Ambani Vs Trump: హైదరాబాద్ రియల్ ఎస్టేట్.. ట్రంప్‌తో అంబానీ ఢీ.. వాట్స్ నెక్ట్స్ ?
ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లో నిర్మించనున్న అనంత్ విలాస్ హోటల్, బ్రిటన్‌లోని ప్రఖ్యాత స్టోక్ పార్క్(Ambani Vs Trump), గుజరాత్‌లో మరొక ప్రణాళికాబద్ధమైన ప్రాజెక్ట్ ఉన్నాయి.
- By Pasha Published Date - 01:22 PM, Tue - 6 May 25

Ambani Vs Trump: మన హైదరాబాద్ మహా నగరంలోని కోకాపేటలో ఇరా రియాల్టీ సహకారంతో ట్రంప్ టవర్స్ ప్రాజెక్ట్ రాబోతుంది. కొత్త విషయం ఏమిటంటే.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌పై ముకేశ్ అంబానీ కూడా అత్యంత ఆసక్తిగా ఉన్నారట. నగరంలో వందల కోట్లు కుమ్మరించి విలువైన భూములను కొనేందుకు ఆయన రెడీ అవుతున్నారట. ఆయా భూముల్లో భారీ అపార్ట్‌మెంట్లు, విల్లాలను నిర్మించాలని అంబానీ యోచిస్తున్నారట. ఓ వైపు ట్రంప్.. మరోవైపు అంబానీ ఇద్దరూ రియల్ ఎస్టేట్‌లో ఫైట్‌కు దిగితే హైదరాబాద్‌లో భూములు, ఇళ్ల లెక్కలన్నీ మారిపోనున్నాయి. ఆ వివరాలను మనం ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :APPSC Irregularities : ఏపీపీఎస్సీ గ్రూప్-1 కేసులో ధాత్రి మధు అరెస్టు.. ఏమిటీ కేసు ?
2023లోనే రియల్ ఎస్టేట్‌లోకి రిలయన్స్
ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పటివరకు రియల్ ఎస్టేట్‌లోకి రాలేదని చాలామంది భావిస్తున్నారు. అయితే ఈ భావన తప్పు. 2023 సంవత్సరంలోనే ది ఒబెరాయ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ (ఒబెరాయ్)తో రిలయన్స్ ఇండస్ట్రీస్ భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా భారతదేశంతో పాటు బ్రిటన్‌లో ఉన్న మూడు ఆస్తుల నిర్వహణను ది ఒబెరాయ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ సంయుక్తంగా పర్యవేక్షిస్తాయి. ఈ రెండు కంపెనీలు కలిసి పర్యవేక్షించనున్న ఆస్తుల జాబితాలో.. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లో నిర్మించనున్న అనంత్ విలాస్ హోటల్, బ్రిటన్‌లోని ప్రఖ్యాత స్టోక్ పార్క్(Ambani Vs Trump), గుజరాత్‌లో మరొక ప్రణాళికాబద్ధమైన ప్రాజెక్ట్ ఉన్నాయి. ఇవన్నీ ముకేశ్ అంబానీ స్థిరాస్తులే. బ్రిటన్ రాజధాని లండన్‌కు 25 మైళ్ల దూరంలో స్టోక్ పార్క్ ఉంది. ఈ ఎస్టేట్ దాదాపు 300 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీన్ని 2021 ఏప్రిల్‌లో రూ.592 కోట్లతో ముకేశ్ అంబానీ కొనేశారు. స్టోక్ పార్క్‌లో ఫైవ్ స్టార్ హోటల్, మూడు రెస్టారెంట్లు, ఒక స్పా, ఒక జిమ్, 13 టెన్నిస్ కోర్టులు, గోల్ఫ్ కోర్స్ ఉన్నాయి. అంతేకాదు దుబాయ్, అమెరికాలోనూ ముకేశ్ అంబానీకి స్థిరాస్తులు ఉన్నాయి. అంటే ఇంటర్నేషనల్ లెవల్‌లో ఇప్పటికే అంబానీ రియల్ ఎస్టేట్‌ను మొదలుపెట్టారు. భవిష్యత్తులో భారత్‌లోని మహానగరాలు వేదికగా తన రియల్ ఎస్టేట్ బిజినెస్‌ను మరింత బలోపేతం చేయబోతున్నారన్న మాట.
Also Read :Worlds Toughest Prison: అల్కాట్రాజ్.. ప్రపంచంలోనే టఫ్ జైలు ఎందుకైంది ? రీ ఓపెనింగ్ ఎందుకు ?
గుర్గావ్‌లో రిలయన్స్ మెట్ సిటీ.. హైదరాబాద్‌లో.. ?
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పటికే మన దేశ రాజధాని ఢిల్లీ శివార్లలోని గుర్గావ్‌లో మెట్ సిటీని నిర్మిస్తోంది. మెట్ అంటే మోడల్ ఎకనమిక్ టౌన్ షిప్. ‘రిలయన్స్ ఎస్.వో.యూ. లిమిటెడ్’ అనే అనుబంధ కంపెనీ ఆధ్వర్యంలో మెట్ సిటీని ముకేశ్ అంబానీ నిర్మింపజేస్తున్నారు. ఈ కంపెనీయే ఇప్పుడు హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం స్కెచ్ గీస్తోంది. భాగ్య నగరం పరిధిలో కాసులు కురిపించే ఏరియాలు ఏవి ? ఎక్కడ స్థలం తీసుకొని ఆకాశ హార్మ్యాలు నిర్మిస్తే బాగుంటుంది ? అనే దానిపై రిలయన్స్ ప్రతినిధులు సర్వే చేస్తున్నారు. దాదాపు 50 అంతస్తుల్లో ఉండే ట్రంప్ టవర్స్ అనేవి సామాన్యులకు అందుబాటులో ఉండవు. వాటిలోని అల్ట్రా లగ్జరీ ఫ్లాట్ల రేట్లు చాలా ఎక్కువ. రిలయన్స్ అందుకు భిన్నంగా మీడియం రేంజ్‌లో లగ్జరీ స్థాయి ఫ్లాట్లను తీర్చిదిద్ది విక్రయించాలని భావిస్తున్నట్లు సమాచారం. అందుకు అనుగుణంగా ఉండే ఏరియాల్లోనే రిలయన్స్ భూములను కొనుగోలు చేయనుందట.