Lover : ప్రియుడికి మాజీ లవర్ ఉన్న విషయం తెలిసి..కన్నింగ్ లేడీ ఏంచేసిందో తెలుసా..?
- By Sudheer Published Date - 08:43 PM, Fri - 15 December 23

ఇటీవల కాలంలో సోషల్ మీడియా (Social Media) వాడకం ఎంతగా పెరిగిందో తెలియంది కాదు..సోషల్ మీడియా వాడకం పెరగడం తో అనేక యాప్స్ పుట్టుకొస్తున్నాయి. ఈ యాప్స్ ను కొంతమంది మంచికి వాడుకుంటే..చాలామంది చెడ్డ పనులకు వాడుతూ..నేరగాళ్లుగా మారుతున్నారు. ముఖ్యంగా అమ్మాయిల తాలూకా ఫోటోను న్యూడ్ గా మారుస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. తాజాగా వైజాగ్ లో ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది.
వైజాగ్ (Vizag) నగరానికి చెందిన ఓ యువతి ఇన్ స్టాలో ఉన్న ఫొటోలను నగ్నంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. ఆ పిక్స్ ను చూసి షాక్ కు గురైన సదరు యువతీ..వెంటనే విశాఖ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆ యువతికి గిట్టని అబ్బాయిలపై ఫోకస్ చేశారు. కానీ టెక్నాలజీని ఉపయోగించి చూడగా.. ఆ పోస్టులు పెట్టింది అబ్బాయిలు కాదని ఓ అమ్మాయి అని తెలిసి అంత షాక్ అయ్యారు. ఎవరా అమ్మాయి అని అరా తీసి అసలు విషయం రాబట్టారు.
We’re now on WhatsApp. Click to Join.
నిందితురాలైన యువతి హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తూ అక్కడి ఉద్యోగితో ప్రేమ వ్యవహారం సాగిస్తుంది. కొద్దీ రోజులుగా ఇద్దరు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే క్రమంలో ఆ యువతికి ..తన ప్రియుడికి ఇంతకు ముందే మరో యువతీ తో ప్రేమ వ్యహారం ఉందని కాకపోతే ఆ తర్వాత ఆమెకు బ్రేకప్ చెప్పాడని తెలిసింది. ఎక్కడ మళ్లీ ఆమెకు దగ్గర అవుతాడో అని.. జలసి తో ఆమెపై తప్పుడు ప్రచారం చేయడం ప్రారంభించింది. ఆ యువతి ఇన్ స్టాగ్రామ్‌లో ఉన్న ఫొటోలు, వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోని మార్ఫింగ్ చేయించింది. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేసింది. అలాగే యువతి తల్లి ఫొటోలను కూడా తీసుకుని ఆమెపై బూతుగా ప్రచారం చేసింది. వీళ్లే కాక మరో ఇద్దరు మహిళలపై కూడా తప్పుగా పోస్టులు పెట్టింది. అయితే తన ప్రియుడికి ఆ యువతి మొదటి ప్రియురాలుగా ఉన్నదనే జలసితోనే ఇలా తప్పుడు మార్గంలో ఆమెపై కసి తీర్చుకునేందుకు ప్లాన్ వేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం ఆ యువతి ఫై పలు కేసులు నమోదు చేసి.. అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారా అని పోలీసులు ఆశ్చర్య పోయారు.
Read Also : Eating Banana: శీతాకాలంలో ప్రతిరోజు అరటిపండు తింటే ఏం జరుగుతుందో తెలుసా?