Pawan Kalyan : పవన్ జనసేన పై పూర్తి ఫోకస్ చేయకపోవడానికి కారణం అదేనా..?
Pawan Kalyan : ప్రతి నియోజకవర్గంలో పార్టీ ఇన్‌చార్జులను నియమించకపోవడం, పార్టీలో కేడర్ స్థాపించడంలో ఆలస్యం చేయడం వంటి అంశాలు కూడా ఆయన వ్యూహంలో భాగమేనని
- By Sudheer Published Date - 04:05 PM, Thu - 10 April 25

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం పార్టీని నియోజకవర్గ స్థాయిలో బలోపేతం చేయడంపై కన్నా, వ్యూహాత్మకంగా రాజకీయ కూర్పులు, కలయికలపై దృష్టి సారించినట్టు తెలుస్తుంది. ప్రతి నియోజకవర్గంలో పార్టీ ఇన్‌చార్జులను నియమించకపోవడం, పార్టీలో కేడర్ స్థాపించడంలో ఆలస్యం చేయడం వంటి అంశాలు కూడా ఆయన వ్యూహంలో భాగమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తక్కువ నియోజకవర్గాల్లో పోటీ చేసి, ఎక్కువ విజయం సాధించాలన్న లక్ష్యంతో పవన్ కల్యాణ్ ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో కలిసి పనిచేస్తూ అనుభవాన్ని పెంచుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు.
David Headley : తహవ్వుర్‌ను తీసుకొచ్చారు.. డేవిడ్ హెడ్లీ సంగతేంటి ? అతడెవరు ?
పవన్ కల్యాణ్ ఇటీవల చంద్రబాబుపై ప్రశంసలు కురిపిస్తూ, టీడీపీ కార్యకర్తలతో పాటు కమ్మ సామాజిక వర్గానికి దగ్గరవ్వాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో గిరిజనులపై ప్రత్యేక దృష్టి సారించి, ఎస్టీ ఓట్లపై దృష్టిపెట్టారు. అరకూ, విశాఖ ఏజెన్సీలు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ఎస్టీ నియోజకవర్గాల్లో తరచూ పర్యటిస్తూ ప్రజలతో మమేకం అవుతున్నారు. రహదారులు, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా వ్యవహరిస్తూ, ప్రజల్లో విశ్వాసం పొందే ప్రయత్నం చేస్తున్నారు.
అంతే కాదు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా, కేంద్ర స్థాయిలోనూ కీలక పాత్ర పోషించాలని ఆయన భావిస్తున్నట్లు అర్ధం అవుతుంది. కేంద్రంతో ఉన్న సంబంధాలను ఉపయోగించి రాష్ట్రానికి మేలు చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఇక త్వరలో ఎస్సీ నియోజకవర్గాలపైన కూడా దృష్టి పెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొత్తం మీద పవన్ కల్యాణ్ తాను ఒంటరిగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ, వ్యూహాత్మకంగా జనసేనను బలోపేతం చేయాలని ప్రయత్నిస్తున్నారనేది స్పష్టంగా కనిపిస్తోంది. మరి పవస్ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది చూడాలి.