HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Govt To Develop Data City Near Vizag

Data City : హైటెక్ సిటీ తరహాలో వైజాగ్ లో “డేటా సిటీ”..!

Chandrababu : హైదరాబాద్‌లో హైటెక్ సిటీని విజయవంతంగా అభివృద్ధి చేసిన చంద్రబాబు, ఇప్పుడు అదే మోడల్‌ను అనుసరించి విశాఖపట్నంలో ప్రతిష్ఠాత్మకమైన “డేటా సిటీ”ని ఏర్పాటు

  • Author : Sudheer Date : 28-01-2025 - 5:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Data City Vizag
Data City Vizag

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టెక్నాలజీ రంగంలో ముందంజలో నిలపడం లక్ష్యంగా చంద్రబాబు అనేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. హైదరాబాద్‌లో హైటెక్ సిటీని విజయవంతంగా అభివృద్ధి చేసిన చంద్రబాబు (Chandrababu), ఇప్పుడు అదే మోడల్‌ను అనుసరించి విశాఖపట్నంలో ప్రతిష్ఠాత్మకమైన “డేటా సిటీ”(Data City)ని ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్నారు. ఐటీ రంగంలో విభిన్న కేటగిరీల కోసం మౌలిక సదుపాయాలు కల్పించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి ఆవిష్కరణల కోసం విశాఖను కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వ లక్ష్యం గా పెట్టుకుంది..

500 ఎకరాల్లో డేటా సిటీ ప్రణాళిక :

విశాఖ సమీపంలోని మధురవాడలో 500 ఎకరాల్లో డేటా సిటీని ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు వేగవంతం చేశారు. ఈ సిటీ ద్వారా ఐటీ సంస్థలకు విశాల స్థలాన్ని అందుబాటులోకి తేవడమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా , ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వ దృష్టి సారించింది.

డేటా సిటీ కాన్సెప్ట్‌పై ఇప్పటికే గూగుల్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వంటి దిగ్గజ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. గూగుల్ 80 ఎకరాల్లో డేటా సెంటర్‌ను నిర్మించేందుకు ముందుకు రాగా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 30 ఎకరాల్లో ఐటీ ప్రాంగణాన్ని అభివృద్ధి చేయనుంది. ఇది రాష్ట్రంలో ఐటీ రంగం వికాసానికి కొత్త దిశగా మారనుంది. ఇక దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్)లో ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ అనేక అంతర్జాతీయ కంపెనీలతో చర్చలు జరిపారు. టెమాసెక్ హోల్డింగ్స్, కాగ్నిజెంట్ వంటి సంస్థలతో సాగిన చర్చలు రాష్ట్రంలో డేటా సెంటర్లు, AI హబ్‌ల స్థాపనకు ప్రోత్సాహం ఇచ్చాయి. విశాఖలో డేటా సిటీ ఏర్పాటుతో రాష్ట్రం టెక్నాలజీ రంగంలో కీలకంగా నిలవడమే కాకుండా, సమీప రాష్ట్రాలకు సైతం ఒక ఆర్ధిక కేంద్రంగా మారనుంది. ఈ ప్రాజెక్టు ఐటీ రంగంలో పెట్టుబడులు ఆకర్షించడంలో, ఉద్యోగావకాశాలు సృష్టించడంలో కీలక పాత్ర పోషించనుందని అంత భావిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • chandrababu
  • Data City
  • vizag

Related News

Killed His Girlfriend

Vizag : ప్రియురాలిని చంపి, ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టిన ప్రేమికుడు

విశాఖపట్నంలోని ఎల్‌వీ నగర్‌లో సభ్యసమాజం తలదించుకునేలా ఒక దారుణ ఘటన వెలుగుచూసింది. నమ్మిన ప్రియురాలిని అతికిరాతకంగా చంపి, ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా

  • Pemmasani Vs Ambati

    Pemmasani Vs Ambati : వచ్చే ఎన్నికల్లో బ్యాలెట్ తో తంతే అమెరికాలో పడతావ్ జాగ్రత్త – పెమ్మసాని కి అంబటి కౌంటర్

  • Seat Increase In Lok Sabha

    Seat Increase in Lok Sabha & Assemblies : ఏపీలో నియోజకవర్గాలు పెరిగితే ఏ పార్టీ కి లాభం ?

  • Lokesh Rtd2

    Rural Development Trust: మాట ఇచ్చారు.. మడమ తిప్పకుండా నెరవేర్చారు దటీజ్ నారా లోకేష్

  • Jawa Yezdi

    Jawa Yezdi : కోస్తా తీరంలో క్లాసిక్ రైడ్స్ కోసం సిద్ధమైన కొత్త 3S సెంటర్!

Latest News

  • బ్లడ్ క్యాన్సర్ అంటే ఏమిటి? ఎందుకు ప్రమాదకరం?

  • నారాయణపేట జిల్లాలో దారుణం : పదో తరగతి విద్యార్థినిపై టీచర్ అఘాయిత్యం..బయటపెట్టిన సీక్రెట్ కెమెరా

  • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

  • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

  • కనిష్ట స్థాయికి ప‌డిపోయిన రూపాయి విలువ‌!

Trending News

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

    • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd