HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Earthquake In Prakasam District Why Earthquakes Occurring Repeatedly In Telugu States

Earthquakes: ప్రకాశం జిల్లాలో భూకంపం.. తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది ?

భూప్రకంపనలు అనేవి గత రెండేళ్ల వ్యవధిలో తెలుగు రాష్ట్రాల్లో(Earthquakes) ఎక్కువ సంఖ్యలో సంభవించాయి.

  • Author : Pasha Date : 06-05-2025 - 2:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Earthquake Prakasam District Telugu States Andhra Pradesh Telangana North Telangana Coastal Andhra

Earthquakes: సోమవారం సాయంత్రం తెలంగాణలోని పలుచోట్ల భూకంపం రాగా.. ఇవాళ ఉదయం 9.54 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో పలుచోట్ల భూప్రకంపనలు సంభవించాయి. ప్రకాశం జిల్లా పరిధిలోని  దర్శి, పొదిలి, కురిచేడు, ముండ్లమూరులలో భూమి కంపించిందని తెలిసింది. కొత్తూరులోని రాజు ఆస్పత్రి వీధి, బ్యాంకు కాలనీ, ఇస్లాంపేటలలోనూ ప్రకంపనలు వచ్చాయి. మంగళవారం ఉదయం 5సెకన్ల పాటు భూమి కంపించిందని ప్రజలు తెలిపారు. దీంతో భయపడి జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. గత ఏడాది కూడా ప్రకాశం జిల్లాలోని దర్శి, ముండ్లమూరు, తాళ్లూరులలో  భూమి కంపించింది. సోమవారం సాయంత్రం తెలంగాణలోని క‌రీంన‌గ‌ర్, సిరిసిల్ల, జగిత్యాల, వేములవాడ, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో 3.8 తీవ్రతతో భూ ప్రకంపనలు సంభవించాయి. నిర్మల్‌ జిల్లాలోని ఖానాపూర్‌, కడెం, జన్నారం, లక్సెట్టిపేటలలోనూ భూమి కంపించింది. రెండుసార్లు భూమి తీవ్రంగా కంపించిందని స్థానికులు తెలిపారు. క‌రీంన‌గ‌ర్‌ సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో భ‌వ‌నాలు,  ఇండ్లు కంపించాయి.

Also Read :Ambani Vs Trump: హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌.. ట్రంప్‌తో అంబానీ ఢీ.. వాట్స్ నెక్ట్స్ ?

తెలంగాణకు రిస్క్ ఎందుకు పెరిగింది ? 

భూప్రకంపనలు అనేవి గత రెండేళ్ల వ్యవధిలో తెలుగు రాష్ట్రాల్లో(Earthquakes) ఎక్కువ సంఖ్యలో సంభవించాయి. దీంతో తెలంగాణ, ఏపీ ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ప్రత్యేకించి ఏపీలోని కోస్తాంధ్ర ప్రాంతంలో ఉన్న జిల్లాలు,  ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో భూప్రకంపనల తీవ్రత ఎక్కువగా కనిపించింది. అంటే తెలుగు రాష్ట్రాల్లోని ఈ రెండు ప్రాంతాలకు భూకంపాల ముప్పు ఎక్కువగా ఉందనే విషయం క్లియర్ అవుతోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల విషయానికొస్తే.. ఇక్కడ మైనింగ్ యాక్టివిటీ ఎక్కువగా జరుగుతోంది. సింగరేణి కాలరీస్ వంటివి ఉత్తర తెలంగాణ జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. దీంతోపాటు ఈ జిల్లాల్లో భూగర్భ జలాల వినియోగం అతిగా జరుగుతోంది. ఇవన్నీ ప్రతికూలంగా పరిణమించి భూప్రకంపనలకు కారణమవుతున్నాయని పరిశీలకులు అంటున్నారు.

Also Read :APPSC Irregularities : ఏపీపీఎస్సీ గ్రూప్-1 కేసులో ధాత్రి మధు అరెస్టు.. ఏమిటీ కేసు ?

కోస్తాంధ్రలో రిస్క్.. ఎక్కడంటే ? 

ఏపీలోని కోస్తాంధ్ర ప్రాంతం విషయానికొస్తే.. అది సముద్ర తీరంలో ఉంది. సముద్ర గర్భంలో చోటుచేసుకున్న ప్రతికూల పరిణామాల ప్రభావం రానున్న కాలంలో కోస్తాంధ్ర జిల్లాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ప్రత్యేకించి కోస్తాంధ్ర ప్రాంతంలోని ప్రకాశం, కాకినాడ, విశాఖపట్నంలకు భూకంపాల ముప్పు ఎక్కువ అని నిపుణులు అంటున్నారు.  మన దేశాన్ని మొత్తం నాలుగు భూకంప మండలాలుగా డివైడ్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తక్కువ ముప్పు ఉన్న జోన్ 2లో ఉన్నాయి. అయితే తెలుగు రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలు జోన్ 3లో కూడా ఉన్నాయి. అంటే ఆయా చోట్ల మధ్యస్తంగా భూకంపాలు వచ్చే రిస్క్ ఉంది. భూగర్భంలో ఉండే టెక్టానిక్ ప్లేట్లు తమను తాము సర్దుబాటు చేసుకునేందుకు కదులుతుంటాయి. ఈక్రమంలోనే అవి కదిలిన ప్రాంతాల్లో భూమి కంపిస్తుంటుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Coastal Andhra
  • earthquake
  • Earthquakes
  • North Telangana
  • Prakasam District
  • telangana
  • telugu states

Related News

MIssing Case

Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

ఫిన్లాండ్‌లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి 45 రోజులుగా అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. కుమారుడి ఆచూకీ కోసం తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు చివరకు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హయత్‌నగర్‌కు చెందిన గుజ్జ మణిదీప్ రెడ్డి, ఫిన్లాండ్‌లోని లాహ్తిలో ఉన్న LUT యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నాడు. మే 5న తన కుటుంబ సభ్యులతో చివరిసారిగా మాట్లాడిన తర

  • Engineering counselling in Telangana begins today.

    TS EAPCET 2026: తెలంగాణలో నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

  • Alert for gas consumers: June 30 is the final deadline. These requirements must be met—otherwise, the connection will be disconnected.

    LPG Gas Subsidy: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 30 వరకే డెడ్ లైన్.. ఇవి తప్పక పాటించాల్సిందే.. లేదంటే కనెక్షన్ కట్

  • Pawan Kalyan's tour in Telangana... Janasena chief to fulfill a young child's last wish.

    Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

  • South African star cricketer Jonty Rhodes met Minister Nara Lokesh.

    Jonty Rhodes: మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ జాంటీ రోడ్స్‌

Latest News

  • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

  • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

  • Pregnancy: పీరియడ్స్ టైం లో శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్లేనా..?

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd