Mass Shooting : కారు కోసం కాల్పుల మోత.. ముగ్గురి మృతి, 15 మందికి గాయాలు
ఈ కార్ షోలో అనుమతి లేని ఒక కారును(Mass Shooting) ప్రదర్శించారు.
- By Pasha Published Date - 08:57 AM, Sun - 23 March 25

Mass Shooting : మరోసారి కాల్పుల మోతతో అమెరికా దద్దరిల్లింది. న్యూమెక్సికోలోని లాస్ క్రూసెజ్ ప్రాంతంలో కార్ షో జరుగుతుండగా.. రెండు వర్గాల మధ్య గన్ ఫైర్ జరిగింది. దీంతో ముగ్గురు చనిపోగా, 15 మందికి గాయాలయ్యాయి. చనిపోయిన వారిలో ఇద్దరు టీనేజర్లు ఉన్నారు. గాయపడిన వారంతా 16 నుంచి 36 ఏళ్లలోపు వారే. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రుల్లో చేర్పించారు. ఈ కార్ షోలో అనుమతి లేని ఒక కారును(Mass Shooting) ప్రదర్శించారు. దాని విషయంలోనే రెండు గ్రూపుల మధ్య వాగ్వాదం జరిగింది. ఇది పెరిగి.. చివరకు గన్ ఫైర్‌కు దారితీసింది. ఈ వివరాలను లాస్ క్రూస్ పోలీస్ చీఫ్ జెరేమీ స్టోరీ మీడియాకు వెల్లడించారు.
Also Read :Nara Lokesh : స్వర్ణ దేవాలయాన్ని సందర్శించిన లోకేశ్, బ్రాహ్మణి, దేవాంశ్
దుండగుడి కాల్పులు.. తండ్రి, కుమార్తె మృతి
అమెరికాలోని వర్జీనియాలో ఉన్న ఒక డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లో ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ఆ స్టోర్‌లో పనిచేస్తున్న ఊర్మి(24), ఆమె తండ్రి ప్రదీప్ పటేల్(56) మృతి చెందారు. గురువారం ఉదయం మద్యం కోసం ఈ స్టోర్‌కు వచ్చిన దుండగుడు.. ‘‘అంతకుముందు రోజు రాత్రి ఈ స్టోర్‌ను ఎందుకు మూసేశారు ?’’ అని ప్రశ్నించాడు. ఈక్రమంలో అతడు ఆగ్రహంతో ఊగిపోయి ఫైరింగ్‌కు పాల్పడ్డాడు. ఈ ఘటన ప్రదీప్ పటేల్ అనే వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. గాయపడిన ఊర్మి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్‌కు చెందిన ప్రదీప్ పటేల్ కుటుంబం ఆరేళ్ల క్రితం అమెరికాకు వచ్చింది. తమ బంధువైన పరేష్ పటేల్‌కు చెందిన స్టోర్‌లో ప్రదీప్(Mass Shooting) ఆయన కుమార్తె ఉర్మి పని చేస్తున్నారు. ప్రదీప్ పటేల్‌కు మరో ఇద్దరు కుమార్తెలున్నట్లు బంధువులు తెలిపారు. ఒకరు కెనడాలో, మరొకరు అహ్మదాబాద్‌లో నివసిస్తున్నట్లు చెప్పారు. మొత్తం మీద గన్ కల్చర్ అమెరికాలో కలకలం క్రియేట్ చేస్తోంది. అమెరికాలో నిత్యం ఏదో ఒక చోట ఇలాంటి కాల్పుల ఘటనలు జరుగుతున్నాయి. అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి.