CM Chandrababu : శ్రీ సిటీలో పలు ప్రాజెక్టులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ఇక్కడ మొత్తం 15 పరిశ్రమలకు సంబంధించిన కార్యకలాపాలను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.
- By Latha Suma Published Date - 03:05 PM, Mon - 19 August 24

CM Chandrababu: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు నెల్లూరు, తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తిరుపతి జిల్లా శ్రీ సిటీలో పర్యటించారు. ఈ మేరకు చంద్రబాబు పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. మరో సంస్థలకు ఆయన శంకు స్థాపన చేసారు. ఇక్కడ మొత్తం 15 పరిశ్రమలకు సంబంధించిన కార్యకలాపాలను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.
We’re now on WhatsApp. Click to Join.
శ్రీసిటీలోని బిజినెస్ సెంటర్ లలో పలు కంపెనీల సీఈవోలతో జరిగే సమావేశంలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలపై సీఎం మాట్లాడారు. వీటిలో దాదాపు 2740 మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్టు తెలిపారు చంద్రబాబు. రూ.900 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్టు వెల్లడించారు. 2047 వరకు ప్రపంచంలోనే భారత్ నెంబర్ వన్ గా నిలుస్తుంది. ప్రతీ నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరూ భారతీయులు ఉంటారని తెలిపారు చంద్రబాబు. పెట్టుబడులు రాబట్టేందుకు పలు దేశాల్లో పర్యటించానని తెలిపారు. శ్రీ సిటీలోని 8 వేల ఎకరాల్లో పరిశ్రమలు ఏర్పాటు అయ్యాయి. గతంలో పీపీపీ విధానంలో హైటెక్ సిటీ నిర్మాణం చేపట్టాం. ప్రభుత్వానికి పరిశ్రమల ద్వారానే అధిక ఆదాయం సమకూరుతుందని తెలిపారు.
కాగా, మరో రూ.1213 కోట్ల పెట్టుబడులకు సంబంధించి నాలుగు కంపెనీలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుందని సమాచారం. చంద్రబాబు చేతులు మీదుగా సౌత్ కొరియాకు చెందిన ఎల్‌జికెమ్, ఇజ్రాయెల్ కు చెందిన నియోలింక్, జపాన్ కు చెందిన నైడిక్, జర్మనీకి చెందిన బెల్, ఓజేఐ ఇండియా ప్యాకేజ్, అడ్మైర్, బాంబేకోటెడ్ స్పెషల్ స్టీల్, ఇఎస్ఎస్కేఏవై, ఆటో డేటా, ఈప్యాక్, ఎవర్ షైన్, జెన్ లెనిన్, జేజీఐ, త్రినాథ్ సంస్థల కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఇదే క్రమంలో ఏపీ ప్రభుత్వం పెట్టుబడులకు సంబంధించి మరికొన్ని కంపెనీలతో ఒప్పందాలు చేసుకోనుంది.
Read Also: CM Revanth : దుర్గకు మేమున్నాం.. అన్ని విధాలా సాయం చేస్తాం.. సీఎం రేవంత్ ప్రకటన