HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Atchannaidu Lashes Out At Jagan

Atchannaidu: జగన్ పై అచ్చెన్నాయుడు ఫైర్

  • Author : Vamsi Chowdary Korata Date : 22-05-2026 - 5:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
The government will stand by tobacco farmers.
The government will stand by tobacco farmers.

వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు తనదైన శైలిలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్ కుటుంబంలో జరిగిన మరణాలన్నీ టీడీపీ, చంద్రబాబు హయాంలోనే జరిగాయంటూ జగన్ చేసిన ఆరోపణలను కొట్టిపారేసిన ఆయన.. జగన్ ప్రవర్తన చూస్తుంటే ‘అపరిచితుడు’ సినిమా పాత్ర గుర్తుకొస్తోందని ఎద్దేవా చేశారు.

జగన్ తాత రాజారెడ్డిని ఎందుకు హత్య చేశారో, ఆనాటి వైఎస్ కుటుంబ అరాచకాలను బాధితుడు పార్థసారథిరెడ్డి స్వయంగా వివరించారని అచ్చెన్న గుర్తుచేశారు. రాజారెడ్డి హత్య కేసులో ఉన్న వ్యక్తి ఇవాళ వైసీపీలోనే కొనసాగుతుండటం జగన్ ద్వంద్వ నీతికి నిదర్శనమన్నారు. ఇక అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడిన రెండు రోజులకే వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారంటూ జగన్ చేస్తున్న ప్రచారం సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు. ఆనాడు తిరుమల వేంకటేశ్వర స్వామికి కీడు తలపెడితే మంచి జరగదని మాత్రమే చంద్రబాబు అన్నారని, గతంలో వైఎస్సార్ మరణం వెనుక ‘రిలయన్స్’ ఉందన్న వారే ఇప్పుడు చంద్రబాబుపై పడుతున్నారని ధ్వజమెత్తారు.

అలాగే బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి మరణాన్ని మొదట గుండెపోటు అని నమ్మించి, ఆపై గొడ్డలితో నరికి చంపిన చరిత్ర వారిదేనని.. అందుకే వైసీపీని ‘గొడ్డలి పార్టీ’ అని పిలుస్తున్నామని స్పష్టం చేశారు. ఐదేళ్లు అధికారంలో ఉండి కూడా వివేకా హంతకులను ఎందుకు పట్టుకోలేకపోయారో జగన్ సమాధానం చెప్పాలని అచ్చెన్నాయుడు నిలదీశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh politics
  • AP CM Chandrababu Naidu
  • Atchannaidu
  • ys jagan
  • YS Raja Reddy
  • YS Vivekananda reddy Murder

Related News

Good news for the unemployed in AP: Green signal given to fill job vacancies in the Electricity Department.

APSPDCL: ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. విద్యుత్ శాఖలో ఉద్యోగాలు భర్తీకి గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధిలోని విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది, ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. మొత్తం 629 ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ ప్రకటన వెలువడింది. వివిధ ప్రభుత్వ విద్యుత్ సంస్థల వారీగా విభజించిన ఈ ఖాళీలలో.. ఏపీ ట్రాన్స్‌కో (AP Transco) లో అత్యధికంగా 200 పోస్టులు ఉన్నాయి. వీటి

    Latest News

    • Tambulam: తాంబూలం ఎందుకు ఇస్తారు? ఏ సందర్భాల్లో ఇస్తారు? వాటి ప్రత్యేకత ఏంటి?

    • CM Revanth: టూరిజం రంగంలో భారీ మార్పులు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

    • Skipping Dinner: రాత్రి భోజనం చేయలేదా? ఈ అనారోగ్య సమస్యలు తప్పవు.. జాగ్రత్త!!

    • Ravan: మరో కేసులో యూట్యూబర్‌ రావణ్‌ మళ్లీ అరెస్టు

    • Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

      • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd