HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >The Victory Of The Capital Region Farmers Renuka Chowdhury

Renuka Chowdhury: ఇది రాజధాని రైతుల విజయం.రేణుకా చౌదరి

  • Author : Vamsi Chowdary Korata Date : 02-04-2026 - 2:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Renuka Chowdhury
Renuka Chowdhury

Renuka Chowdhury ఏపీ రాజధాని బిల్లు అమరావతి రైతుల విజయమని రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి అభివర్ణించారు. గురువారం రాజ్యసభలో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుపై జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. ఉద్యమ సమయంలో రైతులు, మహిళలను తీవ్రంగా హింసించినా, వారు వెనకడుగు వేయకుండా పోరాటం కొనసాగించారని గుర్తు చేశారు.

గత 12 ఏళ్లుగా ఏపీ రాజధానిపై కొనసాగుతున్న అస్పష్టత వల్లే రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయని రేణుకా చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని రాజధాని లేకుండా చేశారని ఆమె విమర్శించారు. కేవలం బిల్లు పెట్టడమే కాదు, నిర్ణీత సమయంలో రాజధానిని పూర్తి చేసి చూపించాలని డిమాండ్ చేశారు.

విభజన హామీల విషయంలో కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలతో ఆటలాడుతోందని ఆమె మండిపడ్డారు. దుగరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్‌ను ముగిసిన అధ్యాయాలుగా మార్చేశారని విమర్శించారు. తెలంగాణకు హామీ ఇచ్చిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఎన్‌టీపీసీలను కూడా కేంద్రం ఇవ్వలేదని తెలిపారు. ఇన్నేళ్లయినా హామీలు ఎందుకు నెరవేర్చలేదో కేంద్రం సమాధానం చెప్పాలని, రెండు రాష్ట్రాలకు పరిహారం ఇవ్వాలని కోరారు.

రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు గడిచినా, లక్షా 47 వేల కోట్ల విలువైన ఆస్తుల పంపకాలు ఇంకా పూర్తి కాలేదని ఆమె గుర్తు చేశారు. భౌగోళికంగా ఏపీలో ఉన్న ఐదు గ్రామాల ప్రజలు తెలంగాణలో ఉండాలని కోరుకుంటున్నా, వారిని ఏపీలో కలపడంతో ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పరిస్థితులు ఎలా ఉన్నా, రెండు తెలుగు రాష్ట్రాలు కలిసే ముందుకు సాగాల్సిన అవసరం ఉందని రేణుకా చౌదరి తన ప్రసంగాన్ని ముగించారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Amaravathi Capital
  • amaravathi farmers
  • ap capital amaravati
  • Congress MP Renuka Chowdhury
  • renuka chowdhury

Related News

Amaravati Farmers

Amaravati: రైతులకు గుడ్ న్యూస్.. రూ. 1.50 లక్షల రుణ మాఫీ – చంద్రబాబు

అమరావతిలోని తాడికొండ, పెదకూరపాడు నియోజకవర్గాలకు చెందిన గ్రామాల రైతులతో రాజధాని కోసం రెండో విడత భూ సమీకరణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించారు. ఎకరానికి రూ. 40 వేల చొప్పున పదేళ్లపాటు కౌలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఏడాదికి రూ. 3 వేలు చొప్పున కౌలు పెంచుతామని, ఒక్కో రైతు కుటుంబానికి రూ. 1.50 లక్షల మేర వ్యవసాయ రుణ మాఫీ చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధ

    Latest News

    • ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?

    • ‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

    • మీ టూత్ బ్రష్ ఎక్స్‌పైరీ డేట్ తెలుసుకోండిలా?

    • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

    • టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో భారీ మార్పులు!

    Trending News

      • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

      • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

      • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

      • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

      • దిల్షాన్ మదుశంక.. రిప్లేస్‌మెంట్‌గా వచ్చి రికార్డుల్లోకి!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd