HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Foundation Stone Laid For Basavataram Hospital In Amaravati Tomorrow

Basavatarakam : రేపే అమరావతిలో బసవతారకం ఆసుపత్రికి శంకుస్థాపన

తుళ్లూరు - అనంతవరం గ్రామాల మధ్య ఏర్పాటు చేయనున్న ఈ సెంటర్‌కు రేపు ఉదయం 9.30 గంటలకు శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు మరియు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు హాజరవుతున్నారు.

  • Author : Latha Suma Date : 12-08-2025 - 4:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Foundation stone laid for Basavataram Hospital in Amaravati tomorrow
Foundation stone laid for Basavataram Hospital in Amaravati tomorrow

Basavatarakam : అమరావతిలో ఆరోగ్య రంగానికి కొత్త దిక్సూచి అవతరించనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నూతన శకానికి నాంది పలుకుతూ, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి తన విస్తరణలో భాగంగా అమరావతిలో కొత్త కేంద్రాన్ని స్థాపించబోతుంది. తుళ్లూరు – అనంతవరం గ్రామాల మధ్య ఏర్పాటు చేయనున్న ఈ సెంటర్‌కు రేపు ఉదయం 9.30 గంటలకు శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు మరియు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు హాజరవుతున్నారు. ఈ శంకుస్థాపనతో ఈ ప్రాజెక్టు అధికారికంగా ప్రారంభంకానుంది. ఆసుపత్రి స్థలంగా 21 ఎకరాల భూమిని అమరావతి ప్రాంత అభివృద్ధి సంస్థ (CRDA) కేటాయించిన విషయం తెలిసిందే.

ప్రారంభ దశలో ఈ ఆసుపత్రిని 300 పడకల సామర్థ్యంతో నిర్మించనున్నారు. భవిష్యత్తులో దీన్ని 1000 పడకల వరకు విస్తరించాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అధునాతన యంత్రాలు, నిపుణులైన వైద్య బృందం, మెరుగైన సదుపాయాలతో దేశంలోనే అత్యుత్తమ క్యాన్సర్ చికిత్స కేంద్రాల్లో ఇది ఒకటిగా మారనుంది. వాస్తవానికి అమరావతిలో క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి ప్రణాళికలు అప్పుడే 2014 నుంచి 2019 మధ్య కాలంలోనే రూపుదిద్దుకున్నాయి. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఆసుపత్రికి భూమిని కేటాయించి, ముందడుగు వేసింది. కానీ 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించిన ప్రగతికి బ్రేక్ పడింది.

అయితే తాజా పరిణామాలతో మరోసారి ఆసుపత్రికి స్థలం కేటాయించడంతో, ఈసారి నిర్దేశిత కాల వ్యవధిలో నిర్మాణాన్ని పూర్తి చేయాలనే కృతనిశ్చయంతో బసవతారకం ట్రస్ట్ ముందుకు వెళ్తోంది. రోగులకు త్వరితగతిన, అధునాతన సాంకేతికతతో సేవలందించాలన్న లక్ష్యంతో ఈ ఆసుపత్రిని అభివృద్ధి చేయనున్నారు. ఈ ఆసుపత్రి నిర్మాణంతో అమరావతిలో వైద్య సేవలు మరింతగా మెరుగవుతాయి. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాకుండా, పొరుగున ఉన్న రాష్ట్రాల రోగులకూ ఇది అత్యవసర సమయంలో కీలక కేంద్రంగా నిలవనుంది. క్యాన్సర్ చికిత్సలో నిపుణులైన బసవతారకం సంస్థ ద్వారా మరోసారి ఆరోగ్యరంగంలో ఓ గొప్ప ఆవిష్కరణకు శ్రీకారం చుట్టనుంది.

Read Also: Union Cabinet : ఏపీకి మరో గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amaravati
  • Ananthavaram
  • andhra pradesh
  • Basavatarakam Cancer Hospital
  • Basavatarakam Hospital
  • CRDA
  • tdp
  • Tulluru

Related News

Bill Gates to visit Amaravati Today

చంద్రబాబుతో బిల్ గేట్స్ భేటీ

Bill Gates  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్ గేట్స్ భేటీ అయ్యారు. ఈరోజు ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న బిల్ గేట్స్..అక్కడి నుంచి నేరుగా అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయం వద్ద సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ సహా పలువురు మంత్రులు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత వీరితో బిల్ గేట్స్ బృందం

  • TDP candidate Bodepudi Revathi wins in Madhira

    మధిర మున్సిపాలిటీలో టిడిపి పార్టీ అభ్యర్థి భారీ గెలుపు

  • Pawan Kalyan Nandamuri Bala

    ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్‌తో ఎమ్మెల్యే బాలకృష్ణ భేటీ

Latest News

  • హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్..ఇందిరమ్మ ఇళ్ల సెకండ్ లిస్ట్ కు ప్రభుత్వం సిద్ధం

  • తెలంగాణలో మరో కొత్త ఎయిర్‌పోర్టు.. మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిని విడుదల చేసిన ఎంపీ నగేష్

  • ఏఐ సమ్మిట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు..చిన్ననాటి విశాఖపట్నం ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న సుందర్ పిచాయ్

  • The Kerala Story 2: మరో చీకటి కోణం..ది కేరళ స్టోరీ2 ట్రైలర్‌ ఇంత ఘోరమా

  • వనస్థలిపురం గర్భిణి హత్య కేసు..వెలుగులోకి షాకింగ్ నిజాలు !!

Trending News

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd