Bhagya Sri Borse : రెండు క్రేజీ సినిమాలతో మిస్టర్ బచ్చన్ బ్యూటీ..!
Bhagya Sri Borse : రామ్ 22 సినిమాలో కూడా భాగ్య శ్రీ నటిస్తుంది. ఈ సినిమాను మహేష్ బాబు డైరెక్ట్ చేస్తున్నారు. కాంతా తెలుగు, తమిళ్ బైలింగ్వెల్ గా వస్తుండగా విజయ్ దేవరకొండ
- By Ramesh Published Date - 11:12 PM, Mon - 3 February 25

Bhagya Sri Borse : మాస్ మహారాజ్ రవితేజ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ భాగ్య శ్రీ బోర్స్. అమ్మడు ఆ సినిమాతో ఫ్లాప్ అందుకున్నా ఆడియన్స్ లో మాత్రం మంచి క్రేజ్ తెచ్చుకుంది. అంతేకాదు వరుస ఆఫర్లు కూడా పట్టేసింది. మిస్టర్ బచ్చన్ బ్యూటీకి తన కెరీర్ మీద తన తొలి సినిమా ఫలితం ఎఫెక్ట్ ఏమాత్రం పడలేదని తెలుస్తుంది. మిస్టర్ బచ్చన్ సినిమా ఫ్లాప్ అయినా కూడా భాగ్య శ్రీ ఎక్కడ తగ్గట్లేదు.
ఇప్పటికే దుల్కర్ సల్మాన్ తో కాంత సినిమాలో నటిస్తున్న అమ్మడు. ఆ సినిమాతో పాటుగా విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరి సినిమాలో కూడా నటిస్తుంది. విజయ్ సినిమా అంటే ఇక హీరోయిన్ కి డబుల్ క్రేజ్ పక్కా అని చెప్పొచ్చు. అందులోనూ భాగ్య శ్రీ లాంటి అందాల భామకు మరింత క్రేజ్ ఏర్పడే ఛాన్స్ ఉంటుంది.
ఇక ఈ సినిమాతో పాటు రామ్ 22 సినిమాలో కూడా భాగ్య శ్రీ నటిస్తుంది. ఈ సినిమాను మహేష్ బాబు డైరెక్ట్ చేస్తున్నారు. కాంతా తెలుగు, తమిళ్ బైలింగ్వెల్ గా వస్తుండగా విజయ్ దేవరకొండ, రామ్ సినిమాలు డైరెక్ట్ తెలుగు సినిమాలుగా వస్తున్నాయి. విజయ్ దేవరకొండ సినిమా రెండు భాగాలుగా రాబోతుందని టాక్.
సో 2 పార్ట్ లు అంటే తప్పకుండా హీరోయిన్ పాత్రకు మంచి వెయిట్ ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాల్లో ఏ ఒక్కటి క్లిక్ అయినా భాగ్య శ్రీ బోర్స్ కెరీర్ మరింత జోష్ తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. మరి ఈ సినిమాల్లో ఏది అమ్మడికి ఎలాంటి క్రేజ్ తెస్తుందో చూడాలి.