HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Jagan Kcr Strategy On Visakha Steel Next Machilipatnam Port

Jagan & KCR on Vizag Steel: విశాఖ స్టీల్ పై జగన్, కేసీఆర్ వ్యూహం! నెక్స్ట్ మచిలీపట్నం ఓడరేవు!

వారం క్రితమే విశాఖ స్టీల్ , మచిలీపట్నం ఓడరేవు విషయంలో కేసీఆర్ అండ్ జగన్ ఏమి చేయబోతున్నారో ''హాష్టాగ్ యూ ' సంచలన కథనాన్ని అందించింది. ఇప్పుడు అదే జరుగుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను సొంతం చేసుకోవడానికి కేసీఆర్ సర్కార్ రంగం సిద్ధం చేసింది.

  • Author : CS Rao Date : 10-04-2023 - 11:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vizag steel
Jagan, Kcr Strategy On Visakha Steel! Next Machilipatnam Port!

Jagan & KCR on Vizag Steel : వారం క్రితమే విశాఖ స్టీల్, మచిలీపట్నం ఓడరేవు విషయంలో కేసీఆర్ అండ్ జగన్ ఏమి చేయబోతున్నారో ”హాష్టాగ్ యూ ‘ సంచలన కథనాన్ని అందించింది. ఇప్పుడు అదే జరుగుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను సొంతం చేసుకోవడానికి కేసీఆర్ సర్కార్ రంగం సిద్ధం చేసింది. గత ఏడాది బిడ్డింగ్ కు జగన్ (Jagan) సర్కార్ రెడి అయింది. అటు కేసీఆర్ (KCR) ఇటు జగన్ ఒకే మాట మీద గత ఏడాది నుంచి ఉన్నారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నట్టు చెబుతూనే బిడ్డింగ్ కు ఇద్దరు సిద్ధం  అయ్యారు. కేంద్రాన్ని నిలదీయకుండా స్టీల్ ప్లాంట్ కొనుగోలుకు సిద్ధం కావటం కేసీఆర్ , జగన్ మధ్య ఉన్న వ్యాపార సఖ్యతను తెలియ చేస్తుంది.

ఫక్తు రాజకీయ పార్టీగా బీ ఆర్ ఎస్ , వైసీపీ ఉన్నాయని అందరికి తెలిసిందే. అంతే కాదు రాజకీయాల్లో వ్యాపారాన్ని కూడా జోడించిన పార్టీలుగా ప్రత్యర్థులు భావిస్తుంటారు. ఇప్పుడు ఆ రెండు పార్టీల వాలకం కూడా అలాగే ఉంది. గతంలో మచిలీపట్నం ఓడరేవు లో షేర్ ను కేసీఆర్ సర్కార్ కోరింది. అందుకు జగన్ (Jagan) కూడా అప్పట్లో సానుకూల సంకేతాలు ఇచ్చారు. కానీ ఏపీ ప్రజలు చీదరించుకుంటారని ఒక అడుగు తాత్కాలికంగా వెనక్కు తగ్గారు. ఇప్పడు విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ తరువాత కేసీఆర్ (KCR) టార్గెట్ మచిలీపట్నమ్ ఓడరేవుగా ఉందని సర్వత్రా వినిపిస్తుంది.

తెలంగాణ లాగిస్టిక్ హబ్ గా మచిలీపట్నం పోర్ట్ ను ఏర్పాటు చేయాలని కేసీఆర్ యోచన. సముద్ర తీరం తెలంగాణకు లేని లోటును మచిలీపట్నం ఓడరేవు వాటాను కొనుగోలు చేయటం ద్వారా భర్తీ చేసుకోవాలని మాస్టర్ స్కెచ్ వేశారు. అందుకు జగన్ కూడా అంగీకారం ఇచ్చినట్టు తాడేపల్లి కోటలోని టాక్. ఇప్పడు మాత్రం విశాఖ స్టీల్ ప్లాంట్ కేసీఆర్ (KCR) టార్గెట్ గా పెట్టుకున్నారు. అక్కడ విజయం సాధించడానికి జగన్ సర్కార్ కూడా మద్దతు ఇస్తుందని తెలుస్తుంది. ఏపీ ఆస్తుల మీద తెలంగాణలో పెత్తనం చేస్తున్న కేసీఆర్ ఇప్పుడు ఏపీ హక్కుగా భావించే స్టీల్ ప్లాంట్, ఆ తరువాత మచిలీపట్నం ఓడరేవును కొనుగోలు చేసేందుకు సిద్ధం అయ్యారు. ఇదంతా మోడీ, కేసీఆర్, జగన్ (Jagan) వేసిన అత్యంత మెగా ప్లాన్ గా పారిశ్రామిక వర్గాల్లోని చర్చ. ఆడాని, కేసీఆర్, జగన్ త్రయం మధ్య ఏదో ఏపీ ఆస్తుల మీద జరుగుతుందని ప్రచారం మొదలయింది.

ఉద్యమాలు చేస్తుండగానే విశాఖ ఉక్కును విక్రయించే ప్రయత్నాలను కేంద్రం ముమ్మరం చేసింది. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నట్టు వ్యూహాత్మక ప్లాన్ వేసి కార్మికుల మద్దతు తో తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు బిడ్డింగులో పాల్గొనాలని సంచలన నిర్ణయం తీసుకుంది. ఫ్యాక్టరీ నిర్వహణ కోసం మూలధనం, ముడిసరుకు సంబంధించి యాజమాన్యం నిర్వహిస్తున్న బిడ్డింగులో సింగరేణి లేదంటే రాష్ట ఖనిజాభివృద్ది సంస్థ లేదంటే నీటిపారుదల శాఖ పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తుంది.

విశాఖకు అధికారుల బృందం తెలంగాణలో చేపట్టిన మౌలిక వసతుల ప్రాజెక్టులకు తద్వారా ఉక్కును సమకూర్చుకోవాలన్న లక్ష్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, ఆసక్తి వ్యక్తీకరణ (ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్-ఈవోఐ) కోసం వెంటనే విశాఖ వెళ్లి అధ్యయనం చేయాలని ఉన్నతాధికారుల బృందాన్ని సీఎం ఆదేశించినట్టు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లోనే వైజాగ్ వెళ్లనున్న బృందం.. యాజమాన్యం సేకరించదలచుకున్న నిధులు, తిరిగిచ్చే ఉత్పత్తులు, లేదంటే నిధులను వెనక్కి చెల్లించే విధివిధానాలు, ఇతర నిబంధనలు, షరతులను అధ్యయనం చేస్తుంది.

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని విక్రయించాలన్న కేంద్రం నిర్ణయాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇటీవల బహిరంగంగానే వ్యతిరేకించారు. బీజేపీ అనుకూల కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పేందుకు చేస్తున్న కుట్రలో ఇది తొలి అడుగని దుమ్మెత్తి పోశారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ కూడా రాశారు. సరిగ్గా ఇక్కడే అసలు కోణాన్ని అమలు చేసే అడుగు కేసీఆర్ వేశారు. ఆ లోగుట్టును 10 రోజుల క్రితమే హాష్టాగ్ యూ బయట పెట్టింది.
మరోవైపు, బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఇటీవల స్టీల్ ప్లాంట్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులను కలిశారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ.. ప్రైవేటీకరణను తాత్కాలికంగా అడ్డుకునేందుకు ఉన్న అవసరమైన పరిష్కార మార్గాలను వారు సూచించారు.

వాటిని ఆయన కేసీఆర్, కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కేసీఆర్ నిన్న ఈ విషయమై ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో చర్చించారు. అనంతరం ఈవోఐలో పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ టెండర్లు కనుక తెలంగాణ ప్రభుత్వ సొంతమైతే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల విక్రయంపై తమ పార్టీ వ్యతిరేకతను బలంగా చాటచ్చొన్నది కేసీఆర్ అభిప్రాయం.

15తో ముగియనున్న గడువు వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో భాగస్వామిగా చేరేందుకు ఉక్కు, ముడి ఉక్కు తయారీపై ఆసక్తి ఉన్న సంస్థల నుంచి వ్యాపార ప్రతిపాదనలను ఆహ్వానిస్తూ మార్చి 27న యాజమాన్యం ప్రకటన విడుదల చేసింది. ఈవోఐ దాఖలు చేసే సంస్థలు ఉక్కు లేదంటే ఉక్కు తయారీ ముడిపదార్థాల వ్యాపారం చేసి ఉండాలి. ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోగా తమ ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉంటుంది. ఆ రోజుకు కేసీఆర్ , జగన్ డ్రామా మొత్తం బయట పడుతుందని ప్రత్యర్థి పార్టీలు భావిస్తున్నాయి. మొత్తం మీద జగన్ , కేసీఆర్ వేసిన పాచికలో విశాఖ స్టీల్ పడిపోతుంది. ఇక తరువాత మచిలీపట్నం వంతు మిగిలింది.

Also Read:  KCR: కేసీఆర్ ’24 గంటలు’ ఆఫర్ లోగుట్టు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amaravati
  • andhra pradesh
  • ap
  • brs
  • jagan
  • kcr
  • steel
  • Visakhapatnam
  • vizag
  • ycp
  • ysrcp

Related News

Skilling Advisor Seetha Sharma Resigns from Skill Development Department

ఏపీ సలహాదారు పదవికి సీతా శర్మ రాజీనామా

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్, ట్రైనింగ్ శాఖలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇంటర్నేషనల్ స్కిల్లింగ్ అండ్ మొబిలిటీ అడ్వైజర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సీతా శర్మ తన పదవికి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను ఆమోదిస్తూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల పదవీకాలం పూర్తికాకుండానే ఆమె వైదొలగడం గమనార్హం. వివరాల్లోకి వెళ్తే, గత మార్చి 5న సీతా శర్మ తన రాజీనామా

  • Kaleshwaram project irregularities KCR, Harish Rao

    KCR : కాళేశ్వరం కేసులో మాజీ సీఎం కేసీఆర్‌, హరీశ్‌ రావుకు బిగ్‌ రిలీఫ్‌.

  • Kavitha

    KCR సభపై కవిత దారుణమైన కామెంట్స్

  • Jeevan Reddy Brs

    BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • Harish Rao Kmm

    Khammam : ఖమ్మం జిల్లా మంత్రులపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు

Latest News

  • ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?

  • ‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

  • మీ టూత్ బ్రష్ ఎక్స్‌పైరీ డేట్ తెలుసుకోండిలా?

  • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

  • టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో భారీ మార్పులు!

Trending News

    • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

    • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

    • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

    • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

    • దిల్షాన్ మదుశంక.. రిప్లేస్‌మెంట్‌గా వచ్చి రికార్డుల్లోకి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd