HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cm Chandrababu To Visit Singapore Two Days Of Back To Back Meetings

Chandrababu Naidu: సింగపూర్‌కు సీఎం చంద్రబాబు.. రెండు రోజులు వరుస భేటీలు..!

  • Author : Vamsi Chowdary Korata Date : 13-06-2026 - 2:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chandrababu
Chandrababu

ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు సింగపూర్‌లో పర్యటించనున్నారు. జూన్ 14 నుంచి సాగే ఈ పర్యటనలో రాష్ట్రానికి, ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు సమీకరించడంపై ఆయన ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ఇందుకోసం రేపు ఉదయం బెంగళూరు నుంచి ఆయన సింగపూర్‌కు బయలుదేరుతారు. ముఖ్యమంత్రి వెంట పురపాలక శాఖ మంత్రి నారాయణ, పలువురు ఉన్నతాధికారులు కూడా ఈ పర్యటనకు వెళ్లనున్నారు.

పర్యటనలో భాగంగా చంద్రబాబు సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో పాటు ఆ దేశ ఉప ప్రధాని, వాణిజ్య మంత్రి గాన్ కిమ్ యాంగ్, విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్, హోం మంత్రి షణ్ముగమ్ వంటి కీలక నేతలతో సమావేశమవుతారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను, ప్రభుత్వ విధానాలను వారికి వివరించనున్నారు. తొలుత సింగపూర్‌లోని భారత హై కమిషనర్ శిల్పక్ అంబులేతో భేటీ అయి పర్యటన అజెండాపై చర్చిస్తారు.

పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు గూగుల్ క్లౌడ్, జీఐసీ, వైసీహెచ్ లాజిస్టిక్స్ వంటి దిగ్గజ సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు భేటీ కానున్నారు. స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో జరిగే రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్ అధ్యక్షుడితోనూ సమావేశమై విద్యా రంగంలో భాగస్వామ్యంపై చర్చిస్తారు. ఈ పర్యటనలో అత్యంత కీలకమైన అంశం రాజధాని అమరావతి. రాజధాని మాస్టర్ ప్లాన్ రూపొందించిన సుర్బానా జురాంగ్ సంస్థ ప్రతినిధులతో అమరావతి ప్రణాళికపై ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

పర్యటనలో భాగంగా ‘వరల్డ్ సిటీస్ సమ్మిట్’లో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం 2026లో విశాఖలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు సన్నాహకంగా ఏర్పాటు చేసిన బిజినెస్ రోడ్‌షోలో చంద్రబాబు పాల్గొంటారు. పర్యటన ముగించుకుని 16న రాత్రి 10 గంటలకు ఆయన తిరిగి స్వదేశానికి రానున్నారు. ముఖ్యమంత్రి వెంట పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ కుమార్, సీఆర్డీఏ అధికారుల బృందం కూడా ఈ పర్యటనలో పాల్గొంటాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Amaravati capital
  • AP CM Chandrababu Naidu
  • AP Investments
  • Singapore Visit

Related News

Good news for the unemployed in AP: Green signal given to fill job vacancies in the Electricity Department.

APSPDCL: ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. విద్యుత్ శాఖలో ఉద్యోగాలు భర్తీకి గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధిలోని విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది, ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. మొత్తం 629 ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ ప్రకటన వెలువడింది. వివిధ ప్రభుత్వ విద్యుత్ సంస్థల వారీగా విభజించిన ఈ ఖాళీలలో.. ఏపీ ట్రాన్స్‌కో (AP Transco) లో అత్యధికంగా 200 పోస్టులు ఉన్నాయి. వీటి

  • Former MP Vijayasai Reddy files petition in High Court regarding Amaravati capital.

    Vijayasai Reddy: అమరావతి రాజధానిపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హైకోర్టులో పిటిషన్

  • Capital war reignites in AP... Amaravati versus Mavigan...

    Capital War: ఏపీలో మళ్లీ క్యాపిటల్ వార్.. అమరావతి వర్సెస్ మావిగన్..

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd