HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # IPL 2023
  • # Sri Rama Navami 2023
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Andhra Pradesh
  • ⁄Debt Budget Time Jagan Last Chance

Jagan Last Chance!: అప్పుల బడ్జెట్ టైం, జగన్ కు లాస్ట్ ఛాన్స్!

ఏపీ సిఎం జగన్ మోహన్ రెడ్డి చివరి బడ్జెట్ గురువారం ప్రజల ముందుకు రాబోతుంది. అప్పులు పెంచుకుంటూ పోతూ సగటున 13 శాతం తలసరి ఆదాయం పెరిగిందని డప్పు కొట్టే

  • By CS Rao Published Date - 08:10 AM, Thu - 16 March 23
Jagan Last Chance!: అప్పుల బడ్జెట్ టైం, జగన్ కు లాస్ట్ ఛాన్స్!

ఏపీ సిఎం జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) చివరి బడ్జెట్ గురువారం ప్రజల ముందుకు రాబోతుంది. అప్పులు పెంచుకుంటూ పోతూ సగటున 13 శాతం తలసరి ఆదాయం పెరిగిందని డప్పు కొట్టే బడ్జెట్ ను చూడబోతున్నాం. అప్పులను మూడు రెట్లు చేసిన జగన్ (Jagan) సర్కార్ బడ్జెట్ వార్షిక బడ్జెట్ అంచనా రూ.2.6లక్షల కోట్లకుపైగా ఉంది. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టే చివరి పూర్తి స్థాయి పద్దు ఇదే. ఎన్నికల నేపథ్యంలో వచ్చే ఏడాది ఓటాన్‌ అకౌంట్‌ పద్దుకు మాత్రమే పరిమితం కానుంది.

రెవెన్యూ రాబడిని మించి మరీ వ్యయాలు ఎంత పరిమితం చేస్తామంటున్నా అంచనాలకు మించే ఖర్చులు ఉన్నాయి.దీంతో రాష్ట్రంలో రెవెన్యూలోటు భయపెడుతోంది. ప్రతిసారీ రెవెన్యూ లోటును నియంత్రిస్తామని చెబుతున్నా అది సాధ్యం కాకపోగా అంచనాలు మించిపోతోంది. గడిచిన అయిదేళ్లలో ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతూనే ఉంది. తాజా పరిస్థితుల్లో రాష్ట్రంలో మరో సరళి ప్రబలిందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వరంగ కార్పొరేషన్ల నుంచి రుణాలు తెచ్చి కొన్ని కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. వాటిని తీర్చేందుకు రాష్ట్ర ఆదాయాన్ని మళ్లిస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్‌లోనే కార్పొరేషన్లకు గ్రాంట్లు మంజూరు చేసి, రుణాలు తీర్చాల్సి వస్తోంది. ఆ అప్పులతో రెవెన్యూ ఖర్చులు చేస్తున్నా వాటిని లెక్కల్లోకి చేర్చట్లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా రెవెన్యూ లోటును, ద్రవ్యలోటును ఉన్నదాని కంటే తక్కువగా చూపిస్తున్నారనే చర్చ జరుగుతోంది.

ఏమిటీ రెవెన్యూ లోటు?

రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ ఖర్చులు ఎక్కువైతే దాన్ని రెవెన్యూ లోటు అంటారు. దీన్ని ఎప్పటికప్పుడు పరిమితం చేసుకుంటే అదే అసలైన ఆర్థిక నిర్వహణ.

రెవెన్యూ రాబడి:

రాష్ట్రంలో సొంత పన్నుల ద్వారా వచ్చే ఆదాయం, పన్నేతర ఆదాయం, కేంద్రం ఇచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ కలిపి రెవెన్యూ రాబడి అవుతుంది. సొంత పన్నుల్లో జీఎస్టీ వసూళ్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం, భూమి శిస్తు, అమ్మకపు పన్ను, రాష్ట్ర ఎక్సైజ్ డ్యూటీలు, కేంద్రపన్నుల్లో వాటాలు, ఇతర పన్నులు-సుంకాల ద్వారా వచ్చే మొత్తం ఉంటాయి.

రెవెన్యూ ఖర్చులు:

జీతాలు, పింఛన్లు, సబ్సిడీలు, వడ్డీల చెల్లింపులతో పాటు ప్రభుత్వనిర్వహణ, ఇతర ప్రభుత్వ పథకాలకు వెచ్చించే మొత్తాలనూ రెవెన్యూ ఖర్చులే అంటారు. వీటితో ప్రభుత్వానికి ఆదాయం రాదు. రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ ఖర్చులు తక్కువ ఉంటే దాన్ని రెవెన్యూ మిగులు అంటారు. రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ ఖర్చులు అధికంగా ఉంటే రెవెన్యూ లోటు అంటారు. ప్రస్తుతం 2022-23 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అంచనాల్లో రెవెన్యూ లోటు రూ.17,036.15 కోట్లుగా ఉంటుందని లెక్కించారు. జనవరి వరకు 10 నెలల్లోనే ఇది రూ.47,958.78 కోట్లకు.. అంటే అంచనాలతో పోలిస్తే 281 శాతంగా ఉన్నట్లు లెక్కలు పేర్కొంటున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటును ప్రభుత్వమే రూ.17,036 కోట్లుగా అంచనావేసింది. తొలి పది నెలల్లోనే అది రూ.47,959 కోట్లకు చేరుకుంది. రెవెన్యూ వసూళ్లు తగ్గిపోవడం, రెవెన్యూ వ్యయాలను పరిమితం చేయలేని పరిస్థితుల్లో ఈ సవాలు ఎదురవుతోంది. రెవెన్యూ రాబడులు అంచనాలతో పోలిస్తే మరీ తగ్గిపోతున్నాయి. ఈ తేడాను ఈసారి బడ్జెట్ లో ఎలా సరిచేస్తారు అనేది చూడాలి.

Also Read:  3 Banks Collapse in a Week: అమెరికాలో ఏం జరుగుతోంది.. బ్యాంక్స్ దివాళాకు కారణాలేంటి?

Telegram Channel

Tags  

  • amaravati
  • andhra pradesh
  • ap
  • Budget
  • cm
  • debt
  • jagan
  • jagan mohan reddy
  • Last Chance
  • ycp
  • ysrcp
https://d31dai02dmgobf.cloudfront.net/wp-content/uploads/2022/03/divis-ad.jpeg

Related News

TDP Mahanadu: రాజమండ్రిలో టీడీపీ మహానాడు

TDP Mahanadu: రాజమండ్రిలో టీడీపీ మహానాడు

పార్టీలోకి 40 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి రానున్నారని మాట్లాడిన ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.

  • NTR Currency: ఎన్టీఆర్ పేరుతో కేంద్రం నాణెం విడుదల

    NTR Currency: ఎన్టీఆర్ పేరుతో కేంద్రం నాణెం విడుదల

  • TDP Foundation Day: 41 ఏళ్ల టీడీపీ ప్రస్థానం, NTR టు CBN

    TDP Foundation Day: 41 ఏళ్ల టీడీపీ ప్రస్థానం, NTR టు CBN

  • MLA Prasanna Kumar: నా చివరి రక్తం బొట్టు వరకు సీఎం జగన్‌తోనే.. పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన ప్రసన్నకుమార్..!

    MLA Prasanna Kumar: నా చివరి రక్తం బొట్టు వరకు సీఎం జగన్‌తోనే.. పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన ప్రసన్నకుమార్..!

  • Jagan Sketch: ఆ నలుగురిపై జగన్ స్కెచ్

    Jagan Sketch: ఆ నలుగురిపై జగన్ స్కెచ్

Latest News

  • Philippine Ferry Fire: ఫిలిప్పీన్స్ ఫెర్రీలో భారీ అగ్నిప్రమాదం.. 31 మంది మృతి

  • Jagan Delhi : ముగిసిన జ‌గ‌న్ ఢిల్లీ చ‌క్కర్లు, అసెంబ్లీ ర‌ద్దు?

  • Bird Flu: చిలీలో కలకలం.. మనుషుల్లో మొట్టమొదటి బర్డ్ ఫ్లూ కేసు..!

  • Power Strike: మెరుపు సమ్మెకు సిద్ధమవుతున్న విద్యుత్ ఉద్యోగులు.. డెడ్ లైన్ ఫిక్స్!

  • America:అమెరికాలోని కేతుంకిలో ఢీకొన్న రెండు ఆర్మీ హెలికాప్టర్లు. 6గురు సైనికులు మృతి

Trending

    • Business Idea : మీ ఊరిలో ఖాళీ స్థలం ఉందా, ఈ పండ్ల తోటతో నెలకు రూ. 1 లక్ష పక్కా…పెట్టుబడి అవసరం లేదు…!

    • Kuno National Park: 70 ఏళ్ల తరువాత జరిగిన అద్భుతం..4గురు పిల్లలకు తల్లి అయిన సియా..అసలు కథ ఇదే..

    • UPI Payment is Free: అంతా ఏప్రిల్ ఫూల్…యూపీఐ చార్జీల విషయంలో జరిగింది ఇదే…

    • UPI Payments: ఇకపై UPI ద్వారా పేమెంట్స్ చేస్తే మన జేబులు ఖాళీ అవ్వాల్సిందే..!

    • ISRO Recruitment 2023: నిరుద్యోగులకు గుడ్‎న్యూస్ ఇస్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..జీతం రూ. 40వేలకే పైనే

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: