HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Good News For Government Employees In Ap

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..

  • Author : Vamsi Chowdary Korata Date : 18-02-2026 - 10:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Andhra Pradesh Logo
Andhra Pradesh Logo

Andhrapradesh Govt  ఏపీ ప్రభుత్వం ప్రాథమిక సహకార పరపతి సంఘాల ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు సంబంధించిన హెచ్ఆర్ పాలసీ అమలు కోసం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పీఏసీఎస్‌‌కు సంబంధించి ఉన్నతస్థాయి కమిటీని కూడా నియమించింది. ఉద్యోగుల హెచ్‌ఆర్‌ సంబంధిత సమస్యల్ని ఈ కమిటీ పరిశీలించి తగిన సూచనలు చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

  • ఏపీ పీఏసీఎస్‌ ఉద్యోగుల హెచ్ఆర్ పాలసీ
  • కీలక ఉత్తర్వులు జార చేసిన ఏపీ ప్రభుత్వం
  • అలాగే ఉన్నతస్థాయి కమిటీ నియామకం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీఏసీఎస్‌ (ప్రాథమిక సహకార పరపతి సంఘాల) ఉద్యోగులకు తీపికబురు చెప్పింది. ఈ ఉద్యోగులకు సంబంధించి హెచ్‌ఆర్‌ పాలసీ అమలుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జులై వరకు తీసుకోనున్న చర్యల్ని ప్రధానంగా వివరించారు. ఈ నెలాఖరులోగా పీఏసీఎస్‌ ఉద్యోగులకు సంబంధించి కీలక చర్యలు చేపడతారు. డీఎల్‌ఈసీ ద్వారా పేస్కేల్స్‌ ధ్రువీకరణ, నిర్ధారణ, అమలు.. సర్వీస్‌ రిజిస్టర్ల అప్‌డేట్, ధ్రువీకరణపై సమాచారం ఇస్తారు. ఉద్యోగులకు సంబంధించిన కోర్టు/విజిలెన్స్‌ కేసులతో సహా మాస్టర్‌ డేటాబేస్‌ ప్రిపేర్ చేస్తారు. ఉద్యోగులకు సంబంధించిన జీతాల పెంపు సామర్థ్యం, పీఏసీఎస్‌ల వర్గీకరణతో పాటుగా ఎస్టాబ్లిష్‌మెంట్‌ ఖర్చులకు కామన్‌పూల్‌ ఎకౌంట్‌ అమలు వంటి అంశాలపై చర్యలు తీసుకుంటారు.

ఈ మేరకు ప్రాథమిక సహకార పరపతి సంఘాల ఉద్యోగుల 12 డిమాండ్లతో పాటుగా వాటిపై తీసుకున్న చర్యలను జీవోలో వివరించారు. ‘మార్చి నుంచి జులై వరకు అదనపు స్టాఫ్, ఖాళీల గుర్తింపు, మూడేళ్లు సర్వీస్‌ పూర్తి చేసుకున్న ఉద్యోగులకు సాధారణ బదిలీలు, అవసరమైన పీఏసీఎస్‌లకు అదనపు సిబ్బంది నియామకం, కొత్తగా నియమించిన/పదోన్నతి ఇచ్చిన వారికి శిక్షణ, సామర్థ్యం, డీఎల్‌ఈసీల ద్వారా పదోన్నతులు, వన్‌మేకర్‌ వన్‌చెకర్‌ మోడల్‌ కింద డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్’ వంటి చర్యలు చేపడతారు.

మరోవైపు ఏపీ ప్రభుత్వం పీఏసీఎస్‌ (ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల) కు సంబంధించి ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఈ కమిటీ పీఎసీఎస్‌‌ల ఆర్థిక పరిస్థితి పాటుగా ఉద్యోగుల హెచ్‌ఆర్‌ సంబంధిత సమస్యల్ని పరిశీలించి తగిన సూచనలు చేయనుంది. ఈ కమిటీలో పలు కీలక అధికారుల్ని సభ్యులుగా నియమించారు. ‘వ్యవసాయ శాఖ ఎక్స్‌ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఛైర్మన్‌గా కమిటీ ఉంటుంది. ఆప్కాబ్‌ ఎండీ సభ్య కన్వీనర్‌‌గా ఉంటారు. సహకార శాఖ కమిషనర్, నాబార్డు సీజీఎం సభ్యులుగా ఉంటారు’ అని ప్రభుత్వం తెలిపింది. ఈ కమిటీ పీఏసీఎస్‌ల ఆర్థిక పరిస్థితిని ప్రధానంగా పరిశీలిస్తుంది. అలాగే పీఏసీఎస్‌ల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల్ని కూడా సూచిస్తారు. హెచ్‌ఆర్‌‌కు సంబంధించిన సమస్యలు, సర్వీసు కండిషన్లు, సుస్థిర అభివృద్ధి, సామర్థ్య పెంపు, నైపుణ్యం కల్పించడం, సంక్షేమ చర్యలు, సర్వీస్‌ డెలివరీ మెరుగుపరచడం వంటి వాటిని కూడా కమిటీ సిఫార్సు చేయనుంది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh government
  • andhra pradesh government employees
  • Andhrapradesh
  • AP CM Chandrababu Naidu
  • AP Deputy CM Pawan kalyan
  • Kutami Government

Related News

CM Chandrababu launches the book 'CBN@361 Degrees' in Singapore.

Chandrababu Naidu: సింగపూర్‌లో సీబీఎన్@361 డిగ్రీస్ పుస్తకం ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాలనా దక్షత, దార్శనికతపై రాసిన ‘సీబీఎన్@361 డిగ్రీస్.. పాలీమ్యాథ్’ అనే పుస్తకాన్ని సింగపూర్‌లో ఆవిష్కరించారు. కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పుస్తకాన్ని విడుదల చేశారు. అనంతరం పుస్తకం తొలి ప్రతులను సింగపూర్‌లోని భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే, రాష్ట్ర మంత్రి పి. నారాయణ, అసోసియేషన్ ప్రతినిధు

  • Pawan Kalyan's comments on the 'Cockroach Party'

    Pawan Kalyan: కాక్రోచ్ పార్టీ పై పవన్‌ కల్యాణ్‌ కామెంట్స్‌

  • Chandrababu

    Chandrababu Naidu: సింగపూర్‌కు సీఎం చంద్రబాబు.. రెండు రోజులు వరుస భేటీలు..!

  • Village development in AP: Centre allocates Rs 16,627 crore.

    ఏపీకి కేంద్రం పెద్దపీట.. గ్రామాల అభివృద్ధి.. రూ.16,627 కోట్లు మంజూరు

Latest News

  • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

  • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd