CM Chandrababu : తిరుమల ప్రసాదంపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
CM Chandrababu : మంగళగిరిలో జరిగిన ఎన్డీఏ శాసన సభాపక్ష సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారని, జగన్ హయాంలో నాణ్యతలేని పదార్ధాలతో లడ్డూలు తయారు చేశారని ఆరోపించారు.
- By Kavya Krishna Published Date - 07:50 PM, Wed - 18 September 24

Chandrababu : తిరుమల ప్రసాదంపై సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలో జరిగిన ఎన్డీఏ శాసన సభాపక్ష సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారని, జగన్ హయాంలో నాణ్యతలేని పదార్ధాలతో లడ్డూలు తయారు చేశారని ఆరోపించారు. వేంకటేశ్వరస్వామి పవిత్రత దెబ్బ తీశారన్నారు సీఎం చంద్రబాబు. అన్ని ట్రస్ట్ బోర్డుల్లో బ్రహ్మీన్.. నాయీ బ్రహ్మీన్ను మెంబర్లుగా వేస్తున్నామని, విభజన హామీలపై తెలంగాణ, కేంద్రంతో చర్చిస్తున్నామన్నారు. విభజన హామీలు నెరవేర్చేలా కేంద్రం కూడా సహకరిస్తోందని ఆయన తెలిపారు. టీటీడీలో ఎన్నో అక్రమాలు చేస్తున్నారు.. ఎన్నో ఫిర్యాదులు వస్తున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. అన్న ప్రసాదంలో క్వాలిటీ లేకుండా చేశారని ఆయన మండిపడ్డారు. ప్రసాదంలో నాసిరకం మెటిరీయల్ వాడుతున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. వేంకటేశ్వరస్వామి పవిత్రత దెబ్బతీస్తున్నారని, దేవుని దగ్గర పెట్టే ప్రసాదాన్ని అపవిత్రం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల ప్రసాదంలో నెయ్యికి బదులు యానిమల్ ఫాట్ వాడారని,, స్వచ్ఛమైన నెయ్యిని వాడాలని సూచించామని ఆయన పేర్కొన్నారు. వేంకటేశ్వర స్వామి ఏపీలో ఉండడం మన అదృష్టమని, వేంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడేలా చర్యలు తీసుకుంటామన్నారు సీఎం చంద్రబాబు.
అయితే.. మరో ఎన్నికల హామీపై సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. ఉచిత గ్యాస్ పంపిణీ స్కీంను దీపావళి నుంచి ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. దీపావళికి వీలైతే ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఆయన తెలిపారు. అభివృద్ధి పనులను స్ట్రీమ్ లైన్ చేస్తామని, వరద సాయం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 350 కోట్లు వచ్చాయన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. వరద సాయం కోసం ఎమ్మెల్యేలంతా ఒక నెల జీతాన్ని విరాళంగా ఇద్దామని ఆయన అన్నారు. బుడమేరు కబ్జాలకు గురైందని ఆయన తెలిపారు. కనివినీ ఎరుగని రీతిలో వరద వచ్చిందని, వరదలో బాధితుల కష్టాలు వర్ణనాతీతం అని ఆయన వెల్లడించారు. వరద బాధితులకు బెస్ట్ ప్యాకేజీ ఇవ్వాలనుకున్నామని, రికార్డు స్థాయిలో వరద బాధితులకు బెస్ట్ ప్యాకేజీ ఇచ్చామన్నారు సీఎం చంద్రబాబు. ఎన్నికల ముందు మూడు పార్టీల మధ్య ఉన్న సమన్వయం అద్భుతమని, ఈ వంద రోజుల్లో కూడా అదే సమన్వయంతో పని చేశారన్నారు సీఎం చంద్రబాబు.
Read Also : Raghunandan Rao : కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌పై రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు