HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Is Ap Govt Going To Disqualify Ysrcp Chief Ys Jagan Will There Be A By Election For Pulivendula

YS Jagan : జగన్‌పై అనర్హత వేటు వేస్తారా ? పులివెందులకు బైపోల్ తప్పదా ?

వైఎస్ జగన్(YS Jagan) ఏం చేయబోతున్నారు ? అసెంబ్లీకి హాజరవుతారా ?

  • Author : Pasha Date : 04-02-2025 - 8:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ysrcp Chief Ys Jagan Pulivendula By Election Ap Govt Andhra Pradesh

YS Jagan : వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణం చేసినప్పటి నుంచి మళ్లీ అసెంబ్లీ వైపు తిరిగి చూడలేదు. తన పార్టీ ఎమ్మెల్యేలను కూడా ఆయన అసెంబ్లీకి వెళ్లనివ్వడం లేదు. దీనిపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తాజాగా సీరియస్ అయ్యారు. సెలవుకు అప్లై చేయకుండా వరుసగా 60 రోజులు అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదని  వార్నింగ్ ఇచ్చారు. సభకు జగన్‌ గైర్హాజరీ గురించి విలేకరులు ప్రశ్నించగా .. రఘురామ ఈవిధంగా రిప్లై ఇచ్చారు. జగన్‌పై అనర్హత వేటు పడగానే పులివెందులకు ఉప ఎన్నిక వస్తుందన్నారు. ‘‘వైఎస్సార్ సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదు. అసెంబ్లీలో కనీసం 10శాతం మంది ఎమ్మెల్యేల బలం ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇస్తారు’’ అని రఘురామ తెలిపారు. ఈ మాటల అంతరార్ధం ఏమిటి ? నెక్ట్స్ ఏం జరగబోతోంది ?

Also Read :SwaRail vs IRCTC : ‘స్వరైల్’, ‘ఐఆర్‌సీటీసీ’ యాప్‌లలో ఏది బెటర్ ?

జగన్ అసెంబ్లీకి వస్తారా ?

వైఎస్ జగన్(YS Jagan) ఏం చేయబోతున్నారు ? అసెంబ్లీకి హాజరవుతారా ? అనర్హత వేటును ఎదుర్కొంటారా ? అనే దానిపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చ జరుగుతోంది. ఈనెలలోనే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. జగన్ రిస్క్ లేకుండా ఈసారి బడ్జెట్ సమావేశాలకు ఒకటి, రెండు రోజులు హాజరయ్యే అవకాశం ఉందని వైఎస్సార్ సీపీ వర్గాలు అంటున్నాయి. తద్వారా అనర్హత వేటు ముప్పు నుంచి ఆయన బయటపడతారని అంచనా వేస్తున్నారు. బడ్జెట్ సెషన్ పూర్తయిన తర్వాత జరిగే మరో రెండు, మూడు అసెంబ్లీ సెషన్లకు జగన్ గైర్హాజరయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు.

బైపోల్ వస్తే..

ఒక్క విషయం మాత్రం క్లియర్. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు కానీ, వైఎస్ జగన్ కానీ అసెంబ్లీ రూల్స్‌కు వ్యతిరేకంగా నడుచుకుంటూ ఏపీలోని కూటమి సర్కారు ఉపేక్షించే అవకాశాలు లేవు. ఆయా నియమాలకు అనుగుణంగా చర్యలు తీసుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఒకవేళ వైఎస్ జగన్ ఇకపైనా అసెంబ్లీకి వెళ్లకుంటే.. అనర్హత వేటు వేసే ఛాన్స్ ఉంది. అదే జరిగితే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక  వస్తుంది. చాలా అరుదైన సందర్భాల్లోనే అక్కడ బైపోల్స్ జరిగాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 1989లో పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన 1991లో లోక్‌‌సభకు పోటీ చేశారు. దీంతో అప్పట్లో పులివెందులకు బైపోల్ నిర్వహించారు. 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించినపుడు మరోసారి అక్కడ ఉప ఎన్నిక వచ్చింది. ప్రతీ బైపోల్‌లోనూ అక్కడ వైఎస్ కుటుంబమే విజయం సాధించింది.

Also Read :Bhagya Sri Borse : రెండు క్రేజీ సినిమాలతో మిస్టర్ బచ్చన్ బ్యూటీ..!

ఆ లెక్క ప్రకారం.. అనర్హతకు ఛాన్సే లేదు 

  • వాస్తవానికి గతంలో అసెంబ్లీకి దాదాపు రెండేళ్ల పాటు గైర్హాజరైన ట్రాక్ రికార్డు వైఎస్ జగన్‌కు ఉంది. ఆయన పాదయాత్ర చేపట్టడంతో, అప్పట్లో జగన్, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాలేదు. ఇదంతా 2014 నుంచి 2019 మధ్య కాలంలో జరిగింది. అప్పట్లో  జగన్ ఎమ్మెల్యే సభ్యత్వం పోలేదు. మరి ఇప్పుడు అది జరుగుతుందా ? అనే ప్రశ్న తలెత్తుతోంది.
  • 2019 నుంచి 2024 మధ్యలో చివరి రెండేళ్లపాటు చంద్రబాబు కూడా అసెంబ్లీకి హాజరు కాలేదు. ఆయనపైనా అనర్హత వేటు పడలేదు.
  • 1990వ దశకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విపక్ష నేతగా ఉన్న ఎన్టీఆర్ కూడా అసెంబ్లీకి చివరి రెండేళ్లు రాలేదు. ఆయన కూడా అప్పట్లో సభ్యత్వం కోల్పోలేదు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • ap govt
  • By-Election
  • Pulivendula
  • ys jagan
  • ysrcp
  • YSRCP Chief

Related News

AP

AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం, జౌళి రంగాలను అనుసంధానిస్తూ రైతులకు అదనపు ఆదాయం కల్పించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి పలు కీలక ప్రతిపాదనలు సమర్పించారు. సచివాలయంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌తో జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని ఫైబర్ ఉత్పత్తి, వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో అరటి, కొబ్బరి, వెదురు

  • Indrakeeladri

    Vijayawada : ఇంద్రకీలాద్రికి పోటెత్తిభ‌క్తులు.. వేసవి దృష్ట్యా ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు

  • Gade Venkatreddy

    Gade Venkatreddy : మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత

  • Imresizer Whatsapp Image 2026 05 29 At 4.10.59 Pm

    TDP : యువత భవిష్యత్తును చీకట్లోకి నెట్టిన చరిత్ర జగన్ కుటుంబానిదే: ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి

  • Electric Shock

    Vijayawada : విజయవాడలో బక్రీద్ పండుగ రోజు విషాద ఘటన.. కరెంట్ షాక్‌తో హోంగార్డు మృతి

Latest News

  • Vaibhav : శతకం మిస్సైనా చరిత్ర సృష్టించిన వైభవ్.. ఐపీఎల్‌లో పలు రికార్డులు బద్దలు

  • IPL 2026 : సెంచరీతో చెలరేగిన గిల్.. ఐపీఎల్ ఫైనల్‌కి చేరుకున్న‌ గుజరాత్ టైటాన్స్

  • Land Scam : హైదరాబాద్ లో ప్రభుత్వ భూమి కబ్జా యత్నం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు

  • Nellore : వేదాంత మీనాక్షి ఎనర్జీ 1000 మందికి స్వచ్ఛమైన తాగునీటి సదుపాయం!

  • ‘Aakash’ Educational Gift : దేశ రక్షణ దళాలకు ‘ఆకాశ్’ విద్యా కానుక

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd