయ సమాచారం.
- Author : Praveen Aluthuru
Date : 21-12-2023 - 4:41 IST
Published By : Hashtagu Telugu Desk
CM Jagan: వైసీపీలో ఇంత గందరగోళం నెలకొనడానికి కారణం ఏంటనే దానిపై పార్టీలో విస్తృత చర్చ సాగుతోంది. గతంలో నియోజకవర్గాల వారీగా సమీక్షించి అభ్యర్థులపై క్లారిటీ ఇచ్చినా.. తలకిందులు చేసేందుకు జగన్ రెడ్డి తనదైన వ్యూహాలను అమలు చేయడం ప్రారంభించినట్లు విశ్వసనీయ సమాచారం.
ఐ ప్యాక్‌పై జగన్ పూర్తిగా నమ్మకం కోల్పోయారు. వారిని ఈవెంట్ మేనేజర్లుగా నియమించారు. ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీకి ప్రచార కార్యక్రమాలుగా మార్చడం తప్ప చేసిందేమీ లేదని టీడీపీ ఆరోపిస్తుంది. వారు చేసే సర్వేలను జగన్ నమ్మడం లేదని టీడీపీ పేర్కొంటుంది. బయట రెండు మూడు సర్వే సంస్థలు ఇచ్చిన నివేదికలతో పాటు వైసీపీ సానుభూతిపరులైన కొందరు జర్నలిస్టులను పిలిపించి జగన్ మాట్లాడుతున్నారు. వారి సూచనల మేరకు అభ్యర్థులు మారుతున్నారు. ఇదిలా ఉండగా వైసీపీ నేతలు పూర్తిగా ఆశలు వదులుకున్నారు. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఎవరికీ తెలియదని వారు భావిస్తున్నారు. అందుకే తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి టికెట్ రాదని లీకులు వస్తున్నా చాలా మంది సీఎంను కలిసేందుకు ఆసక్తి చూపడం లేదు.
ఎవరో ఇచ్చిన సలహాలను పట్టుకుని జగన్ ఎమ్మెల్యేలను మార్చడం కరెక్ట్ కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఓ వ్యక్తి కడప పర్యటనకు వెళ్లినప్పుడు 175 సీట్లలో గెలుస్తామని చెప్పడంతో జగన్ వెంటనే అధికారులను పంపి ఆ వ్యక్తిని ఎస్కార్ట్‌లో పిలిపించారు. ఆ వ్యక్తి ఏ సలహా ఇచ్చినా, అలాంటి సలహాలను వినేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారట.
Also Read: Covid Deaths: ఇండియాపై కరోనా పంజా, 2 వారాల్లో 23 మంది మృతి