3 Banks Collapse in a Week: అమెరికాలో ఏం జరుగుతోంది.. బ్యాంక్స్ దివాళాకు కారణాలేంటి?
అమెరికాలో బ్యాంకులు ఒకదాని తర్వాత ఒకటిగా సంక్షోభంలో కూరుకుపోతున్నాయి.మొన్న సిలికాన్ వ్యాలీ బ్యాంక్.. నిన్న సిగ్నేచర్ బ్యాంక్.. ఇకపై ఏ బ్యాంకో తెలియని
- By Maheswara Rao Nadella Published Date - 05:30 PM, Wed - 15 March 23

అమెరికాలో బ్యాంకులు (Banks) ఒకదాని తర్వాత ఒకటిగా సంక్షోభంలో కూరుకుపోతున్నాయి.మొన్న సిలికాన్ వ్యాలీ బ్యాంక్.. నిన్న సిగ్నేచర్ బ్యాంక్.. ఇకపై ఏ బ్యాంకో తెలియని పరిస్థితి నెలకొంది.. ఏ రోజున ఏ బ్యాంకు దివాలాను ప్రకటిస్తుందో అర్ధం కావడం లేదు..
సిలికాన్ వ్యాలీ బ్యాంక్.. సిగ్నేచర్ బ్యాంక్, సిల్వర్ గేట్ బ్యాంక్ ల పతనానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అంటున్నారు. ఆ బ్యాంకుల ఖాతాదారుల డిపాజిట్లు సురక్షితంగా ఉంటాయని ఆయన హామీ ఇస్తున్నారు. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ లో డిపాజిట్లు ఉన్నవాళ్లకు మార్చి 13 నుంచి డబ్బును విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించారు.
దేశ ఆర్ధిక వ్యవస్థను రక్షించడానికే సిగ్నేచర్ బ్యాంక్ పై చర్యలు తీసుకున్నామని అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రకటించింది. డిపాజిటర్ల సొమ్ముకు రక్షణగా ది ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎఫ్‌డీఐసీ).. సిగ్నేచర్ బ్యాంకును తన నియంత్రణలోకి తీసుకుంది. సిగ్నేచర్ బ్యాంక్ తో సిల్వర్ గేట్ బ్యాంకులు (Banks) క్రిప్టో కరెన్సీ మార్కెట్ పై ఎక్కువగా ఆధారపడి ఉండటం గమనార్హం. ఇంతకీ అమెరికా బ్యాంకులను ఈ సంక్షోభం ఎందుకు చుట్టుముట్టిందో ఒకసారి పరిశీలిద్దాం..
2008 బ్యాంకింగ్ సంక్షోభం రిపీట్ అవుతుందా?
కేవలం వారం రోజుల్లో 3 అమెరికన్ బ్యాంకులు దివాళా తీశాయి. సిల్వర్‌గేట్ బ్యాంక్, సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్‌విబి), సిగ్నేచర్ బ్యాంక్‌లు దివాళా తీశాయి. దీంతో 2008 నాటి ప్రపంచ బ్యాంకింగ్ రంగ సంక్షోభం రిపీట్ అవుతుందా ? అనే ఆందోళన ఆవరించింది. అప్పట్లో 150కి పైగా బ్యాంకులు కుప్పకూలి అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థ అల్లకల్లోలమైంది. ప్రస్తుతం దివాళా తీసిన 3 బ్యాంకుల్లో ఎస్‌విబి అమెరికాలోని 16వ అతి పెద్ద బ్యాంక్. ఇది చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, స్టార్టప్ కంపెనీల నుంచి డిపాజిట్లను సేకరించి, వాటికి అధికంగా రుణాలు ఇస్తుంటుంది. గత ఏడాది కాలంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ వస్తోంది. దీంతో రిస్క్ తీసుకుని ఎస్‌విబి లాంటి బ్యాంక్‌లలో డిపాజిట్లు పెట్టే బదులు ఇతర బ్యాంకుల్లో డిపాజిట్లు చేసుకునేందుకు డిపాజిట్‌దారులు మొగ్గుచూపారు.
ఫలితంగా ఎస్‌విబిలోని డిపాజిట్లు తగ్గిపోయాయి. వాటిని ఒక్కసారిగా డిపాజిటర్లకు అందరికి వెనక్కి ఇచ్చే నిధులు లేవు.దీంతో అమెరికన్ ట్రెజరీలో పదేళ్లకు పెట్టుబడిపెట్టిన బాండ్ల అమ్మకాలను ఎస్‌విబి మొదలుపెట్టింది. దీనివల్ల బ్యాంకుకు 1.8 బిలియన్ డాలర్ల నష్టం వచ్చింది. దీంతో ఒక్కరోజులో ఆ బ్యాంకు షేర్ విలువ 60 శాతం పడిపోయింది. 21 వేల కోట్ల డాలర్ల డిపాజిట్లు ఉన్న ఈ బ్యాంకులో 11 శాతం డిపాజిట్లకే ఇన్సూరెన్స్ ఉంది. ఇలా ఇన్సూరెన్స్ ఉన్న డిపాజిట్లకు 2,50,000 డాలర్ల వరకూ బ్యాంకు చెల్లిస్తుంది. మిగిలిన వాటికి ఆస్తుల అమ్మకం తర్వాత చెల్లిస్తుంది.
కొంప ముంచిన క్రిప్టో డిపాజిట్లు..
న్యూయార్క్‌లోని సిగేచర్ బ్యాంక్ కూడా 110 బిలియన్ డాలర్ల మేర దివాళా తీసింది. దీన్ని ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎఫ్‌డిఐసి) ఇప్పటికే స్వాధీనం చేసుకుంది. సిగేచర్ బ్యాంక్, సిల్వర్‌గేట్ బ్యాంక్ లు క్రిప్టో డిపాజిట్లను అధికంగా స్వీకరించడంతో కుప్పకూలాయి. ఎస్‌విబి, సిగేచర్ బ్యాంకు డిపాజిట్‌దారులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇన్సూరెన్స్ ఉన్నా, లేకపోయినా… మొత్తం డిపాజిట్లను ప్రభుత్వం చెల్లిస్తుందని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించారు.
Also Read: Gun Culture Ban: గన్ లైసెన్స్ ఎవరికి ఇస్తారు? భారత ఆయుధ చట్టం ఏం చెబుతోంది?

Related News

Sperm Donor: స్పెర్మ్ డొనేషన్ ద్వారా 550 మందికి తండ్రి అయిన డాక్టర్.. ఎక్కడంటే..?
ఈ రోజు మనం చెప్పబోయే వ్యక్తి స్పెర్మ్ డొనేషన్ (Sperm Donor) ద్వారా 550 మంది పిల్లలకు జన్మనిచ్చాడు. నెదర్లాండ్స్‌లోని ది హేగ్ నగరంలో నివసించే జొనథన్ ఎం(41) అనే వైద్యుడు.. వీర్యదానం ద్వారా 550 మందికి తండ్రి అయ్యాడు.