విరాట్ కోహ్లీ అభిమానులకు గుడ్ న్యూస్.. కింగ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!
అయితే కోహ్లీ మళ్ళీ మైదానంలోకి ఎప్పుడు వస్తారనే ప్రశ్న అందరిలోనూ ఉంది. వచ్చే కొన్ని నెలల వరకు భారత్‌కు ఎటువంటి వన్డే మ్యాచ్‌లు షెడ్యూల్ చేయబడలేదు.
- Author : Gopichand
Date : 30-01-2026 - 3:25 IST
Published By : Hashtagu Telugu Desk
Virat Kohli: కొన్ని గంటల క్రితం విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కోహ్లీ ఐడి (ID) మాయమవ్వడంపై అటు విరాట్ నుండి కానీ, ఇటు ఆయన మేనేజ్మెంట్ నుండి కానీ ఎటువంటి అధికారిక వివరణ రాలేదు. అయితే ఇప్పుడు భారత స్టార్ బ్యాటర్ అకౌంట్ మళ్ళీ యాక్టివ్ అయ్యింది. ఇది అభిమానులకు పెద్ద ఊరటనిచ్చే వార్త. ఇప్పుడు కోహ్లీ పాత పోస్ట్లన్నీ అభిమానులకు మళ్ళీ కనిపిస్తున్నాయి.
ఇన్‌స్టాగ్రామ్‌లోకి కోహ్లీ రీ-ఎంట్రీ
అకౌంట్ డిలీట్ లేదా డిసేబుల్ అయిన సమయంలో అభిమానులు నిరంతరం సెర్చ్ చేస్తూనే ఉన్నారు. సెర్చ్ రిజల్ట్స్‌లో కోహ్లీ పేరు కనిపించలేదు. అలాగే పాత లింక్‌ల ద్వారా కూడా ఆయన ప్రొఫైల్‌కు వెళ్లడం సాధ్యపడలేదు. అయితే ఇప్పుడు కోహ్లీ ఖాతా మళ్ళీ సోషల్ మీడియాలోకి వచ్చేసింది. ఇప్పుడు ఎవరైనా సులభంగా ఆయన అకౌంట్‌ను సెర్చ్ చేయవచ్చు.
ప్రస్తుతం కోహ్లీ పోస్ట్లన్నీ యథావిధిగా కనిపిస్తున్నాయి. అయితే తన అకౌంట్ ఎందుకు క్లోజ్ అయ్యింది అనే విషయంపై కోహ్లీ ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు విరాట్ సోదరుడు వికాస్ కోహ్లీ అకౌంట్ కూడా మాయమైంది. కానీ అది ఇంకా తిరిగి వచ్చినట్లు సమాచారం లేదు.
Also Read: ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్
మైదానంలోకి విరాట్ కోహ్లీ ఎప్పుడు తిరిగి వస్తారు?
న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన చేశారు. కివీస్ జట్టుపై జరిగిన 3 వన్డేల్లో కోహ్లీ ఏకంగా 240 పరుగులు సాధించారు. ఈ క్రమంలో ఆయన స్ట్రైక్ రేట్ 105.26 కాగా, సగటు 80గా ఉంది. ఇండోర్ వన్డేలో కోహ్లీ అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నారు.
అయితే కోహ్లీ మళ్ళీ మైదానంలోకి ఎప్పుడు వస్తారనే ప్రశ్న అందరిలోనూ ఉంది. వచ్చే కొన్ని నెలల వరకు భారత్‌కు ఎటువంటి వన్డే మ్యాచ్‌లు షెడ్యూల్ చేయబడలేదు. టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత భారత ఆటగాళ్లంతా ఐపీఎల్ (IPL)లో బిజీ కానున్నారు. విరాట్ కోహ్లీ కూడా ఐపీఎల్ ద్వారానే మళ్ళీ మైదానంలోకి అడుగుపెట్టనున్నారు. వరుసగా రెండోసారి ఆర్సీబీ (RCB)ని ఛాంపియన్‌గా నిలపాలనే లక్ష్యంతో ఆయన బరిలోకి దిగనున్నారు.