Repo Rate: గుడ్ న్యూస్ చెప్పనున్న ఆర్బీఐ.. వడ్డీ రేట్లను తగ్గించనుందా?
వడ్డీ రేట్ల తగ్గింపు వల్ల గృహ రుణాలు చౌకగా లభిస్తాయని, ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఉపశమనం లభిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
- By Gopichand Published Date - 04:57 PM, Thu - 6 February 25

Repo Rate: 2025 బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి రూ. 12 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపుపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిర్ణయం ముఖ్యమైనదని నిరూపితమైంది. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుండి ఉపశమనంపై అంచనాలు కూడా పెరిగాయి. దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత RBI వడ్డీ రేట్లను 0.25% తగ్గించవచ్చని అంచనా. ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తే అది రుణంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని, ఇది రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఊపును తీసుకురాగలదని అంచనా వేస్తున్నారు.
RBI ఫిబ్రవరి 2023 నుండి పాలసీ రేట్లను (Repo Rate) 6.5 శాతం వద్ద స్థిరంగా ఉంచింది. అయితే మహమ్మారి కరోనా సమయంలో ఈ రేటు తగ్గించారు. ఇప్పుడు కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన మానిటరీ పాలసీ కమిటీ సమావేశమవుతోంది. ఈ నిర్ణయంపై మార్కెట్ ఆశలు చిగురించాయి.
Also Read: Reliance Income Tax: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎంత ఆదాయపు పన్ను చెల్లిస్తుందో తెలుసా?
🚨IN A MUCH ANTICIPATED MEETING OF #RBI THIS FRIDAY,
MANY INSTITUTIONS ARE ASSURED OF A 25 BASIS POINT CUT IN THE #RepoRate THIS TIME IN THE #RBI #monetaryPolicy,
FROM A CURRENT 6.50% REPO RATE.
THIS MOVE WILL FURTHER EASE OUT THE INFLATIONARY PRESSURE IN THE ECONOMY #rbimpc pic.twitter.com/je0b2tMmbh
— 🚨FINANCE KI SHALAA (@shalaa_finance) February 6, 2025
రియల్ ఎస్టేట్ కోసం ఈ నిర్ణయం ఎందుకు ముఖ్యమైనది?
వడ్డీ రేట్ల తగ్గింపు వల్ల గృహ రుణాలు చౌకగా లభిస్తాయని, ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఉపశమనం లభిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఇది రియల్ ఎస్టేట్ రంగంలో కొనుగోళ్లను పెంచవచ్చని అంచనా వేస్తున్నారు. ఖరీదైన రుణాల కారణంగా చాలా మంది ప్రజలు లోన్‌లు తీసుకునేందుకు సంకోచిస్తున్నారు.
నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనామిస్ట్ మదన్ సబ్నవిస్ మాట్లాడుతూ.. “ఆర్‌బీఐ ఇప్పటికే ద్రవ్యత పెంచడానికి చర్యలు తీసుకున్నందున ఈసారి వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం కూడా బలంగా ఉంది.” అదే సమయంలో ఈ నిర్ణయం డెవలపర్లు, గృహ కొనుగోలుదారులకు ఉపశమనం కలిగించగలదని రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన నిపుణులు భావిస్తున్నారు.
స్థిరాస్తులకు ప్రోత్సాహం లభిస్తుంది
క్రెడాయ్ ఛైర్మన్, గౌర్ గ్రూప్ CMD మనోజ్ గౌర్ మాట్లాడుతూ.. ఇది కొత్త గవర్నర్ మొదటి MPC సమావేశం. రెపో రేట్లపై అనుకూలమైన ప్రకటనతో ఆయన తన పదవీకాలాన్ని ప్రారంభించాలని మేము ఆశిస్తున్నాము. మధ్యతరగతి పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న అనుకూల విధానాలను బడ్జెట్‌లో సూచించింది. దీని కారణంగా ఆర్‌బిఐ కూడా అదే దిశలో అడుగులు వేస్తుందని, కాకపోయినా కనీసం 25 బేసిస్ పాయింట్ల నామమాత్రపు కోతను ప్రకటిస్తుందని మార్కెట్ అంచనా వేస్తోంది. ఈ తగ్గింపు మార్కెట్ సెంటిమెంట్‌ను బలోపేతం చేయడమే కాకుండా రియల్ ఎస్టేట్ రంగానికి ఊపునిస్తుందని అన్నారు.