HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Deputy Cm Pawan Kalyan Letter To Cm Chandrababu

Pawan Kalyan : సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ లేఖ

క్యాంప్ కార్యాలయాన్ని విజయవాడ నుంచి మంగళగిరిలోని తన నివాసానికి మార్చుకోవాలని పవన్ నిర్ణయించుకున్నారు. దీంతో ఆ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. క్యాంప్ కార్యాలయం మార్పునకు ఆమోదం తెలపాలని లేఖలో కోరారు పవన్.

  • Author : Latha Suma Date : 12-09-2024 - 7:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Deputy CM Pawan Kalyan letter to CM Chandrababu
Deputy CM Pawan Kalyan letter to CM Chandrababu

Deputy CM Pawan Kalyan letter to CM Chandrababu : సీఎం చంద్రబాబుకు..డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ లేఖ రాశారు. క్యాంప్ కార్యాలయాన్ని విజయవాడ నుంచి మంగళగిరిలోని తన నివాసానికి మార్చుకోవాలని పవన్ నిర్ణయించుకున్నారు. దీంతో ఆ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. క్యాంప్ కార్యాలయం మార్పునకు ఆమోదం తెలపాలని లేఖలో కోరారు పవన్.

ఇంటినే క్యాంప్ కార్యాలయంగా వాడుకోవాలని నిర్ణయం..

ప్రస్తుతం విజయవాడలోని ఇరిగేషన్ భవనాన్ని…పవన్ క్యాంప్‌ కార్యాలయంగా వినియోగించుకుంటున్నారు. తనకు ఆ భవనాన్ని కేటాయించినందుకు సీఎంకు కృతజ్ఞతలు చెప్పారు పవన్. ఇప్పుడు ఇంటినే క్యాంప్ కార్యాలయంగా వాడుకోవాలని నిర్ణయించుకోవడంతో.. విజయవాడలో తనకు కేటాయించిన భవనాన్ని, ఫర్నిచర్స్‌ను వెనక్కి తీసుకోవలసిందిగా విజ్ఞప్తి చేశారు.

ఫర్నిచర్ తో సహా భవనం వెనక్కి..

కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టగానే పవన్ కళ్యాణ్ కు విజయవాడలోని జలవనరులశాఖకు చెందిన గవర్నర్ పేట క్యాంపు కార్యాలయాన్ని కేటాయించారు. అయితే మొదట్లో ఇక్కడకు వచ్చిన పవన్.. ఆ తర్వాత మాత్రం క్రమంగా దూరమయ్యారు. ప్రస్తుతం మంగళగిరిలోని తన నివాసంలోనే ఎక్కువగా ఉంటున్న పవన్ కళ్యాణ్.. విజయవాడ క్యాంపు కార్యాలయాన్ని వదిలేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు చంద్రబాబుకు లేఖ రాశారు. ఫర్నిచర్ తో సహా భవనం వెనక్కి ఇచ్చేస్తున్నట్లు పవన్ అందులో తెలిపారు.

బెజవాడ క్యాంపు కార్యాలయం కలిసి రాదనే ప్రచారం..

అంతేకాక.. ఈ క్యాంపు కార్యాలయానికి నెగెటివ్ సెంటిమెంట్ ఉంది. ఇందులో గతంలో ఉన్న మంత్రులంతా ఆ తర్వాత ఎన్నికల్లో ఓటమి పాలై పదవులు కోల్పోయారు. వీరిలో కొందరు రాజకీయంగా అప్రాధాన్యంగా మారిపోయారు కూడా. వీరిలో టీడీపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, వైసీపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. వీరంతా తమ హయాంలో ఈ ఆఫీసునే నివాసంగా మార్చుకుని ఉన్నారు. కానీ ఆ తర్వాత రాజకీయంగా దెబ్బతిన్నారు. దీంతో వాస్తుపరంగా మంత్రులకు బెజవాడ క్యాంపు కార్యాలయం కలిసి రాదనే ప్రచారం ఉంది.

Read Also: Rahul Gandhi : ఇకపై ఆయనతో సుదీర్ఘ చర్చలను కోల్పోతా : రాహుల్ గాంధీ

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • camp office
  • CM Chandrababu
  • Deputy CM Pawan Kalyan
  • letter
  • mangalagiri
  • vijayawada

Related News

Indrakeeladri

Vijayawada : ఇంద్రకీలాద్రికి పోటెత్తిభ‌క్తులు.. వేసవి దృష్ట్యా ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు

ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు శుక్రవారం భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేసవి సెలవుల నేపథ్యంలో తెల్లవారుజామున 5 గంటల నుంచే ఆలయానికి భక్తుల రాక పెరిగి, క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు ఉదయం 10.30 గంటల నుం

  • Electric Shock

    Vijayawada : విజయవాడలో బక్రీద్ పండుగ రోజు విషాద ఘటన.. కరెంట్ షాక్‌తో హోంగార్డు మృతి

  • Mahanadu

    Mahanadu : ముగిసిన మ‌హానాడు.. వ‌ర్చువ‌ల్‌గా 24 ల‌క్ష‌ల మంది హాజ‌రు

  • Mahandu 2026

    TDP : టీడీపీ మహానాడులో తెలంగాణపై చర్చ.. ఎన్టీఆర్, చంద్రబాబు సేవలను గుర్తుచేసిన నేతలు

  • Msme Summit 2026

    AP : ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ – 2026లో కీలక ఒప్పందాలు చేసుకున్న ఏపీ ప్ర‌భుత్వం

Latest News

  • New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

  • Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

  • Delhi : పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు.. 17 నెలల్లోనే కూతురు మృతి

  • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

  • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd