HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >India To Be No 1 Economy By 2047 Cm Chandrababu

CM Chandrababu: 2047 నాటికి నంబ‌ర్ వ‌న్‌ ఆర్థిక వ్యవస్థగా భారత్: చంద్రబాబు

గత కొన్నేళ్లుగా ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఏపీ రాజధాని అమరావతిని పునరుజ్జీవింపజేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.

  • By Gopichand Published Date - 11:39 PM, Thu - 6 March 25
  • daily-hunt
CM Chandrababu
CM Chandrababu
  • 2047 నాటికి నెం.1 ఆర్థిక వ్యవస్థగా భారత్
  • ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోనే సాధ్యం
  • అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో భారతీయులు
  • ప్రపంచవ్యాప్తంగా నాకు అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు

CM Chandrababu: రిపబ్లిక్ ప్లీనరీ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 2047 నాటికి భారతదేశం నెం.1 ఆర్థిక వ్యవస్థగా మారుతుందని, ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో భారతీయులు ముందుంటారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) అన్నారు. భారతీయులను యూదు సమాజంతో పోలుస్తూ, ప్రపంచంలో అత్యంత సంపన్నులుగా, ప్రభావవంతమైన వ్యక్తులుగా భారతీయులు ఉన్నారని అన్నారు. గురువారం ఢిల్లీలో రిపబ్లిక్ ప్లీనరీ సమ్మిట్‌లో పాల్గొన్న ముఖ్యమంత్రి పలు అంశాలపై మాట్లాడారు.

భారతీయుల ప్రతిభ ప్రతిబింబిస్తోంది

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాంతాల్లో భారతీయులు సంపన్నులుగా ఉన్నారని, ఇది వారి ప్రతిభను ప్రతిబింబిస్తుందని సీఎం అన్నారు. అమెరికాలో భారతీయుల సగటు ఆదాయం మిగిలిన వర్గాల కంటే రెట్టింపని చెప్పారు. అత్యధిక తలసరి ఆదాయం కలిగిన భారతీయుల్లో 33 శాతం మంది తెలుగు కమ్యూనిటీకి చెందినవారు ఉన్నారని అన్నారు. భారతదేశ వృద్ధికి ముఖ్యంగా మూడు రంగాలపై దృష్టి పెట్టినట్టు ముఖ్యమంత్రి వివరించారు. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ద్వారా ఐటీ నుంచి ఏఐ కి మారడం… గ్రీన్ హైడ్రోజన్‌లో అభివృద్ధి సాధించడం… మానవ వనరులని బలోపేతం చేయడంపై తమ లక్ష్యమన్నారు. ఈ రంగాలపై దృష్టి సారించడం వల్ల భారతీయులు ప్రపంచంలోనే అత్యుత్తమ శ్రామిక శక్తిగా, ఆవిష్కర్తలుగా మారతారని అన్నారు.

భారతదేశానికి జనాభానే బలం

భారతదేశ జనాభాలో 65 శాతం మంది 35 ఏళ్ల లోపు ఉన్నందున, భారతదేశానికి జనాభా ప్రయోజనం ఉంది. చైనా, జపాన్ జనాభా తగ్గడం భారతదేశానికి కలిసొచ్చే అంశమని దానిని దేశ అభివృద్ధికి తెలివిగా వినియోగించుకోవాలని చెప్పారు. ఇద్దరు పిల్లల కంటే తక్కువ ఉన్న అభ్యర్థులు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులని చేసే విధానంపై కేంద్రం ఆలోచన చేయాలని సూచించారు.

Also Read: Telangana: నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. 10వేల‌కు పైగా ఉద్యోగాలు!

అమరావతి పునర్నిర్మాణం

గత కొన్నేళ్లుగా ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఏపీ రాజధాని అమరావతిని పునరుజ్జీవింపజేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రపంచంలోనే ప్రత్యేకమైన సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్‌ను ఉపయోగించి 29,000 మంది రైతుల దగ్గర నుంచి 35,000 ఎకరాల భూమిని రాజధాని కోసం సేకరించారని గుర్తు చేశారు. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధాని నగరాల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దుతామని, దానిని మళ్లీ గాడిలోకి తీసుకువస్తామని చెప్పారు.

చారిత్రాత్మక విజయం

2024 ఎన్నికల్లో టీడీపీకి 93 శాతం స్ట్రైక్ రేట్, 57శాతం ఓట్ షేరును సాధించిందని ముఖ్యమంత్రి అన్నారు. తన నాయకత్వానికి ప్రజలు బలమైన మద్దతును ఇచ్చారని అన్నారు. తాను ఎలాంటి నేరం చేయకుండా అరెస్టు చేస్తే, ప్రజలంతా ఆ సమయంలో తనకు అండగా నిలిచారని చెప్పారు. గవర్నెన్స్ అంటే కేవలం హార్డ్ వర్క్ మాత్రమే కాకుండా తెలివిగా ఉండాలని, 1,000 సేవలను మీ సేవ – వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందిస్తున్నామని అన్నారు.

భారతదేశం ముందున్న మార్గం

భారతదేశ అభివృద్ధిని ఆపలేమని చంద్రబాబు అన్నారు. రానున్న 10-15 ఏళ్లలో భారతీయ నిపుణులు సేవా రంగంలో ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్యం చెలాయిస్తారని అంచనా వేశారు. నేటి ప్రపంచంలో దూరం అనేది ఒక పరిమితి కాదని అన్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhrapradesh news
  • AP CM CBN
  • CM Chandrababu
  • New Delhi
  • pm modi
  • Republic Plenary Summit

Related News

CM Chandrababu

CM Chandrababu: లండన్‌ పర్యటనకు సీఎం చంద్రబాబు.. ఆస్ట్రేలియా పర్యటనకు మంత్రి లోకేశ్!

దీంతో పాటు మంత్రి నారా లోకేష్ సీఐఐ భాగస్వామ్య సమ్మిట్ విజయవంతం కోసం ఆస్ట్రేలియాలో రోడ్ షోలకు కూడా హాజరుకానున్నారు. ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక దిగ్గజాలను, వాణిజ్యవేత్తలను ఆహ్వానించేందుకు ఆయన ఈ అంతర్జాతీయ వేదికను ఉపయోగించుకుంటారు.

  • Vizag It Capital

    Investments in Vizag : విశాఖలో పెట్టుబడికి మరో సంస్థ ఆసక్తి

  • AP tops in exports of pharma and aqua products: CM Chandrababu

    CM Chandrababu London : నవంబర్లో లండన్ పర్యటనకు సీఎం చంద్రబాబు

  • PM Modi

    PM Modi : రూ. 13వేల కోట్ల పనులకు రేపు ప్రధాని శ్రీకారం

  • Lokesh Google

    Google : రాష్ట్రానికి చరిత్రాత్మకమైన రోజు – మంత్రి లోకేశ్

Latest News

  • Weight Loss Tips: 15 రోజుల్లో పొట్ట ఉబ్బరం సమస్యను త‌గ్గించుకోండిలా!

  • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

  • Shreyas Iyer: హీరోయిన్‌తో శ్రేయ‌స్ అయ్య‌ర్ డేటింగ్‌.. వీడియో వైర‌ల్‌!

  • India Playing XI: రేపు ఆసీస్‌తో తొలి వ‌న్డే.. భార‌త్ తుది జ‌ట్టు ఇదేనా?

  • India- Russia: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధ‌మైన భార‌త్‌- ర‌ష్యా?!

Trending News

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd