Four Type Schools : ఏపీలో ఇక నాలుగు రకాల ప్రభుత్వ స్కూల్స్.. జరగబోయే మార్పులివీ
ఫలితంగా ఎంతోమంది ప్రభుత్వ బడుల విద్యార్థులు ప్రైవేటుకు(Four Type Schools) వెళ్లిపోయారు. అందుకే ఈ విధానాన్ని ఇప్పుడు టీడీపీ సర్కారు ప్రక్షాళన చేస్తోంది.
- By Pasha Published Date - 09:31 AM, Sat - 14 December 24

Four Type Schools : గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో 6 రకాల ప్రభుత్వ స్కూల్స్ ఉండేవి. అయితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి 4 రకాల ప్రభుత్వ స్కూల్స్ అందుబాటులో ఉంటాయి. ఈమేరకు రాష్ట్రంలోని పాఠశాల విద్యా వ్యవస్థను టీడీపీ ప్రభుత్వం మార్చనుంది. ప్రాథమికోన్నత, హైస్కూల్ ప్లస్ విధానాలను రద్దు చేసేందుకు చంద్రబాబు సర్కారు రెడీ అవుతోంది.
Also Read :One Nation One Election : 16న లోక్‌సభ ఎదుటకు ‘జమిలి’ బిల్లులు.. ఎన్నికలపై కీలక సవరణలివీ
వైఎస్సార్ సీపీ హయాంలో జరిగిన నష్టమిదీ..
వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడానికి ముందు ఏపీలో 3,4,5 తరగతులు ప్రాథమిక పాఠశాలల కేటగిరీలో ఉండేవి. అయితే జగన్ సీఎం అయ్యాక 3,4,5 తరగతులను హైస్కూల్ ప్లస్ విధానంలో కలిపేశారు. 3వ తరగతి నుంచి 12వ తరగతి వరకు హైస్కూల్ ప్లస్ విధానంలో ఉంటాయని అప్పట్లో ప్రకటించారు. మండలానికి రెండు చొప్పున జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేస్తామన్నారు. 3, 4, 5 తరగతులను ప్రాథమిక పాఠశాలల కేటగిరీ నుంచి ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ఉమ్మడి కేటగిరీలోకి మార్చారు. ఈ పరిణామంతో 12,247 ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్ ప్రభుత్వ పాఠశాలలు ఏకోపాధ్యాయ బడులుగా మారాయి. ఫలితంగా ఎంతోమంది ప్రభుత్వ బడుల విద్యార్థులు ప్రైవేటుకు(Four Type Schools) వెళ్లిపోయారు. అందుకే ఈ విధానాన్ని ఇప్పుడు టీడీపీ సర్కారు ప్రక్షాళన చేస్తోంది.
Also Read :30-30-30 Method : 30-30-30 పద్ధతి అంటే ఏమిటి? పొట్ట కొవ్వును తగ్గించడంలో ఎలా సహాయపడుతుంది..!
మోడల్ ప్రాథమిక పాఠశాలలు..
విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండే పూర్వ ప్రాథమిక విద్య (1, 2 తరగతులు), ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు కలుపుకొని మోడల్ ప్రాథమిక పాఠశాలలుగా ఏర్పాటు చేయనున్నారు. వీటిలో ప్రతి తరగతికీ ఒక్కో టీచర్ చొప్పున గరిష్ఠంగా ఐదుగురిని ఇస్తారు. పిల్లల సంఖ్య 120కి మించితే ప్రధానోపాధ్యాయుడి పోస్టును కూడా కేటాయిస్తారు. 6 నుంచి 10 తరగతులతో హైస్కూళ్లు ఉంటాయి. అంగన్‌వాడీ కేంద్రాలు పూర్వ ప్రాథమిక విద్య(1, 2 తరగతులు)తో శాటిలైట్ ఫౌండేషన్ బడులుగా కంటిన్యూ అవుతాయి. మొత్తం మీద వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో నాలుగు రకాల పాఠశాలల వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. ప్రాథమిక పాఠశాలలే మూడు కేటగిరీల్లో ఉండనున్నాయి.ప్రాథమికోన్నత, హైస్కూల్ ప్లస్ విధానాలు రద్దవుతాయి.
6, 7, 8 తరగతుల్లో కీలకమైన మార్పు ఇదీ..
1 నుంచి8వ తరగతి వరకు ఉండే ప్రాథమికోన్నత బడుల విధానాన్ని రద్దు చేయనున్నారు. వీటిలో విద్యార్థుల సంఖ్య తక్కువ ఉంటే దాని గ్రేడ్‌ను తగ్గిస్తారు. స్టూడెంట్స్ సంఖ్య ఎక్కువ ఉంటే దాని గ్రేడ్‌ను పెంచుతారు. ప్రస్తుతమున్న ప్రాథమికోన్నత బడులలోని 6, 7, 8 తరగతుల్లో 30 మంది కంటే తక్కువ విద్యార్థులుంటే వాటిని ప్రైమరీ స్కూల్స్‌గా మారుస్తారు. అక్కడి 6, 7, 8 తరగతుల విద్యార్థులను సమీపంలోని ప్రభుత్వ హైస్కూళ్లకు తరలిస్తారు. ఒకవేళ ఐదు కిలోమీటర్లలోపు దూరంలో హైస్కూల్ లేకుంటే.. స్థానికంగానే ప్రాథమికోన్నత పాఠశాలను నిర్వహిస్తారు. ఒకవేళ 6, 7, 8 తరగతుల్లో 31 నుంచి 59 మంది విద్యార్థులు ఉంటే ఆ స్కూలు గ్రేడ్‌పై స్థానిక పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతమున్న ప్రాథమికోన్నత బడులలోని 6, 7, 8 తరగతుల్లో 60 కంటే ఎక్కువ మంది పిల్లలుంటే దాన్ని వెంటనే హైస్కూలుగా మార్చేస్తారు. హైస్కూల్ ప్లస్‌లోని ఇంటర్మీడియట్‌ను ప్రభుత్వ ఇంటర్మీడియట్ విద్యా శాఖకు అప్పగిస్తారు.