HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >International Yoga Day In Visakhapatnam To Create Record

International Yoga Day: రికార్డు సృష్టించేలా విశాఖలో అంతర్జాతీయ యోగా డే!

ఆర్‌కె బీచ్‌లో ప్రధాని కార్యక్రమం, ప్రజల పాల్గొనే ప్రాంతాలు, నిర్వహణపై అధికారులు ప్రజెటేషన్ ఇచ్చారు. ఆర్కె బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు అన్ని చోట్లా ప్రజలు యోగాసనాలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

  • Author : Gopichand Date : 16-05-2025 - 4:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
International Yoga Day
International Yoga Day

International Yoga Day: విశాఖపట్నంలో జరిగే 11వ అంతర్జాతీయ యోగా డే (International Yoga Day)ను రికార్డు సృష్టించేలా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జూన్ 21వ తేదీన జరిగే యోగా డే కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈసారి విశాఖలో పాల్గొంటున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రధాని స్వయంగా ప్రకటించారు. దీంతో ఈ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయేలా చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. గ్రాండ్ సక్సెస్ చేసే అంశంపై ఫోకస్ పెట్టిన సిఎం…కార్యచరణపై క్యాంప్ ఆఫీస్‌లో అధికారులతో సమీక్ష చేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ “‘యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్’ ను ఈ ఏడాది యోగా దినోత్సవ థీమ్‌గా తీసుకున్నారు. ‘జూన్ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. ప్రధాని వస్తున్న ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించడంతో పాటు..రాష్ట్రంలో యోగా అభ్యాసానికి ఇది నాంది పలకాలి. రాష్ట్రంలో ప్రతి ఒక్కరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలి. కనీసం రెండు కోట్లమందికి ఈ కార్యక్రమం చేరాలి. ‘యోగాంధ్ర-2025’ థీమ్‌తో రాష్ట్రంలో ప్రచారం చేపట్టాలి. దీని కోసం ప్రజలను సన్నద్ధం చేసేందుకు ఈనెల 21 నుంచి జూన్ 21 వరకు యోగా మంత్ పాటించాలి. ఈ నెల రోజులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో యోగా ప్రాక్టీస్ జరగాలి. దీని కోసం ప్రైవేటు వ్యక్తులు, శిక్షకులు, యోగా అసోసియేషన్లు, నిపుణులను భాగస్వాములను చేయాలి. నెలరోజుల పాటు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో ప్రజలకు యోగా పై శిక్షణ ఇవ్వాలి. నెల రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న వారిని గుర్తిస్తూ సర్టిఫికెట్ ఇవ్వాలి. రాష్ట్రంలో గ్రామ,వార్డు సచివాలయాల ద్వారా యోగా డేలో పాల్గొనే అంశంపై ప్రజల నుంచి రిజిస్ట్రేషన్లలు తీసుకోవాలి. అదే విధంగా రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీల విద్యార్థులను ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేయాలి. యోగా అనేది ప్రాథమిక బాధ్యత అనేలా ప్రతిఒక్కరూ భావించాలి. యోగా డే అనంతరం కూడా రాష్ట్రంలో యోగా సాధన ఒక వ్యాపకంగా మారాలి. రాష్ట్రంలో ప్రతి చోటా యోగాపై నెలరోజుల పాటు విస్తృత చర్చ జరగాలి. మనం నిర్వహించే యోగా డే విస్తృత ప్రాచుర్యం కల్పించడానికి ఈషా ఫౌండేషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వంటి సంస్థల సహకారాన్ని తీసుకోవాలి. ఎపిలో జరిగే యోగా డే గత 10 ఏళ్ల కార్యక్రమాలను తిరగరాసేలా ఉండాలి” అని సిఎం చంద్రబాబు సూచించారు.

Also Read: RBI On Loans: ఆర్బీఐ కీల‌క నిర్ణ‌యం.. సామాన్య ప్ర‌జ‌ల‌కు బిగ్ రిలీఫ్‌!

లక్షల మందితో కార్యక్రమం

ఆర్‌కె బీచ్‌లో ప్రధాని కార్యక్రమం, ప్రజల పాల్గొనే ప్రాంతాలు, నిర్వహణపై అధికారులు ప్రజెటేషన్ ఇచ్చారు. ఆర్కె బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు అన్ని చోట్లా ప్రజలు యోగాసనాలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ రోడ్ వరకు సుమారు 2.5 లక్షల మంది యోగాలో పాల్గొనేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. యోగా నిర్వహించేందుకు 68 ప్రాంతాలు గుర్తించారు. ఆర్కే బీచ్, రుషికొండ, స్కూల్, క్రికెట్, పోలీస్, స్పోర్ట్చ్, నావీ ప్రాంగణాలతో పాటు పలు ఖాళీ ప్రదేశాలను యోగా నిర్వహణకు గుర్తించారు. ఈ 68 లోకేషన్ల ద్వారా 2,58,948 మంది యోగా సాధనకు అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. యోగా దినోత్సవాన్ని ప్రకటించి 10 ఏళ్లు పూర్తియిన సందర్భంగా, ప్రధాని పాల్గొనే విశాఖ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించాలని సీఎం సూచించారు. ఇందులో భాగంగా 5 లక్షల మంది భాగస్వాములు అయ్యేలా ఆర్కె బీచ్ నుంచి శ్రీకాకుళం వరకు బీచ్ పొడవునా అన్ని అనుకూల ప్రాంతాల్లో ప్రజలను ఆహ్వానించి యోగా కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం చంద్రబాబు సూచించారు.

యోగాలో కొత్త రికార్డ్ సృష్టిద్దాం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ చొరవతో జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా డేగా ఐక్యరాజ్యసమితి గుర్తించింది. యోగా డే రోజుల ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు యోగా సాధన ఉంటుంది. 2015లో తొలిసారి అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు 36 వేల మందితో ఒకే వేదికపై నిర్వహించిన కార్యక్రమం గిన్నిస్ రికార్డుకు ఎక్కింది. తొలి ఏడాది 84 దేశాల్లో యోగాను నిర్వహించారు. ప్రపంచంలోని 170కి పైగా దేశాలు యోగా డే ను ప్రస్తుతం నిర్వహిస్తున్నాయి. 2023లో సూరత్‌లో 1,53,000 మందితో ఒకే చోట అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరిపి మరోసారి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లకు ఎక్కింది. సూరత్ తరహా మోడల్‌లో విశాఖలోనూ యోగా దినోత్సవాన్ని నిర్వహించి… ఈసారి ఆ రికార్డును తిరగరాయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. వైద్య ఆరోగ్య శాఖ, ఆయుష్, కేంద్ర ప్రభుత్వ శాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap news
  • CM Chandrababu
  • international yoga day
  • pm modi
  • record
  • Visakhapatnam

Related News

Killed His Girlfriend

Vizag : ప్రియురాలిని చంపి, ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టిన ప్రేమికుడు

విశాఖపట్నంలోని ఎల్‌వీ నగర్‌లో సభ్యసమాజం తలదించుకునేలా ఒక దారుణ ఘటన వెలుగుచూసింది. నమ్మిన ప్రియురాలిని అతికిరాతకంగా చంపి, ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా

  • Gas Boy Jumps With Cylinder

    Gas Shortage : సిలిండర్లతో జంప్ అయినా గ్యాస్ బాయ్

  • Markapuram Road accident pm modi

    Pm Modi: మార్కాపురం బస్సు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి

  • Modi On Gst

    Modi : ప్రపంచంలోనే నెం 1 లీడర్ మోడీనే.. లేటెస్ట్ సర్వే చెపుతుంది ఇదే !!

  • Chandranna Sarkar Gives Gre

    ‘Sakhi Niwas’ : ఏపీ మహిళలకు గొప్ప శుభవార్త తెలిపిన చంద్రన్న సర్కార్

Latest News

  • ఐపీఎల్ 2026.. చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజ‌యం!!

  • సూర్యవంశీ శివతాండవం.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ!!

  • పెద్ది సినిమా వాయిదా? నిర్మాత ఏం చెప్పారంటే?!

  • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

  • రైతుల‌కు శుభ‌వార్త చెప్పిన కేంద్రం!

Trending News

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd