HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ec Sanction For Tenders In Capital Amaravati

Amaravati : రాజధాని అమరావతిలో టెండర్లకు ఈసీ అనుమతి

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో సీఆర్‌డీఏ పరిధిలో చేపట్టబోయే పనులకు అనుమతి కోసం ఇటీవల సీఆర్‌డీఏ అధికారులు ఈసీకి లేఖ రాశారు.

  • By Latha Suma Published Date - 05:00 PM, Thu - 6 February 25
  • daily-hunt
EC sanction for tenders in capital Amaravati
EC sanction for tenders in capital Amaravati

Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులకు సంబంధించి టెండర్లు పిలిచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) అనుమతిచ్చింది. రాజధాని అమరావతి పనులకు అభ్యంతరం లేదని ఎన్నికల కమిషన్ క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఈసీ ఓ లేఖ రాసింది. కృష్ణ-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో సీఆర్‌డీఏ పరిధిలో చేపట్టబోయే పనులకు అనుమతి కోసం ఇటీవల సీఆర్‌డీఏ అధికారులు ఈసీకి లేఖ రాశారు.

Read Also: Indian immigrants : అక్రమ వలసదారుల తరలింపు ప్రక్రియ కొత్తేమీ కాదు..!

దీనిపై స్పందించిన ఈసీ.. రాజధానిలో పనులకు అభ్యంతరం లేదని లేఖ ద్వారా స్పష్టం చేసింది. టెండర్లు పిలిచేందుకు అనుమతించింది. అయితే, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక మాత్రమే టెండర్లు ఖరారు చేయాలని లేఖలో పేర్కొంది. ఇక, అమరావతిలో 14 వేల కోట్ల విలువైన పనులు చేటపట్టామని అవి ప్రస్తుతం టెండర్ల దశలో ఉన్నాయని, వాటిని పూర్తి చేయాలంటే కోడ్ అడ్డం వస్తుందని సీఆర్డీఏ తెలిపింది.

ఆ లేఖకు ఈసీ స్పందించింది. టెండర్ల ప్రక్రియ జరుపుకునేందుకు అనుమతినిచ్చింది. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి అమరావతి నిర్మాణానికి రుణం లభించింది. గత నెల నుంచి సీఆర్డీయే బిడ్లను కూడా ఆహ్వానిస్తోంది. వీటిని ఈ నెల ఏడో తేదీన తెరవాల్సి ఉంది. అయితే కోడ్ కారణంగా టెండర్లు ఫైనలైజ్ చేయడానికి అనుమతి నిరాకరించిన ఈసీ, కొత్తవాటిని పిలవడానికి అనుమతి మాత్రం ఇచ్చింది.

కాగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతిపై ఫోకస్ పెట్టింది. రాజధాని పునర్నిర్మాణ పనులను వేగవంతం చేసింది. కానీ అంతలోనే బ్రేక్ పడింది. అందుకు కారణం ఎమ్మెల్సీ ఎన్నికలు. ఎన్నికల కోడ్‌ అమరావతి పనులకు అడ్డింకిగా మారింది. ఈ క్రమంలోనే సీఆర్‌డీఏ ఈసీకి లేఖ రాసింది. రాజధాని అమరావతిలో వివిధ జోన్లు ఉన్నాయి. ఈ జోన్లలోని లేఅవుట్లలో రోడ్లు, తాగునీటి సరఫరా, డ్రైన్లు, ఇంటర్నెట్ తీగలు వేసేందుకు డక్ట్‌ల నిర్మాణం, అవెన్యూ ప్లాంటేషన్ వంటి అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Read Also: Repo Rate: గుడ్ న్యూస్ చెప్ప‌నున్న ఆర్బీఐ.. వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించ‌నుందా?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amaravati
  • capital amaravati
  • Election commission
  • mlc electons
  • tenders

Related News

Mamata Tears Into Bjp

SIR : SIRకు వ్యతిరేకంగా బెంగాల్లో భారీ ర్యాలీ

SIR : దేశవ్యాప్తంగా స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (SIR) కార్యక్రమం రెండో దశ ప్రారంభమైన నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దీని వ్యతిరేకంగా మంగళవారం గట్టిగా నిరసన వ్యక్తం చేశారు

    Latest News

    • Kumki Elephants Camp : కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్

    • Rajnath Singh : రేవంత్ ‘ముస్లిం’ వ్యాఖ్యలపై మండిపడ్డ రాజ్నాథ్ సింగ్

    • Minister Nimmala : కూలీలా మారిన ఏపీ మంత్రి

    • Kavitha : హరీశ్ రావుపై మరో అవినీతి బాంబ్ పేల్చిన కవిత..!!

    • Jubilee Hills Bypoll : హిందువులు మీతో లేరని ఒప్పుకుంటారా?: రేవంత్

    Trending News

      • Digital Gold: డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెడుతున్నారా? మీకొక షాకింగ్ న్యూస్‌!

      • IND vs AUS: భార‌త్‌- ఆస్ట్రేలియా మ్యాచ్ ర‌ద్దు కావ‌డానికి కార‌ణం పిడుగులేనా?

      • Strong Room: ఎన్నిక‌ల త‌ర్వాత ఈవీఎంల‌ను స్ట్రాంగ్ రూమ్‌లో ఎందుకు ఉంచుతారు?

      • Junio Payments: బ్యాంకు ఖాతా లేకుండానే యూపీఐ.. పిల్లలు కూడా ఆన్‌లైన్ చెల్లింపులు చేయొచ్చు!

      • Abhishek Sharma: సూర్య‌కుమార్ యాద‌వ్ రికార్డును బ్రేక్ చేసిన యంగ్ ప్లేయ‌ర్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd