HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ed Attaches Assets Worth Rs 441 Crore In Ycp Liquor Scam

వైసీపీ మద్యం కుంభకోణంలో.. 441 కోట్ల ఆస్తులు ED అటాచ్

  • Author : Vamsi Chowdary Korata Date : 07-03-2026 - 3:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
ED Attaches Rs 441 Crore Assets in Andhra Pradesh Liquor Scam Case
ED Attaches Rs 441 Crore Assets in Andhra Pradesh Liquor Scam Case

ED Attaches Rs 441 Crore Assets in Andhra Pradesh Liquor Scam Case  వైసీపీ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణంలో సుమారు 4 వేల కోట్ల రూపాయ‌ల‌కు పైగా అక్ర‌మాలు జ‌రిగిన‌ట్టు ఈ కేసును విచారిస్తున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం అధికారులు అంచ‌నావేశారు. ఈ క్ర‌మంలో ప‌లువురిని అరెస్టు చేసి విచారించారు. ఇంకా, విచారించాల్సిన వారి జాబితా కూడా పెద్ద‌దిగానే ఉంది. మ‌రోవైపు నాటి అక్ర‌మాల్లో ప్ర‌ముఖ పాత్ర ఉన్న వారి ఆస్తుల‌ను కోర్టు ఆదేశాల మేర‌కు అటాచ్ చేస్తున్నారు. తాజాగా 441 కోట్ల రూపాయ‌ల ఆస్తుల‌ను ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్ట‌రేట్‌(ఈడీ) అధికారులు అటాచ్ చేశారు.

ఈ 441 కోట్ల రూపాయ‌లు.. మొత్తంగా ముగ్గురు ప్ర‌ధాన నిందితుల‌కు చెంద‌న ఆస్తుల‌ని ఈడీ అధికారులు తెలిపారు. ఏ-1గా ఉన్న క‌సిరెడ్డి రాజ‌శేఖ‌రరెడ్డి(గ‌తంలోనే ఈయ‌న ఆస్తుల‌ను కొంత మేర‌కు అటాచ్ చేశారు), బూనేటి చాణ‌క్య‌, ఐఆర్ఎస్ అధికారి దొంతిరెడ్డి వాసుదేవ‌రెడ్డికి చెందిన 441 కోట్ల రూపాయ‌ల ఆస్తుల‌ను తాజాగా అటాచ్ చేసిన‌ట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ ఆస్తులు అక్ర‌మంగా వారికి చేకూరిన‌ట్టు త‌మ‌కు ఆధారాలు ఉన్నాయ‌ని పేర్కొన‌డం గ‌మ‌నార్హం. దీనిపై కోర్టును ఆశ్ర‌యించి.. కోర్టు ఆదేశాల మేర‌కు అటాచ్ చేసిన‌ట్టు వివ‌రించారు.

వైసీపీ హ‌యాంలో అప్ప‌టి వ‌ర‌కు ఉన్న మ‌ద్యం విధానాన్ని స‌మూలంగా మార్చేశారు. ప్రైవేటు వ్యాపారుల లైసెన్సులు ముగియ‌డంతో ప్ర‌భుత్వ‌మే ఈ వ్యాపారంలోకి అడుగు పెట్టింది. ఈ క్ర‌మంలోనే ప్ర‌ముఖ బ్రాండ్ల కంపెనీల‌ను ప‌క్క‌న పెట్టి.. నాసిర‌కం బ్రాండ్ల‌ను ప్రోత్స‌హించారు. కల్తీ మద్యం వల్ల 30,000 మంది మరణించారు. 5 లక్షల మంది ఇప్పటికీ కాలేయం / మూత్రపిండాల నష్టం మొదలైన సమస్యలతో బాధపడుతున్నారు.

దీనిలో వైసీపీకి చెందిన వారే ఎక్కువ‌గా ఉన్నారు. ప్రతి కేసుపై 15 నుంచి 20 శాతం వరకు కిక్‌ బ్యాక్‌ తీసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. వీరి నుంచి మ‌ద్యం కొనుగోలు చేసేందుకు క‌మీష‌న్లు ఇవ్వాల‌ని ష‌ర‌తులు విధించారు. దీనిని ప‌క్కాగా అమ‌లు చేశారు. 12 బాటిళ్లు ఉండే కేసుకు 18-20 శాతం మేర‌కు క‌మీష‌న్లు వ‌సూలు చేశారు.

ఈ సొమ్మును 2024 ఎన్నిక‌ల్లో వినియోగించార‌న్న‌ది సిట్ అధికారులు చెబుతున్న మాట‌. అదేస‌మ‌యంలో కొంత సొమ్ము.. కీల‌క నేత‌కు చేరింద‌ని కూడా అంటున్నారు. అయితే.. ఆ కీల‌క నేత ఎవ‌రు? అనేది విచార‌ణ‌కు కీల‌కంగా మారింది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh liquor
  • Andhrapradesh
  • AP Liquor Scam Big Update
  • AP Liquor Scam Latest news
  • Enforcement Directorate (ED)
  • ys jagan
  • YSR Congress Party

Related News

More Good News for DWCRA Women: Loans Up to ₹10 Lakhs

Dwcra Womens: డ్వాక్రా మహిళలకు మరో శుభవార్త.. రూ.10 లక్షల వరకు రుణం

రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీపికబురు చెప్పారు. డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల వ్యక్తిగత రుణం అందిస్తామని అన్నారు. ఎలాంటి పూచీకత్తు లేకుండా ఈ రుణాన్ని ఇస్తారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. డ్వాక్రా మహిళలు ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు ఈ రుణాన్ని మంజూరు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

  • Chandrababu Naidu

    Chandrababu Naidu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

  • Atchannaidu fires on ys Jagan

    Atchannaidu: జగన్ పై అచ్చెన్నాయుడు ఫైర్

  • Bhaskar Award Could Be Given to YS Jagan: Nara Lokesh

    Nara Lokesh: వైఎస్ జగన్‌కు భాస్కర్ అవార్డు ఇవ్వొచ్చు : నారా లోకేష్

  • Jagan has lost his mind Balineni Srinivasa Reddy

    Balineni Srinivasa Reddy: జగన్ కి మైండ్ దొబ్బింది : బాలినేని

Latest News

  • BYST : ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!

  • Telangana : రాష్ట్ర రెవెన్యూ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ

  • BRS : కేటీఆర్, హరీష్ రావు తమ కార్యకర్తలకు బోధిస్తున్న సిద్ధాంతం ఇదేనా?.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ

  • Kerala : కేర‌ళ మాజీ సీఎం పిన‌ర‌య్ విజయన్ నివాసం వద్ద ఉద్రిక్తత.. ఈడీ బృందం వాహనాలపై దాడి

  • TDP : టీడీపీ మహానాడులో తెలంగాణపై చర్చ.. ఎన్టీఆర్, చంద్రబాబు సేవలను గుర్తుచేసిన నేతలు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

    • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd