HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Good News For Ap Government Employees Release Of Rs 7059 Crore In Arrears

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. రూ.7,059 కోట్ల బకాయిల విడుదల

  • Author : Vamsi Chowdary Korata Date : 02-04-2026 - 12:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
andhra pradesh Release Pending Dues retired employees
andhra pradesh Release Pending Dues retired employees

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి తీపి కబురు అందబోతోంది. గత ప్రభుత్వం ఉద్యోగులకు పెట్టిన బకాయిల చెల్లింపులపై కసరత్తు జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ నిధుల లభ్యతను బట్టి ఉద్యోగులకు వీలైనంత త్వరగా చెల్లింపులు జరిపేలా కసరత్తు చేపట్టారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లుల్లో రూ.7,059 కోట్లు విడుదల చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు భారీ ఊరట లభించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యోగులకు గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో పెట్టిన బకాయిల చెల్లింపులపై కసరత్తు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు పెండింగ్ బిల్లుల్లో రూ.7,059 కోట్లు విడుదల చేయడానికి ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆర్థికశాఖ దగ్గర నిధుల లభ్యతను బట్టి చెల్లింపులు జరిపేలా మంత్రి పయ్యావుల కసరత్తు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలను నిధుల లభ్యతను బట్టి విడతల వారీగా విడుదల చేస్తోంది. ఉద్యోగులకు సంబంధించి గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్, రిటైర్డ్ ఉద్యోగుల లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, పోలీసులకు అదనపు సరెండర్ లీవుల వంటి వాటికి సంబంధించిన బకాయిలు ఉన్నాయి.

ఆర్టీసీ ఉద్యోగుల ఈపీఎఫ్‌వోపై అభ్యర్థన

మరోవైపు ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన ఈపీఎఫ్‌వో సమస్యలను పరిష్కరించాలని ఎన్‌ఎంయూఏ (నేషనల్‌ మజ్దూర్‌ యూనిటీ అసోసియేషన్‌) లేఖ ద్వారా ఆర్టీసీ ఎండీని కోరింది. ఉద్యోగులు హయ్యర్‌ పింఛను కోసం దరఖాస్తు చేసుకుంటే వారిలో కొందరికి డిమాండ్‌ నోటీసులు రాలేదన్నారు. అర్హులైన ప్రతి ఉద్యోగికి హయ్యర్‌ పింఛను వచ్చేలా చూడాలని కోరింది. కొంతమందికి

ఆన్‌లైన్‌లో వచ్చిన డిమాండ్‌ నోటీసుల గురించి తెలియలేదని.. అందుకే డబ్బులు చెల్లించలేకపోయారన్నారు. అలాంటి ఉద్యోగులకు మరోసారి డబ్బులు కట్టేందుకు అవకాశం ఇవ్వాలని లేఖలో కోరారు. ఉద్యోగి నుంచి 58 ఏళ్ల వరకే పింఛన్ కంట్రిబ్యూషన్ రికవరీ చేయాలని.. కానీ 8 వేల మందికి పైగా ఉద్యోగులకు మొత్తం రూ.32.88 కోట్లు రికవరీ చేసి ఈపీఎఫ్‌వోకి పంపారన్నారు. వీటిని ఉద్యోగులకు తిరిగి చెల్లించాలని ఎన్ఎంయూఏ కోరింది.

ట్రైబ్యునల్ ఏర్పాటుకు ఫోరం రిక్వెస్ట్

ఏపీలో ఉద్యోగుల సర్వీసుకు సంబంధించిన వివాదాల పరిష్కారం కోసం ప్రత్యేకంగా పరిపాలన ట్రైబ్యునల్‌ను తిరిగి పునరుద్ధరించాలని

రిజిస్టర్డ్‌ టీచర్స్‌ ఆర్గనైజేషన్‌ ఫోరం కోరింది. ఈ ట్రైబ్యునల్‌ను 2022లో రద్దు చేశారని, దీంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ట్రైబ్యునల్ ద్వారా సీనియారిటీ, ప్రమోషన్లు, బదిలీలు సహా ఇతర అంశాలను ట్రైబ్యునల్ త్వరగా పరిష్కరించే అవకాశం ఉంటుందని అన్నారు. అందుకే ట్రైబ్యునల్‌ను పునరుద్ధరించాలని ఫోరం కోరింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra Pradesh CM Chandrababu Naidu
  • andhra pradesh government
  • andhrapradesh news
  • Pending Dues
  • Release Pending Dues
  • retired employees

Related News

Veteran leader Satyanarayana met Chandrababu.

చంద్రబాబును కలిసిన పెద్దాయన సత్యనారాయణ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు 96 ఏళ్ల వృద్ధుడి జీవితకాల కోరికను నెరవేర్చి, తన మానవత్వాన్ని చాటుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కామధేనువులంక గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే వృద్ధుడు, తన అభిమాన నేత అయిన చంద్రబాబును కలవాలని చిరకాలంగా ఆశిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి, సోమవారం తన జిల్లా పర్యటనలో భాగంగా ఆయన్ను ప్రత్యేకంగా కలుసుకు

  • CM Chandrababu: Chandrababu Responds to Pawan's Meeting in Telangana

    CM Chandrababu: తెలంగాణలో పవన్ సభపై స్పందించిన చంద్రబాబు

  • Good News for Drinkers: New Liquor Bottles

    AP Liquor: మందుబాబులకు గుడ్ న్యూస్.. కొత్త మద్యం సీసాలు

  • CM Chandrababu inaugurated the Lalitha PVS Institute of Medical Sciences Hospital in Guntur.

    CM Chandrababu: గుంటూరులోని లలితా PVS ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

  • 'Dhee' Fame Pandu Master Involved in Horrific Road Accident

    Dhee Pandu Master: ఢీ ఫేమ్ పండు మాస్టర్‌కు ఘోర రోడ్డు ప్రమాదం

Latest News

  • Private Colleges: ఏపీలో ప్రైవేట్ కాలేజీలకు భారీ ఊరట

  • LPG Cylinder Subsidy: సబ్సిడీతో ఇక ఏడాదికి 4 సిలిండర్లే!

  • Arjun Tendulkar: కొడుకు అర్జున్‌ ప్రదర్శనపై సచిన్‌ ప్రశంసల జల్లు

  • H1B visa: వీసాలపై అమెరికా ఉక్కుపాదం.. హెచ్‌-1బీ వీసా ఫీజు పెంపు

  • తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd