HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pawan Kalyans Comments On The Cockroach Party

Pawan Kalyan: కాక్రోచ్ పార్టీ పై పవన్‌ కల్యాణ్‌ కామెంట్స్‌

  • Author : Vamsi Chowdary Korata Date : 15-06-2026 - 3:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan Kalyan's comments on the 'Cockroach Party'
Pawan Kalyan's comments on the 'Cockroach Party'

దేశవ్యాప్తంగా ఇటీవలి కాలంలో తీవ్ర చర్చనీయాంశమైన అంశం.. కాక్రోచ్ జనతా పార్టీ. అవినీతి, నిరుద్యోగం, విద్యావ్యవస్థలోని లోపాలను నిరసిస్తూ సోషల్ మీడియాలో యువత ద్వారా పుట్టుకొచ్చిన ఉద్యమం ఇది. కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఇప్పటికే దేశవ్యాప్తంగా పలుచోట్ల నిరసన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కాక్రోచ్ జనతా పార్టీపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సేన ప్రస్థానం.. జాతీయ సమైక్యత కోసం ఢిల్లీలో జనసేన పార్టీ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. కాక్రోచ్ జనతా పార్టీపై స్పందించారు.

సుమతీ శతకంలో చెప్పినట్లు బలమైన సర్పం కూడా చలిచీమల చేతిలో చిక్కి చనిపోతుంది. స్థాయి లేదు, చిన్న మనుషులే అనుకుంటాం. ప్రతి ఒక్కరి గురించి ఏదైనా మాట్లాడవచ్చని అనుకుంటాం. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. కాక్రోచ్ అనే పార్టీ పుట్టుకొచ్చింది. నాకు సుమతీ శతకం గుర్తొచ్చింది. చాలా చిన్న ప్రాణులైన చీమలు కూడా బలమైన పామును చంపేస్తాయి. దేశ సమగ్రతను బలి చేసేందుకు శక్తులు సిద్ధంగా ఉన్నాయి. అలాంటి ఆలోచనా ధోరణిలో మనం చిక్కుకోకూడదనే ఉద్దేశంతో ఢిల్లీలో సమావేశమయ్యాం. కోట్ల మంది వ్యక్తులు కలిస్తే చాలా బలమైన ప్రభావాన్ని చూపించవచ్చు. అది మంచిదైనా, చెడైనా.. విభజనవాదాన్ని సృష్టిస్తున్న పరిస్థితులలో మనం అందులో భాగస్వాములు కాకూడదు. ఎదురుతిరిగి పోరాడాలి. ఐక్యంగా పోరాడాలి” అంటూ పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.

మరోవైపు 12 ఏళ్ల క్రితం జనసేన పార్టీని స్థాపించిన సమయంలో దేశ శ్రేయస్సు, సమగ్రత తప్ప వేరే ఆలోచన లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. అధికారంలోకి వస్తామో లేదో అనే ఆలోచన కూడా లేదన్నారు. 12 ఏళ్ల ప్రయాణంలో అనేక పోరాటాలు, పరాజయాలు చవిచూశామన్నారు. ప్రాథమిక సూత్రాలకు అనుగుణంగా పార్టీని నడుపుతూ 21 మంది ఎమ్మెల్యే స్థానాలు, 3 ఎంపీ స్థానాలను సాధించామని వెల్లడించారు. లక్ష మంది సభ్యులతో ప్రారంభమైన జనసేన పార్టీకి నేడు 20 లక్షలకు పైగా సభ్యత్వాలు వచ్చాయన్నారు. ఈ మధ్యకాలంలో జనసేన పార్టీలోకి అన్ని ప్రాంతాల నుంచి చేరికలు జరుగుతున్నాయని వివరించారు.

ఈ క్రమంలోనే తెలంగాణ గురించి పవన్ కళ్యాణ్ మరోసారి ప్రస్తావించారు. జనసేన పార్టీ తెలంగాణ ఏర్పాటును ఎప్పుడూ అడ్డుకోలేదన్న పవన్.. ఏపీని విభజించిన తీరుపైనే ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ తీరు అశాంతిని సృష్టించిందన్న ఆయన.. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ తన ధోరణి మార్చుకోలేదన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున హైదరాబాద్‌లో తన సభను అడ్డుకోవడమే అందుకు ఉదాహరణగా పేర్కొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra politics
  • AP Deputy CM Pawan kalyan
  • Cockroach Janata Party
  • Delhi Meeting
  • janasena party
  • YS Jagaan
  • YSR Congress Party

Related News

YS Jagan pays tribute to YSR.

YSR: వైఎస్సార్‌కు వైఎస్‌ జగన్‌ నివాళులు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని ఇడుపులపాయలోని వైఎస్సార్ ఎస్టేట్‌కు చేరుకున్నారు. అక్కడ ఉన్న వైఎస్సార్ ఘాట్ వద్ద తన తండ్రి సమాధిపై పూలమాలలు ఉంచి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ ఆత్మీయ స్మరణ కార్యక్రమంలో జగన్ మోహన్ రెడ్డితో పాటు ఆయన తల్లి వైఎస్ విజ

  • Prakash Raj lashes out over repeated arrests of 'Ravan'.

    Prakash Raj: రావణ్ మళ్ళీ మళ్ళీ అరెస్ట్ పై ప్రకాష్ రాజ్ ఫైర్

  • Capital war reignites in AP... Amaravati versus Mavigan...

    Capital War: ఏపీలో మళ్లీ క్యాపిటల్ వార్.. అమరావతి వర్సెస్ మావిగన్..

Latest News

  • Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

  • LPG gas cylinder: భారీ వర్షాలకు కొట్టుకొస్తున్న 3,000 ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు

  • Ravana: యూట్యూబర్ రావణ్‌కు బిగ్ షాక్

  • Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు

  • Rain Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక..

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd