Ex- Minister Roja: రేపు ఎన్నికలు.. ఏపీ ఎన్నికల అధికారికి రోజా విన్నపం!
ఎన్నికల విషయంలో నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించని జిల్లా కలెక్టర్, కమీషనర్ పై చర్యలు తీసుకొని వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని రోజా కోరారు.
- By Gopichand Published Date - 06:50 PM, Sun - 2 February 25

Ex- Minister Roja: తిరుపతి నగర పాలక సంస్థ ఉప మేయర్ ఎన్నికలు రేపు జరగనున్న నేపథ్యంలో మాజీ మంత్రి, వైసీపీ అధికార ప్రతినిధి రోజా (Ex- Minister Roja).. ఎన్నికల అధికారి నీలమ్ సాహ్నికి ఎక్స్ వేదికగా లేఖ రాశారు. వైసీపీ అభ్యర్థి శేఖర్ రెడ్డిని ప్రజాస్వామ్యబద్ధంగా తమ బాధ్యతలు నిర్వహించేందుకు అవకాశం లేకుండా అధికార పార్టీ నేతల ఒత్తిడి మేరకు మున్సిపల్ సిబ్బంది భయభ్రాంతులకు గురి చేసేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పై స్థాయి అధికారుల ప్రమేయం లేకుండా క్రింది స్థాయి సిబ్బంది అలా వ్యవహరించలేరన్నారు. ఈ పరిణామం ప్రజ్వామ్యానికి గొడ్డలి పెట్టు. ఒక పార్టీ కున్న హక్కును కోల్పోవడమే అవుతుందని రాసుకొచ్చారు.
నిన్న మా అభ్యర్థి శేఖర్ రెడ్డి భాగస్వామిగా ఉన్న నిర్మాణం అనుమతుల విషయంలో లోపాలు చూపుతూ ఎలాంటి ముందస్తు నోటిసులు కూడా ఇవ్వకుండా కూల్చి వేయడానికి పూనుకున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలకు సైతం ఇది ఉల్లంఘన. మరో ఆందోళన కలిగించే అంశం అదే సమయంలో ఆందోళన జరుగుతున్న ప్రాంతానికి నగర మేయర్ డా.శిరీష చేరుకుని ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ముందస్తు నోటిసులు, సుప్రీమ్ కోర్టు ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు.అయినా మేయర్ సూచనలను క్రింది అధికారులు లెక్క చేయకుండా వ్యవహరించారు. అంటే ప్రజలు ఎన్నుకున్న మేయర్ ను అవమానించడం కాదా. ఇంత జరుగుతున్నా ఎన్నికల నిర్వహణ ప్రధాన అధికారి జిల్లా కలెక్టర్ గానీ, మున్సిపల్ కమిషనర్ గాని మేయర్ ను అవమానించిన సిబ్బంది పై చర్యలు తీసుకోలేదు. ఇలాంటి అధికారులు పర్యవేక్షణలో ఉప మేయర్ ఎన్నిక సజావు గా జరగదు. తమరు జోక్యం చేసుకోవాలని కోరుతున్నాను అని పేర్కొన్నారు.
Also Read: Deputy CM Bhatti: దేవాలయ అభివృద్ధి పనులను పరిశీలించిన డిప్యూటీ సీఎం భట్టి
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి నీలమ్ సాహ్ని @CEOAndhra గారికి…
విషయం: తిరుపతి ఉపమేయర్ ఎన్నికలు ప్రజాస్వామ్య బద్ధంగా, ప్రశాంత వాతావరణంలో జరగడానికి తమరి జోక్యం నిమిత్తం.
మేడం.. తిరుపతి నగర పాలక సంస్థ ఉప మేయర్ ఎన్నికలు ఈ నెల 3 న జరగుతున్న విషయం తమరికి తెలుసు. మా @YSRCParty…
— Roja Selvamani (@RojaSelvamaniRK) February 2, 2025
ఎన్నికల విషయంలో నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించని జిల్లా కలెక్టర్, కమీషనర్ పై చర్యలు తీసుకొని వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని రోజా కోరారు. మేయర్ సూచనలు పాటించక పోగా క్రింది స్థాయి సిబ్బంది అవమానించడం అమానవీయంగా.. పై పెచ్చు పోలీసులు అరెస్టు కుడా చేసారు. మేయర్ డా.శిరీషను అవమానించిన సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. మీ జోక్యం తిరుపతి ఉప మేయర్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం కాపాడుతుందని నీలమ్ సాహ్నిని కోరారు. మా వినతిని సానుకూలంగా పరిశీలించి తగిన సత్వర చర్యలు తీసుకోవాలని మనవి చేస్తున్నాను అని రోజా లేఖ రాసుకొచ్చారు.