HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >I Will Not Merge Janasena Even If I Die Says Pawan Kalyan

Pawan Kalyan: ప్రజారాజ్యంలా జనసేన ఏ పార్టీలోనూ విలీనం కాదు

విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో టీడీపీ వెనుక నడవడం లేదని, తెలుగుదేశం పార్టీతో కలిసి నడుస్తున్నానని పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన అధికారం కోసం ఓట్లు అడగడం లేదని

  • Author : Vamsi Chowdary Korata Date : 07-12-2023 - 11:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan Kalyan
Pawan Kalyan

Pawan Kalyan: విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో టీడీపీ వెనుక నడవడం లేదని, తెలుగుదేశం పార్టీతో కలిసి నడుస్తున్నానని పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన అధికారం కోసం ఓట్లు అడగడం లేదని.. మార్పు కోసం తనను ఆశీర్వదించాలని కోరుతున్నట్టు పవన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి మేలు చేయాలనే ఉద్దేశంతోనే 2014లో టీడీపీ, బీజేపీలకు మద్దతిచ్చానని పవన్ కల్యాణ్ మరోసారి స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తూ 2019లో రాలేకపోయిన జనసేనాని.. ఏపీ భవిష్యత్తు కోసం 2024లో మళ్లీ కలిసి వస్తున్నామన్నారు. ఎన్నో ఓటములు చవిచూసిన పవన్ కళ్యాణ్.. తాను జీవించి ఉన్నంత వరకు జనసేన పార్టీని మరో పార్టీలో విలీనం చేయనని స్పష్టం చేశారు. ప్రజారాజ్యంలా జనసేన మారబోదని.. మీ ప్రేమను ఓట్లుగా మార్చుకోవాలని జనసేన కార్యకర్తలను కోరారు.

విశాఖ ఉక్కు అంశంపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… విశాఖ ఉక్కు అంశం భావోద్వేగాలతో కూడుకున్నదని, ఇదే విషయాన్ని కేంద్ర నేతలకు తెలియజేసినట్లు పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటం అన్ని జిల్లాలను ఏకం చేసిందని పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖ ఉక్కుపై అమిత్ షా అభిప్రాయాన్ని గౌరవించారన్నారు. తాను ఎన్నడూ ఎన్నికల కోసం ఆలోచించలేదని, ఒక తరం కోసం ఆలోచించానని అన్నారు. ఈ తరాన్ని కాపాడుకుంటూనే భావి తరం కోసం కృషి చేస్తానన్నారు. తాను ఓట్ల కోసం రాలేదని, మార్పు కోసం ఓట్లు వేయాలని పవన్ కల్యాణ్ కోరారు.

ఏపీలో ఆడపిల్లలకు భద్రత కల్పించాలని పవన్ కల్యాణ్ కోరారు. ఆడపిల్లల అదృశ్యంపై మాట్లాడితే హేళన చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులను వైసీపీ ప్రభుత్వం సమర్థంగా వినియోగించుకోవడం లేదని.. టీడీపీ, జనసేనలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే పోలీసు శాఖ పూర్వవైభవం తెస్తామన్నారు. వైసీపీ 151 సీట్లతో గెలిచినా సరైన ఉద్యోగాలు ఇవ్వలేదని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతే తన ఆలోచన, ఆశయం అని చెప్పిన పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో జగన్ ను ఓడించి టీడీపీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Also Read: Senaga Vadalu: చలికాలంలో వేడివేడి శెనగల వడలు.. ఇంట్లోనే చేసుకోండిలా?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Janasena
  • merge
  • Pawan Kalyan
  • tdp
  • Visakhapatnam
  • Vizag Meeting
  • ysrcp

Related News

Tdp

TDP: రాజ్యసభకు టీడీపీ నుంచి భారీగా ఆశావహుల

ఏపీలో రాజ్యసభ ఎంపీ పదవుల సందడి నెల ముందే మొదలైంది. వచ్చే నెలలో 4 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. దీంతో తమ పేరు పరిశీలించాలంటూ వినతులు మొదలయ్యాయి. టీడీపీలో భారీగా ఆశావహులు ఉన్నారు. మిత్రపక్షాలకు ఎన్ని ఇస్తారన్నదానిపైనే టీడీపీ నేతలకు కేటాయింపు ఉంటుందని చెబుతున్నారు. టీడీపీ నుంచి రేసులో ఏకంగా 8 మంది పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో రాజ

    Latest News

    • Cm chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం : సీఎం చంద్రబాబు

    • Relationship: ఎప్పుడూ తాగి ఉండే భర్తతో ఎలా ఉండాలి?

    • Kavith-KCR: కేసీఆర్‌ టార్గెట్‌గా.. కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు

    • Gutta Jwala: 60 లీటర్ల తల్లిపాలు దానం చేసిన మాజీ బ్యాడ్మింటన్ గుత్తా జ్వాల

    • High BP: హై బీపీ అంటే ఏమిటి? దీని వల్ల శరీరానికి ఎలాంటి హాని కలుగుతుంది?

    Trending News

      • Inflation In India: దేశవ్యాప్తంగా పెరిగిన నిత్యావసరాలు ధరలు

      • Petrol Prices Hike: వాహనదారులకు షాక్..పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

      • Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం.. చంద్రబాబు కీలక ప్రకటన..!

      • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

      • TVK విజయ్‌ అను నేను..

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd