HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Bhaskar Award Could Be Given To Ys Jagan Nara Lokesh

Nara Lokesh: వైఎస్ జగన్‌కు భాస్కర్ అవార్డు ఇవ్వొచ్చు : నారా లోకేష్

  • Author : Vamsi Chowdary Korata Date : 22-05-2026 - 11:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bhaskar Award Could Be Given to YS Jagan: Nara Lokesh
Bhaskar Award Could Be Given to YS Jagan: Nara Lokesh

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘గొడ్డలి పార్టీ’, ‘హత్యా రాజకీయాలు’ అనే అంశాలపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం పీక్స్‌కు చేరింది. నిన్న వైసీపీ అధినేత జగన్ ప్రెస్‌మీట్ పెట్టి చంద్రబాబుపై చేసిన ఆరోపణలకు… ఈరోజు కడపలో జరిగిన టీడీపీ కార్యకర్తల సమన్వయ సమావేశంలో మంత్రి నారా లోకేశ్ అత్యంత ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.

వైసీపీకి తాను కొత్తగా ‘గొడ్డలి పార్టీ’ అని పేరు పెడితే జగన్ బాగా ఫీల్ అయ్యారని… కానీ గతంలో థియేటర్లలో ‘రప్పారప్పా’ అంటూ గన్ కల్చర్‌ను సమర్థించింది మీ కుటుంబ సభ్యులే కదా అని లోకేశ్ నిలదీశారు. జగన్ రాష్ట్ర ప్రజలకు సినిమా చూపిస్తే, దానికి ఎండ్ కార్డ్ వేసే బాధ్యత పసుపు సైనికులదేనని ఆయన స్పష్టం చేశారు.

కడపలో జరిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారి పెద్ద దస్తగిరి హత్య ఉదంతాన్ని ప్రస్తావిస్తూ లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్ద దస్తగిరిని చంపేసింది జగన్ మేనమామేనని… కానీ తిరిగి తామేదో తప్పు చేసినట్లు తమపై కేసులు పెడతామని బెదిరించడం హాస్యాస్పదమన్నారు. జగన్ చేసే మోసాలు, అబద్ధాలు చూస్తుంటే ఆయనకు ‘చీటింగ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు.

ప్రజల ముందుకు వస్తే ముద్దులు పెట్టడం.. లోపలికి వెళ్తే గొడ్డలి పోట్లు పొడవడం జగన్ నైజమని.. ఆయన చేసే ఈ అద్భుత నటనకు ఆస్కార్ కాదు, ‘భాస్కర్ అవార్డు’ గ్యారంటీ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

కూటమి ప్రభుత్వం (టీడీపీ, జనసేన, బీజేపీ) మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ సైకోలు కుట్రలు చేస్తున్నారని లోకేశ్ మండిపడ్డారు. “రాయలసీమ ప్రాంతానికి పట్టిన క్యాన్సర్ గడ్డ జగన్మోహన్ రెడ్డి. సొంత తల్లిని, చెల్లిని రాష్ట్రం దాటి తరిమేశారు. సొంత బాబాయిని లేపేసి, మరో చెల్లి కుటుంబానికి తీరని అన్యాయం చేశారు” అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

2019 ఎన్నికల ముందు వివేకానందరెడ్డి చనిపోతే మొదట గుండెపోటు అన్నారని, ఆ తర్వాత గొడ్డలివేటు బయటకు వచ్చిందని గుర్తుచేశారు. ఆ వెంటనే సొంత దొంగ పేపర్ లో ‘నారాసుర రక్తచరిత్ర’ అని రాసి చంద్రబాబు చేతిలో కత్తి ఉన్నట్లు గ్రాఫిక్స్ ఫొటోలు వేసి, రాజకీయం చేసింది నిజం కాదా? అని ప్రశ్నించారు. జగన్ ఎంతటి మోసగాడో, ఆయన క్రిమినల్ బ్రెయిన్ ఎలాంటిదో సొంత కడప జిల్లా ప్రజలతో పాటు యావత్ ఏపీకి క్లియర్‌గా అర్థమైందని వ్యాఖ్యానించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh politics
  • Education Minister Nara Lokesh
  • Gaddali party
  • Nara Lokesh Comments On Ys Jagan
  • telugu desam party
  • YSR Congress Party

Related News

government-gives-green-signal-for-prosecution-of-kodali-nani

Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2021 పంచాయతీ ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు, నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసులో విచారణ ముందుకు సాగనుంది. పంచాయతీ ఎన్నికల సమయంలో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించే విధంగా ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల సంఘం అభిప్

  • The date has been fixed for the 'Thalliki Vandanam' amount to be credited to your account.

    Talliki Vandanam: ఆ రోజు మీ అకౌంట్ లోకి తల్లికి వందనం.. డేట్ ఫిక్స్

  • South African star cricketer Jonty Rhodes met Minister Nara Lokesh.

    Jonty Rhodes: మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ జాంటీ రోడ్స్‌

  • Pawan Kalyan's comments on the 'Cockroach Party'

    Pawan Kalyan: కాక్రోచ్ పార్టీ పై పవన్‌ కల్యాణ్‌ కామెంట్స్‌

  • MLA Chintamaneni Prabhakar goes on a rampage.

    TDP ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వీరంగం

Latest News

  • Vedanta Power : స్టాక్ మార్కెట్లోకి వేదాంత పవర్ ఎంట్రీ

  • Jnaneswari: తుని పాప మిస్సింగ్ రోజు.. CCTVలో బిగ్ ట్విస్ట్

  • Maa Inti Bangaram: సమంత మా ఇంటి బంగారం ఎలా ఉందంటే..

  • Meta : ‘మెటా’ నుంచి సరికొత్త పేరంటల్ అలర్ట్స్!

  • TS EAPCET 2026: తెలంగాణలో నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

Trending News

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd