Minister : రేపటి నుండి వరద నష్టాన్ని అంచనా వేసే ప్రక్రియ: అనిత
Minister Wangalapudi Anitha: రేపటి నుంచి భారీ వర్షాలు, వరద నష్టాన్ని అంచనా వేసే ప్రక్రియ ప్రారంభమవుతుందని.. వరద బాధితులకు 8 రోజులుగా ముమ్మరంగా సహాయక చర్యలు అందిస్తున్నామని తెలిపారు.
- Author : Latha Suma
Date : 08-09-2024 - 4:08 IST
Published By : Hashtagu Telugu Desk
Flood Damage Assessment Process: రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదివారం విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడారు. “పగలు, రాత్రి తేడా లేకుండా ప్రజల రక్షణ కోసం సీఎం చంద్రబాబు(CM Chandrababu) పనిచేస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తూ దిశా నిర్దేశం చేస్తున్నారు. రేపటి నుంచి భారీ వర్షాలు, వరద నష్టాన్ని అంచనా వేసే ప్రక్రియ ప్రారంభమవుతుందని.. వరద బాధితులకు 8 రోజులుగా ముమ్మరంగా సహాయక చర్యలు అందిస్తున్నామని తెలిపారు.
ప్రకాశం బ్యారేజీ బోట్ల ఘటనపై విచారణ..
పగలు, రాత్రి తేడా లేకుండా ప్రజల రక్షణ కోసం సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తూ దిశా నిర్దేశం చేస్తున్నారు. ధరల నియంత్రణపై దృష్టి పెట్టి రాయితీపై కూరగాయల విక్రయాలు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విజయవాడలో ప్రస్తుత పరిస్థితులు. వరద బాధితులకు పులిహార ప్యాకెట్లు కూడా పంచని గత ప్రభుత్వ నాయకుడు పులిహోర కబుర్లు చెప్తున్నారు. పాస్ పోర్ట్ వచ్చి ఉంటే గత ప్రభుత్వ నాయకుడు ఈపాటికి లండన్ వెళ్లిపోయేవారు. ప్రకాశం బ్యారేజీ బోట్ల ఘటనపై విచారణ జరుగుతోంది. గణేష్ మండపాలకు సంబంధించి ఎలాంటి డబ్బులు వసూలు చేయడం లేదు. అని మంత్రి తెలిపారు.
8 రోజులుగా కలెక్టరేట్లోనే సీఎం చంద్రబాబు..
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను ప్రపంచవ్యాప్తంగా అందరూ చూస్తున్నారు. అందరికీ సహాయం అందాలని సీఎం చంద్రబాబు 8 రోజులుగా కలెక్టరేట్లోనే ఉండి సమీక్షిస్తున్నారు. ఎలాంటి సమస్యలు రాకుండా అన్ని శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి దిశానిర్దేశం చేస్తున్నారు. ఏ ముఖ్యమంత్రి కూడా వరద ప్రాంతాల్లో ఇంతలా పర్యటించలేదు. సీఎం ఆదేశాలతో అందరికీ మూడు పూటలా ఆహారం అందించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాం. ఈరోజు 3 లక్షలకు పైగా ఫుడ్ ప్యాకెట్లు, పాలు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ జరుగుతోంది. ధరలు నియంత్రణపై కూడా దృష్టి సారించి సీఎం ఆదేశాలతో రాయితీపై కూరగాయల విక్రయం జరుగుతోంది. 163 స్టోర్స్ లో 5 లక్షల కేజీలకు పైగా కూరగాయల విక్రయాలు జరిగాయి. తాగునీటి సరఫరా కోసం 236 ట్యాంకర్లు పనిచేస్తున్నాయి.. వాటర్ ట్యాంకర్లు ఈరోజు ఈ సమయానికి 177 ట్రిప్పులు వేశాయి. నిన్న వాటర్ ట్యాంకర్లు 2090 ట్రిప్పులు వేశాయి. అని మంత్రి వివరించారు.