HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Godavari Pushkarams To Be Modeled After Kumbh Mela Deputy Cm Pawan Kalyan

Godavari Pushkaralu: కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

  • Author : Vamsi Chowdary Korata Date : 15-04-2026 - 9:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Godavari Pushkaralu 2027 to Be Held on Kumbh Mela Scale as Pawan Kalyan
Godavari Pushkaralu 2027 to Be Held on Kumbh Mela Scale as Pawan Kalyan

2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించినట్లు ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వివిధ అంశాలపై చర్చించారని, ప్రధానంగా నిడదవోలు నియోజకవర్గంలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల ద్వారా జరుగుతున్న అభివృద్ధి వివరాలపై సమీక్షించారన్నారు. అదే విధంగా గోదావరి పుష్కరాల నిర్వహణపై దిశానిర్దేశం చేసినట్లు మంత్రి దుర్గేశ్ వెల్లడించారు.

2027 జూన్ 26 నుండి జులై 7 వరకు జరిగే గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో వైభవంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించినట్లు మంత్రి దుర్గేశ్ చెప్పారు. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మహా ఉత్సవానికి సుమారు 10 కోట్ల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేశామని, భక్తుల సౌకర్యాలకు, భద్రతకు పెద్దపీట వేయాలని భావించినట్లు వెల్లడించారు. రాజమహేంద్రవరంతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ఘాట్ల ఆధునీకరణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని మంత్రి దుర్గేశ్ పేర్కొన్నారు. భక్తుల కోసం ప్రత్యేక వసతులు, మంచినీరు, పారిశుద్ధ్యం మరియు విశ్రాంతి గదుల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు. కోట్లాదిగా తరలివచ్చే భక్తుల భద్రతకు పెద్దపీట వేయాలని, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా సమగ్ర కార్యాచరణను సిద్ధం చేయాలని పవన్ కల్యాణ్ ఆదేశించారని వివరించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భక్తుల రద్దీని క్రమబద్ధీకరించనున్నట్లు మంత్రి దుర్గేశ్ వెల్లడించారు.

పుష్కర ఏర్పాట్లపై త్వరలోనే రాజమహేంద్రవరంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. ఈ భేటీలో క్షేత్రస్థాయి సమస్యలు, తీసుకోవాల్సిన చర్యలపై పలు నిర్ణయాలు తీసుకోనున్నామన్నారు. రాష్ట్ర గౌరవం ఇనుమడించేలా, ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ల నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ గోదావరి పుష్కరాలను నిర్వహించబోతోందని మంత్రి దుర్గేశ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2027 Godavari Pushkaralu
  • andhra pradesh
  • AP Deputy CM Pawan kalyan
  • AP government
  • ap tourism
  • Godavari Pushkaralu
  • Kandula Durgesh
  • Minister Kandula Durgesh
  • Rajahmundry Godavari Pushkaralu
  • Rajamahendravaram
  • TDP Government

Related News

Complaint filed against actor Prakash Raj at the police station.

Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్ పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్‌పై ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, ఇతర బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిందూ సమాజాన్ని కించపరిచేలా, కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తూ కదిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు దాఖలు చేసినట్లు బీజేపీ నేతలు తెలిపారు. ఈ మేరకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. విష్ణువర్ధన

  • AP government takes another key decision

    CM Chandrababu Naidu: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

  • Tender coconut claims a life

    ప్రాణం తీసిన కొబ్బరి బొండం

  • Prakash Raj lashes out over repeated arrests of 'Ravan'.

    Prakash Raj: రావణ్ మళ్ళీ మళ్ళీ అరెస్ట్ పై ప్రకాష్ రాజ్ ఫైర్

  • Capital war reignites in AP... Amaravati versus Mavigan...

    Capital War: ఏపీలో మళ్లీ క్యాపిటల్ వార్.. అమరావతి వర్సెస్ మావిగన్..

Latest News

  • Diabetes: షుగర్ పేషెంట్స్ కు గుడ్ న్యూస్.. వారానికి ఒకేఒక్క డోస్‌తో డయాబెటిస్ కు చెక్

  • US – Iran War: ట్రంప్ హెచ్చరించిన తర్వాత, చాబహార్ ఓడరేవుపై దాడి

  • Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

  • Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

  • Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd