HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Right Way Of Washing Hair

తలస్నానం చేసే సరైన పద్ధతి ఇదే అని మీకు తెలుసా?!

అతి వేడి నీటితో తలస్నానం చేయడం వల్ల జుట్టులోని తేమ ఆవిరైపోయి పొడిబారుతుంది. ఇది హెయిర్ క్యూటికల్స్‌ను దెబ్బతీస్తుంది.

  • Author : Gopi Date : 31-03-2026 - 10:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Washing Hair
Washing Hair

Washing Hair: జుట్టును సరైన పద్ధతిలో సంరక్షించుకోకపోతే అనేక సమస్యలు తలెత్తుతాయి. చాలామంది మంచి నూనెలు, ఖరీదైన షాంపూలు, సీరమ్స్, హెయిర్ మాస్క్‌లు వాడుతుంటారు. కానీ ఒక చిన్న పొరపాటు వల్ల ఈ ప్రయత్నాలన్నీ వృథా అవుతాయి. అదే జుట్టును సరిగ్గా కడగకపోవడం.

జుట్టు సంరక్షణలో మొదటి అడుగు తలస్నానం. అది సరైన పద్ధతిలో లేకపోతే మీరు ఎన్ని ప్రొడక్ట్స్ వాడినా ఫలితం ఉండదు. మరి జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తలస్నానం ఎలా చేయాలో ఈ ఆర్టిక‌ల్‌లో చూద్దాం..!

తలస్నానం చేసే సరైన పద్ధతి

స్నానానికి ముందు నూనె రాయండి

తలస్నానానికి ముందు జుట్టుకు నూనె రాస్తే స్కాల్ప్‌కు అవసరమైన తేమ అందుతుంది. దీనివల్ల షాంపూ చేసినప్పుడు జుట్టు పొడిబారదు. పొడిదనం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.

చిక్కులు తీసుకున్న తర్వాతే కడగాలి

చాలామంది జుట్టు చిక్కులుగా ఉన్నప్పుడే నీళ్లు పోసుకుంటారు. దీనివల్ల షాంపూ పెట్టేటప్పుడు జుట్టు మరింతగా ముడిపడి, వేళ్లతో రుద్దినప్పుడు విపరీతంగా రాలిపోతుంది. అందుకే స్నానానికి ముందే వెడల్పాటి పళ్లున్న దువ్వెనతో చిక్కులు తీసుకోవాలి.

Also Read: గ్యాస్‌తో పని లేకుండా ఫుడ్ త‌యారుచేసుకోండిలా!

షాంపూ పరిమాణం ముఖ్యం

అతి తక్కువ షాంపూ వాడితే జుట్టు శుభ్రపడదు, అలాగని అతిగా వాడితే జుట్టులోని సహజ నూనెలు పోయి నిర్జీవంగా మారుతుంది. అందుకే ఒక కాయిన్ (నాణెం) పరిమాణమంత షాంపూ తీసుకుని వాడటం ఉత్తమం.

స్కాల్ప్‌ను గట్టిగా రుద్దకండి

షాంపూ పెట్టాక వేళ్లతో స్కాల్ప్‌ను చాలా వేగంగా లేదా గోళ్లతో రుద్దడం వల్ల జుట్టు కుదుళ్లు బలహీనపడతాయి. ఒకేసారి గట్టిగా రుద్దే కంటే తక్కువ షాంపూతో రెండుసార్లు మెల్లగా మసాజ్ చేస్తూ కడగడం మంచిది.

కండిషనర్ వాడే విధానం

కండిషనర్‌ను ఎప్పుడూ జుట్టు కుదుళ్లకు పట్టించకూడదు. కుదుళ్లకు రాస్తే జుట్టు రాలే ప్రమాదం ఉంది. కేవలం జుట్టు చివర్ల నుండి మధ్య భాగం వరకు మాత్రమే కండిషనర్ రాసి, 4 నుండి 5 నిమిషాల తర్వాత కడిగేయాలి. దీనివల్ల జుట్టు మృదువుగా మారుతుంది.

నీటి ఉష్ణోగ్రత

అతి వేడి నీటితో తలస్నానం చేయడం వల్ల జుట్టులోని తేమ ఆవిరైపోయి పొడిబారుతుంది. ఇది హెయిర్ క్యూటికల్స్‌ను దెబ్బతీస్తుంది. కాబట్టి ఎప్పుడూ గోరువెచ్చని నీరు లేదా చల్లని నీటితో జుట్టును కడగడం శ్రేయస్కరం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bathing Tips
  • hair care
  • hair loss
  • Hair Wash
  • lifestyle
  • washing hair

Related News

    Latest News

    • Cm Vijay: స్టాలిన్‌ ఇంటికి CM విజయ్‌!

    • Keerthana: సర్టిఫికెట్ మర్చిపోయిన మంత్రి కీర్తన.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం వాయిదా..

    • Chandrababu Naidu: కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో కీలక భేటీ : చంద్రబాబు

    • CM Vijay: సీఎంగా విజయ్ నెల జీతం ఎంతో తెలుసా?

    • POCSO Case: బండి భ‌గీర‌థ్‌ కేసుపై సీఎం రేవంత్ సీరియస్

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd