HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Good News For Motorists In Ap Vehicle Registration Within 24 Hours

ఏపీలో వాహనదారులకు గుడ్ న్యూస్ 24 గంటల్లోపే వాహనాల రిజిస్ట్రేషన్‌

  • Author : Vamsi Chowdary Korata Date : 08-05-2026 - 2:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap Transport Department
Ap Transport Department

ఏపీలో 24 గంటల్లోపే వాహనాల రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రవాణాశాఖ 24 గంటల్లోగా రిజిస్ట్రేషన్‌కు సంబంధించి నిర్ణయం తీసుకోవాలి, లేదంటే ఆటోమేటిక్‌గా 24 గంటల తర్వాత ఆమోదం పొందినట్లే లెక్క. ఏపీ ప్రభుత్వం త్వరలోనే ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త విధానానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాహనాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ కోసం రోజుల తరబడి వేచి ఉండే పనిలేకుండా 24 గంటల్లోనే పూర్తి చేసేలా కొత్త విధానాన్ని తీసుకువస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న విధానం ప్రకారం, ఎవరైనా కొత్తగా వాహనం కొనుగోలు చేస్తే డీలర్‌ తాత్కాలిక (టెంపరరీ) రిజిస్ట్రేషన్‌ చేస్తారు. ఆ తర్వాత రవాణాశాఖ ఆమోదం తెలిపితే పర్మినెంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ఈ విధానంలో ప్రజలు రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశంపై అధికారులతో చర్చించారు. రాబోయే రోజుల్లో వాహనాల రిజిస్ట్రేషన్‌కు ఎలాంటి ఆలస్యం లేకుండా వాహనదారులకు వెంటనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు. వెంటనే రంగంలోకి దిగిన రవాణాశాఖ 24 గంటల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసేలా కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నారు. ఏపీ ప్రభుత్వం వారం రోజుల్లో ఆమోదిస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 27 వేల వాహనాల వరకు రవాణాశాఖ అధికారుల దగ్గర పర్మినెంట్ రిజిస్ట్రేషన్ కోసం పెండింగ్‌లో ఉన్నాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయడానికి నిర్ణీత గడువు లేకపోవడమే దీనికి కారణమని అంటున్నారు.

ఏపీ ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విధానం అమల్లోకి వస్తే, రవాణాశాఖ అధికారులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను కేవలం 24 గంటల్లోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. డీలర్ దగ్గర వాహనాలు కొనుగోలు చేసిన తర్వాత టెంపరరీ రిజిస్ట్రేషన్ చేస్తారు. ఆ తర్వాత ఫ్యాన్సీ నంబరు కోసం దరఖాస్తు చేసుకున్నవారు మినహా మిగిలిన అందరి వాహనాల రిజిస్ట్రేషన్ అప్లికేషన్‌లను రవాణాశాఖ అధికారులు 24 గంటల్లో పరిశీలించి ఆమోదించాల్సి ఉంటుంది. పర్మినెంట్ (శాశ్వత) రిజిస్ట్రేషన్ ప్రక్రియ, నంబర్ జనరేట్ చేయడం గడువులోపే పూర్తి చేయాలి. ఒకవేళ 24 గంటల్లోపు అధికారులు ఈ ప్రక్రియను పూర్తి చేయకపోతే, ఆ వెంటనే ఆటోమెటిక్‌గా (24 గంటల తర్వాత) రిజిస్ట్రేషన్‌కు ఆమోదం లభిస్తుంది. ఒకవేళ సెలవు రోజులు ఉంటే, ఆ రోజు కూడా ఆన్‌లైన్‌లో అధికారులు ఆమోదం తెలిపే అవకాశం కల్పిస్తారు.

అలాగే వాహన డీలర్‌కు తాత్కాలిక రిజిస్ట్రేషన్‌తో పాటు శాశ్వత రిజిస్ట్రేషన్ అధికారాన్ని అప్పగించే అంశాన్ని ముందు పరిశీలించారు. ఇలా చేస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయని, ఆ శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించి అధికారం రవాణాశాఖ అధికారుల దగ్గర మాత్రమే ఉండాలని అధికారులు తేల్చి చెప్పారు. ఆ తర్వాత 24 గంటల్లో రిజిస్ట్రేషన్ పూర్తిచేసే ప్రతిపాదనల్ని ప్రభుత్వానికి పంపారు. అక్కడ నుంచి ఆమోదం రాగానే 24 గంటల్లో రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలా కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP CM Chandrababu Naidu
  • AP government
  • AP Transport Department
  • New Vehicle Registration
  • RTA
  • Vehicle Registration

Related News

Varma

Pithapuram వర్మపై టీడీపీ వేటు

2024 ఎన్నికల తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో తరచుగా వివాదాలు నెలకొంటుండడంపై టీడీపీ హైకమాండ్ దృష్టిసారించింది.. నియోజకవర్గంలో వరుసగా చోటుచేసుకుంటున్న పరిణామాలను తీవ్రంగా పరిగణించిన టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ పార్టీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేస

  • CM Chandrababu's Remarks at the 7th Phase Collectors' Conference

    Chandrababu: 7వ విడత కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు

  • Ex Union Minister Maneka Gandhi Letter to Chandrababu Naidu

    చంద్రబాబుకు మేనకా గాంధీ లేఖ.. గంగమ్మ జాతరలో జంతు బలులు ఆపండి

  • CM Chandrababu Naidu to Visit Pawan Kalyans Residence

    పవన్ ఇంటికి సీఎం చంద్రబాబు

Latest News

  • CM VIJAY: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌

  • Breaking News: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మేజిక్ ఫిగర్ చేరిక

  • Hantavirus: హంటా వైరస్ లక్షణాలు ఏంటి? కరోనా కంటే ప్రమాదమా?

  • Tamil Nadu politics: దళపతి విజయ్‌కు భారీ షాక్..

  • Ram Charan పెద్ది సెట్స్ లో చిరంజీవి సందడి

Trending News

    • సభ్యసమాజం తలదించుకునే ఘటన.. అక్కాతమ్ముడి పెళ్లి.. ఎక్కడంటే..?

    • TVK: 107 మంది ఎమ్మెల్యేలు తో విజయ్ రాజీనామా

    • Kamal Haasan: గవర్నర్ పై కమల్ హాసన్ ఆగ్రహం

    • CM Vijay Thalapathy: సీఎం విజయ్‌ కి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. గవర్నర్‌తో మరోసారి విజయ్ భేటీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd