Rosaiah : వైసీపీకి మాజీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య రాజీనామా
వైసీపీలో కష్టపడిన వారికి గుర్తింపు ఉండడంలేదని, పార్టీ కొందరు వ్యక్తుల చేతుల్లోనే నడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
- By Latha Suma Published Date - 06:35 PM, Wed - 24 July 24

Kilari Roshaiah: వైసీపీ(YCP)కి పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య రాజీనామా(resignation) చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనలో తెలిజేశారు. ఈరోజు ఆయన గుంటూరులో తన మద్దతుదారులతో మీడియా సమావేశం నిర్వహించారు. వైసీపీలో కష్టపడిన వారికి గుర్తింపు ఉండడంలేదని, పార్టీ కొందరు వ్యక్తుల చేతుల్లోనే నడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత కూడా వారి ఇష్ట ప్రకారమే పార్టీ నడుస్తోందని ఆరోపించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఎన్నికల్లో తనను గుంటూరు(Guntur) ఎంపీ అభ్యర్థిగా నిలబెట్లారని, కొందరు తనను మానసికంగా కుంగదీశారని రోశయ్య అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను వైసీపీలో కొనసాగలేనని తెలిపారు. సీనియర్ నేత ఉమ్మారెడ్డికి సైతం పార్టీలో అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారికే పదవులు కట్టబెడుతున్నారని ఆయన మండిపడ్డారు.
కాగా, ఉమ్మారెడ్డి వేంకటేశ్వర్లుకి శాసన మండలి ఛైర్మన్ అన్నారని కానీ.. కనీసం ప్రతిపక్ష నేతగా కూడా ఆయనకు అవకాశం ఇవ్వలేదని దుయ్యబట్టారు. ఉమ్మారెడ్డి అనుభవాన్ని పార్టీ వినియోగించుకోలేదన్నారు. విపక్షనేతగా అప్పిరెడ్డి ఎంపిక విషయంలోనూ కనీసం ఎవరితోనూ చర్చించలేదు. 2019లో ఏసురత్నం ఓటమికి కారణం ఎవరో అందరికి తెలుసని చెప్పుకొచ్చారు. వైసీపీలో తాను ఇక కొనసాగలేనని అందుకే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు కిలారి రోశయ్య ప్రకటించారు.