HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Govindappa Balaji The Key Accused In The Ap Liquor Scam Case Has Been Arrested

AP Liquor Scam : లిక్కర్ స్కాం కీలక నిందితుడు గోవిందప్ప బాలాజీ అరెస్ట్.. ఎవరు ?

గోవిందప్ప బాలాజీ వైఎస్ జగన్‌కు చెందిన భారతీ సిమెంట్స్‌(AP Liquor Scam)లో పూర్తికాలపు డైరెక్టర్‌గా ఉన్నారు.

  • Author : Pasha Date : 13-05-2025 - 12:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap Liquor Scam Govindappa Balaji Andhra Pradesh Ysrcp Ys Jagan

AP Liquor Scam : వైఎస్సార్ సీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో భారీ లిక్కర్ స్కాం జరిగిందనే అభియోగాలు ఉన్నాయి. ఈ స్కాంలోని  కీలక నిందితుడు గోవిందప్ప బాలాజీని సిట్‌ అధికారులు అరెస్టు చేశారు. అతడిని కర్ణాటకలోని మైసూర్‌లో అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి విజయవాడకు తీసుకొస్తున్నారు. పక్కా సమాచారంతో  గోవిందప్ప బాలాజీపై సిట్‌ అధికారులు నిఘా పెట్టి మరీ అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు జరిగిన అరెస్టుల సంఖ్య ఐదుకు చేరింది.

Also Read :India Vs Kirana Hills: కిరానా హిల్స్‌‌ను వణికించిన భారత్.. దారికొచ్చిన పాకిస్తాన్

గోవిందప్ప బాలాజీ ఎవరు ? ఏం చేశారు ? 

గోవిందప్ప బాలాజీ వైఎస్ జగన్‌కు చెందిన భారతీ సిమెంట్స్‌(AP Liquor Scam)లో పూర్తికాలపు డైరెక్టర్‌గా ఉన్నారు. ఆయన చిత్తూరు జిల్లా పలమనేరు వాస్తవ్యులు. జగన్‌ సతీమణి భారతి డైరెక్టర్‌గా ఉన్న భారతీ సిమెంట్స్‌లో.. గోవిందప్ప బాలాజీ 2010 ఏప్రిల్‌ 30 నుంచి పూర్తికాలపు డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఆ సంస్థ ఆర్థిక వ్యవహారాలు, కొనుగోళ్లు, ఐటీ కార్యకలాపాల బాధ్యతలన్నీ ఆయనే చూస్తారు.  వైఎస్సార్ సీపీ పాలనా కాలంలో పెద్దసంఖ్యలో మద్యం సరఫరా ఆర్డర్లు పొందిన కంపెనీలు, డిస్టిల్లరీల నుంచి ప్రతినెలా వసూలు చేసిన రూ.60 కోట్ల ముడుపులను రాజ్‌ కసిరెడ్డి తీసుకెళ్లి గోవిందప్ప బాలాజీకి, వైఎస్ జగన్‌ వద్ద ఓఎస్డీగా పనిచేసిన కృష్ణ మోహన్‌ రెడ్డికి ఇచ్చేవారని సిట్ దర్యాప్తులో వెల్లడైంది. ఈ ముడుపుల సొమ్మును గోవిందప్ప బాలాజీ,  కృష్ణ మోహన్‌ రెడ్డి తీసుకెళ్లి ఎవరికి ఇచ్చేవారు ? అనేది గుర్తించడంపై సిట్ అధికారులు ప్రధాన ఫోకస్ పెట్టారు.

Also Read :Terrorists Encounter : కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. లష్కరే ఉగ్రవాది హతం.. మరో ముగ్గురి కోసం వేట

మద్యం ముడుపుల డబ్బులను ఏం చేశారు ?

కృష్ణమోహన్‌రెడ్డి, గోవిందప్ప బాలాజీ ఇద్దరూ వైఎస్ జగన్, వైఎస్ భారతిలకు నమ్మినబంట్లు. కృష్ణమోహన్‌రెడ్డి నిరంతరం జగన్‌ వెంటే ఉండేవారు. వైఎస్ భారతి తరఫున ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలను గోవిందప్ప బాలాజీయే చక్కబెట్టే వారట. గోవిందప్ప బాలాజీ  ఒక సీఏ. ఆయన చేతుల మీదుగానే మద్యం ముడుపుల డబ్బులు వివిధ మార్గాల్లోకి మళ్లి ఉండొచ్చని సిట్ అధికారులు అంచనా వేస్తున్నారు. మద్యం ముడుపుల డబ్బులను ఏం చేశారు ? వాటిని ఏయే కంపెనీల్లో పెట్టుబడి పెట్టారు ? ఏయే రూపంలో విదేశాలకు తరలించారు ? అనే కోణంలో ప్రస్తుతం సిట్ దర్యాప్తు సాగుతోంది. ప్రముఖ మద్యం బ్రాండ్లను అణగదొక్కటం, ముడుపులిచ్చిన కంపెనీల బ్రాండ్లను ప్రోత్సహించటం తద్వారా రూ.3,200 కోట్ల మేర ముడుపులను వసూలు చేయటంలో రాజ్‌ కసిరెడ్డితోపాటు గోవిందప్ప బాలాజీ కీలక పాత్ర పోషించారని సిట్‌ తేల్చింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • AP Liquor Scam
  • Govindappa Balaji
  • ys jagan
  • ysrcp

Related News

YS Jagan Visit Jogi Ramesh House Ibrahimpatnam Vijayawada

జోగి రమేష్ ఇంటికి వైసీపీ అధినేత వైఎస్ జగన్

Jogi Ramesh మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ నివాసంపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే. మంత్రి నారా లోకేశ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో జోగి నివాసంపై దాడి చేసి, నిప్పు పెట్టారు. ఈ క్రమంలో, జోగి రమేశ్ ను పరామర్శించేందుకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి కాసేపట్లో జగన్ బయల్దేరనున్నారు. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ నివాసానికి వెళ్లేందుకు పోలీసులకు వైసీపీ ఒక రూ

  • Ys Jagan To Visit Jogi Rame

    అంబటి, జోగి కుటుంబాలను పరామర్శించనున్న జగన్ ! గుంటూరు లో ఏంజరుగుతుందో ?

Latest News

  • ఒంటరిగా ఉన్నప్పుడు గుండెపోటు వస్తే ఏం చేయాలి?

  • భారీ బూట్ స్పేస్‌ను అందించే కార్ల జాబితా ఇదే!

  • 1 లక్ష రూపాయల పెట్టుబడి.. 78 లక్షలయ్యింది!

  • అండర్-19 వరల్డ్ కప్ ట్రోఫీ టీమిండియాదే!

  • టీ20 ప్రపంచకప్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్‌.. రేపట్నుంచి సంద‌డే!

Trending News

    • ధోనీ త‌ర్వాత వైభ‌వ్ సూర్య‌వంశీనే!

    • సేవ్ అమెరికా చట్టం అంటే ఏమిటి?

    • సైనిక శక్తిని మరింత పటిష్టం చేసుకున్న ఇరాన్‌.. రంగంలోకి సెజ్జిల్-2 బాలిస్టిక్ మిసైల్!

    • ఈనెల‌లో బ్యాంకులు ప‌ని చేసేది ఎన్ని రోజులంటే?!

    • రోజ్ డే పూలను ఎలా భద్రపరుచుకోవాలి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd