Andhra Pradesh: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ధీరజ్ ప్రమాణస్వీకారం.. కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫిరెన్స్
- By Praveen Aluthuru Published Date - 02:01 PM, Fri - 28 July 23

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ తో ప్రమాణస్వీకారం చేయించారు. అంతకుముందు సీఎం వైఎస్ జగన్ చీఫ్ జస్టిస్‌కు స్వాగతం పలికారు. అనంతరం ప్రమాణస్వీకారం కార్యక్రమంలో పాల్గొన్నారు.
తేనీటి విందు కార్యక్రమంలో గవర్నర్, చీఫ్ జస్టిస్‌లతో ముఖ్యమంత్రి. pic.twitter.com/zOLwbHRosx
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) July 28, 2023
ప్రమాణస్వీకారం అనంతరం చీఫ్ జస్టిస్ ను సీఎం జగన్ సత్కరించారు. తరువాత గవర్నర్ తేనీటి విందు కార్యక్రమంలో చీఫ్ జస్టిస్, సీఎం జగన్ లు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా సీఎం జగన్ మధ్యాహ్నం 3 గంటలకు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. రాష్ట్రంలో గత కొద్దీ రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో చేపట్టాల్సిన కార్యక్రమాలు, సహాయ చర్యల నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
Also Read: Prabhas FB: ప్రభాస్ ఫేస్ బుక్ హ్యాక్.. డార్లింగ్ టీం అలర్ట్