Amaravati Update : తిరుమలను తలపించేలా అమరావతిలో శ్రీవారి ఆలయం
అమరావతి(Amaravati Update)లోని శ్రీవారి ఆలయం చుట్టూ భారీ ప్రాకారం నిర్మించనున్నారు.
- By Pasha Published Date - 09:29 AM, Sun - 23 March 25

Amaravati Update : అమరావతిలోని శ్రీవారి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ఏపీ సర్కారు నడుం బిగించింది. ఇక్కడి శ్రీవారి ఆలయాన్ని రూ.185 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్లాన్స్ రెడీ చేసింది. తిరుమలను తలపించేలా శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలి అనేది సర్కారు ఆలోచన. ఇందుకోసం వెంకటపాలెం వద్ద ప్రధాన అనుసంధాన రహదారికి, కృష్ణా కరకట్టకు మధ్యలో 25 ఎకరాలను కేటాయించారు. వివరాలివీ..
Also Read :Mass Shooting : కాల్పుల మోత.. ముగ్గురి మృతి, 15 మందికి గాయాలు
గోపురాలు
అమరావతి(Amaravati Update)లోని శ్రీవారి ఆలయం చుట్టూ భారీ ప్రాకారం నిర్మించనున్నారు. దీంతోపాటు ఆలయం ప్రధాన ముఖద్వారం వద్ద ఏడు అంతస్తులతో మహారాజ గోపురం నిర్మిస్తారు. మూడు దిక్కుల్లో ఐదు అంతస్తులతో గోపురాలు ఉంటాయి. ఆలయం వెలుపలి ప్రాకారానికి తూర్పు దిక్కున మహారాజగోపురం ఉంటుంది. పశ్చిమ, ఉత్తర, దక్షిణ దిశల్లో రాజగోపురాలు ఉంటాయి.
మండపాలు
ఆలయంలో కల్యాణోత్సవ, ఉత్సవ మండపాలను రూ.84 కోట్లతో నిర్మిస్తారు. రూ.6 కోట్లతో ఆలయానికి చుట్టూ మాడ వీధులు, అప్రోచ్ రహదారులను ఏర్పాటు చేస్తారు. పుష్కరిణి సైతం నిర్మిస్తారు. ఆలయ ప్రాంగణంలో కట్‌స్టోన్ ఫ్లోరింగ్ ఏర్పాటు చేస్తారు.
ధ్యాన మందిరం
అన్నదానం కాంప్లెక్స్, అర్చకులు, సిబ్బంది క్వార్టర్లు, రెస్ట్ హౌస్, భక్తులకు వెయిటింగ్ హాల్‌లను రూ.20 కోట్లతో నిర్మిస్తారు. రూ.20 కోట్లతో ధ్యాన మందిరాన్ని అందుబాటులోకి తెస్తారు. విద్యుత్ సబ్ స్టేషన్, సోలార్ లైటింగ్ విధానం, సోలార్ పవర్ ప్లాంట్ తదితరాలను రూ.11 కోట్లతో ఏర్పాటు చేస్తారు. స్వామివారి నిత్య కైంకర్యాలు, ఉత్సవాలతో అమరావతిలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దనున్నారు.